తిరుమలలో దర్శనం తర్వాత ఇది మిస్సవొద్దు!
తిరుమలలో స్వామివారి దర్శనం అయ్యాక అలానే వెనక్కు తిరిగి వచ్చేస్తారు
బయట ప్రదక్షిణ చేస్తూ విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు
చాలామంది తెలియక మిస్సయ్యేది ఏంటంటే.. తిరుమలలో అరుగు మీద తీర్థం ఇస్తారు..
ఆ తీర్థం అస్సలు మిస్సవొద్దు..ఈ తీర్థానికి అత్యంత ప్రత్యేకత ఉంది..
తిరుమల ఆలయంలో నిత్యం రాత్రివేళ బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామివారిని అర్చిస్తారు
ఆ అర్చన కోసం రాత్రివేళ ప్రత్యేక పాత్రలో తీర్థం పెట్టి ఉంచుతారు అర్చకులు
ఆ జలంతోనే బ్రహ్మదేవుడు..శ్రీ వేంకటేశ్వరుడికి అర్చన చేస్తారని పురాణాల్లో ఉంది
ఆ జలాన్నే మామూలు నీళ్లలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చాక తీర్థంగా అందిస్తారు
బ్రహ్మదేవుడి స్పర్శతో పునీతమైన తీర్థం అది..అందుకే తీర్థం తీసుకునే బయటకు రండి..