చాణక్య నీతి: సిన్సియర్ గా పనిచేసేవారి కోసం చాణక్యుడు చెప్పిన సూత్రాలు
భారతదేశంలో నాయకత్వ గురువులలో ఆచార్య చాణక్యుడి స్థానం ప్రత్యేకం
మంచి నాయకుడిగా ఎలా ఎదగాలో మాత్రమేకాదు సవాళ్లను అధిగమించడం ఎలానో కూడా సూచించాడు ఆచార్య చాణక్యుడు
సిన్సియర్ గా పనిచేసేవారికోసం ఆచార్య చాణక్యుడు కొన్ని సూచించాడు..అవేంటంటే...
ఓ వ్యక్తి అత్యంత నిజాయితీగా ఉండకూడదు.. నిటారుగా ఉన్న చెట్లనే ముందుగా నరికేస్తారు. అలా నిజాయితీపరులకు కష్టాలు తప్పవు..
ఏ విషయంలో అయినా స్వీయ నియంత్రణ తప్పనిసరిగా ఉండాలి
ఎందుకు చేస్తున్నాను, ఫలితం ఎలా ఉంటుంది, విజయవంతం అవుతానా.. ఈ 3 ప్రశ్నలకు సమాధానం దొరికాక ఏదైనా పని ప్రారంభించండి
ఏదైనా పని ప్రారంభించాక ఫలితం గురించి టెన్షన్ పడొద్దు. సిన్సియర్ గా ప్రయత్నించండి విజయం మీ సొంతం అవుతుంది
మీ ఆనందం, విజయం అన్నీ మీరు ఎంపిక చేసుకునే స్నేహితులపై ఆధారపడి ఉంటుంది. అందుకే స్నేహాలు, పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి..