చాణక్య నీతి: ఇలాంటి స్త్రీ ప్రేమను పొందే పురుషుడి జన్మ ధన్యం!
ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం ముఖ్యమైన సంస్కారం..షోడస సంస్కారాల్లో పెళ్లి ఒకటి..
జీవిత భాగస్వామిగా తన ఇంటికి ఆహ్వానించే స్త్రీ విషయంలో పురుషులు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించాడు ఆచార్య చాణక్యుడు
ఎలాంటి స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా పురుషుడి జీవితం ధన్యమవుతుందో తన నీతిశాస్త్రంలో వివరించాడు
మీ మనసు తెలుసుకుని నడుచుకునే స్త్రీ మీ జీవితంలో అంతులేని సంతోషాన్ని నింపుతుంది. బాహ్య సౌందర్యం కొన్నాళ్లకి మసకబారుతుంది కానీ కానీ మంచి స్వభావానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు
చిన్న చిన్న విషయాలకు కూడా కోపం లేని స్త్రీ మీ జీవితంలోకి రావడం కన్నా అదృష్టం లేదు. బంధాలను చిదిమేయడంతో కోపానిదే అగ్రస్థానం.
పెద్దలను గౌరవించాలి..పిల్లల్ని ప్రేమించాలి...భర్త అవసరాలు తెలుసుకుని మెలగాలి. కష్టం వచ్చినప్పుడు తానున్నా అనే భరోసా ఇవ్వగలగాలి..ఈ స్త్రీని ప్రేమను పొందే పురుషుడి జన్మ ధన్యం
అందం, ఆస్తిపాస్తులకు ఆకర్షితురాలయ్యే స్త్రీ ప్రేమ ఎంతో కాలం నిలవదు... వ్యక్తిగతంగా మిమ్మల్ని మాత్రమే మెచ్చి మీ జీవితంలో వచ్చే స్త్రీ ఎప్పటికీ మీ వెంటే నడుస్తుంది
వివాహానికి కులం, మతం చాలా ముఖ్యం అని బోధించాడు చాణక్యుడు. పెళ్లికి ఇవి ఎంతమాత్రం అడ్డుకాదు అనుకుంటారు కానీ వివాహం తర్వాత జీవితంలో సంతోషానికి ఇవి తప్పనిసరిగా అడ్డుగోడలే అన్నది చాణక్యుడి అభిప్రాయం..
ఇలాంటి స్త్రీని వదులుకునే పురుషుడి జన్మ వ్యర్థం అని కూడా హెచ్చరించాడు ఆచార్య చాణక్యుడు