Lucky Moles: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?
Lucky Moles News in Telugu: మనుషుల భవిష్యత్తును తెలియజేయడంలో పుట్టుమచ్చలకు ప్రత్యేక స్థానం ఉందట. మరి వ్యక్తులకు అదృష్టాన్ని ఇచ్చే పుట్టుమచ్చలు శరీరంలో ఎక్కడ ఉంటాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
Interesting Facts about Lucky Moles: మనుషుల జీవిత చక్రాన్ని తెలియజేయడంలో పుట్టుమచ్చలకు ప్రత్యేక స్థానం ఉంది. వ్యక్తుల స్వరూప స్వభావాలను గుర్తించడంలోనూ పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తాయట. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచడమే కాకుండా, అదృష్ట.. దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ, పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు వేరు ఫలితాలను ఇస్తాయట. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి, అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితాలు ఉంటాయని ఆ రంగంలోని నిపుణులు చెప్తున్నారు. అయితే మనుషుల శరీరం మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
మానవ దేహంలోని కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఆ వ్యక్తిని అదృష్టయోగాన్ని ఇస్తాయని పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. శరీరంలోని వివిధ భాగాలలో పుట్టుమచ్చల స్థానం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి శుభ మరియు అశుభ సంకేతాలను సూచిస్తాయంటున్నారు.
ALSO READ: డార్జిలింగ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ టైం అస్సలు మిస్ అవ్వద్దు
ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ:
చాతీ మధ్యలో పుట్టుమచ్చ ఉంటే అది ఎంతో అదృష్టదాయకం అంటున్నారు. ఈ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకు లక్ష్మీ దేవి అనుగ్రమం ఉంటుందట. వారి యొక్క సంపద, శ్రేయస్సు పెరుగుతుందట. ఈ వ్యక్తులు సమాజంలో విభిన్నమైన గుర్తింపును పొందుతారట. వీరు ప్రణాళికలు రచిండంలో.. మరియు వ్యూహాలను పన్నటంలో ఆరితేరి ఉంటారట.
పెదవుల కింద పుట్టుమచ్చ:
పెదవుల క్రింద పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులకు ఇతరుల పట్ల ప్రేమ, అప్యాయత ఎక్కువగా ఉంటుందట. ఎవరినైనా అభిమానించినా.. ప్రేమించినా హృదయపూర్వకంగా చేస్తారట. ప్రేమను పంచడంలోనూ వీరికి వేరే సాటి అని పుట్టమచ్చల శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
నుదిటికి ఎడమ వైపున పుట్టుమచ్చ:
నుదురుకి ఎడమ వైపు పుట్టుమచ్చ ఉంటే వ్యక్తులు ఎంత సంపాదించినా ఆ సంపాదన నిలువదట. అనవసరమైన ఖర్చుల రూపంలో ధనం వెళ్లిపోతుందట.
రెండు కనుబొమ్మలపై పుట్టుమచ్చ:
రెండు కనుబొమ్మలపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు తరుచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుందట. అలాగే వీరికి పెళ్లి త్వరగానే అవుతుందట. మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి భార్యగా వస్తుదట. భార్య వల్లనే అదృష్టం కలిసి వస్తుందట.
కుడి అరచేతిలో పుట్టుమచ్చ:
కుడి అరచేతిలో ఉన్న పుట్టుమచ్చ వ్యాపారంలో విజయానికి సానుకూల సంకేతమట. అటువంటి వ్యక్తులు వారి కెరీర్ ప్రారంభంలో కీర్తి మరియు ఆర్థిక శ్రేయస్సును సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
ఇక కుడి కనుగుడ్డుపై పుట్టుమచ్చ ఉంటే తాత్విక ఆలోచనా పరుడు అవుతాడట. అధికమైన తెలివితేటలు ఉంటాయట. నుదిటికి కుడివైపున పుట్టమచ్చ ఉంటే స్థిరంగా డబ్బు సంపాదన పెరుగుతుందట. కానీ అరుదుగా కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందలు ఎదుర్కొంటారట. కుడి కణతపై, ఎడమ కణతపై, కుడి కన్ను రెప్పపై, కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుందట. ముక్కు కుడి భాగంలోనూ, కుడి చెంపపై, చెవులపై, నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయట.
ఇక శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనే విషయం కూడా చాలా ముఖ్యమేనట. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి. మరికొన్ని ఎరుపుగాను, ఆకుపచ్చగాను, తేనెరంగుగాను, పసుపుపచ్చగాను, గంధపు రంగుగా ఉంటాయి. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి అధిక శుభాలు కలుగుతాయట.
ALSO READ: పొరపాటున కూడా చెత్త కుండీని ఇంట్లో ఈ దిక్కున పెట్టకండి. లేదంటే ధన నష్టం వాటిల్లుతుందట