చాణక్య నీతి: ఎవర్ని ఎలా ఆకర్షించాలి - ఇదిగో టిప్స్!
ప్రస్తుత సమాజంలో నెగ్గుకుని దూసుకెళ్లాలంటే చుట్టూ ఉండే వ్యక్తుల మనస్తత్వాల ఆధారంగా కూడా అడుగులు వేయాల్సి ఉంటుంది
రకరకాల మనుషులు..ఇలాంటి వాళ్ల మధ్య ఎలా నెగ్గుకురావాలో అనుకుంటారు కానీ ..చాలా సింపిల్ టిప్స్ అప్పట్లోనే చెప్పాడు చాణక్యుడు
అందరి దగ్గరా ఒకేలా ఉంటాను అనుకుంటారు కానీ..అది సరికాదంటాడు ఆచార్య చాణక్యుడు.. ఎవర్ని ఎలా ఆకట్టుకోవాలో కొన్ని సూచనలు చేశాడు
అత్యాశ ఉన్న వ్యక్తులకు.. వారికి అవసరం అయినది కాస్త ఎక్కువగా ఇస్తే చాలు సులభంగా ఆకట్టుకోవచ్చు
ప్రశంసలకు పొంగిపోయే మూర్ఖులకు..వారు కోరుకున్న మర్యాద, నాలుగు ప్రశంసలు ఇస్తే చాలు పడిపోతారంతే..
బుద్ధిమంతుల విషయంలో ఇవి నడవవు..అలాంటి వారిని మెప్పించాలంటే వాళ్ల దగ్గర నిజం మాత్రమే మాట్లాడాలి..అప్పుడే వాళ్లు ఓ మెట్టు దిగివస్తారు
ప్రపంచం ఏమైపోయినా డబ్బే ముఖ్యం అనుకునేవారుంటారు.. అలాంటి వారిని డబ్బుతోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. వారి రేటెంతో తెలుసుకోవడం ముఖ్యం..
మనిషికి అందం, ఐశ్వర్యం కన్నా విద్య , జ్ఞానం , నిజాయితీ చాలా ముఖ్యం.. అయితే అతి నిజాయితీపరుడిగా వ్యవహరించినా చిక్కులు తప్పవని గమనించాలి..
అడుగు ముందుకు వేయాలంటే భయం వేసే సందర్భం ఎదురైతే మిమ్మల్ని మీరు అసహ్యించుకోమని చెప్పాడు చాణక్యుడు... అప్పుడే దూకుడుగా అడుగులు వేయగలరు అన్నది చాణక్యుడి భావన
అత్యాస, దురాశ, అబద్ధానికి దూరంగా ఉంటూ..ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉండేవారే అన్నివిధాలుగా ఆనందంగా ఉంటారు..