రాధ పాదాలకు నమస్కరించిన కృష్ణుడు..ఎందుకో తెలుసా!
రాధా కృష్ణుల మధ్య సంభాషణ ఆత్యద్భుతం..ప్రతి పదం ప్రేమమయం.. అందుకు నిదర్శనంగా చెప్పే సంఘటనలెన్నో...
జన్మదినం సందర్భంగా ఏదైనా కోరుకో అని కృష్ణుడు అంటే...నువ్వే నా సొంతం అయినప్పుడు నీకన్నా విలువైనది ఇవ్వగలవా అని అడిగింది రాధ
కృష్ణుడికి దగ్గరగా వచ్చి పాదాలకు నమస్కరించి..ఆ తర్వాత ప్రేమగా హత్తుకుని..నీ కన్నా నాకు కావాల్సిందేటని చెప్పింది
మరి నీకేం కావాలని రాధ అడిగితే.. కాసేపు రాధనే చూస్తుండిపోయిన మాధవుడు ఇప్పుడు కూడా నువ్వే కోరుకో అంటూనే.. నా కన్నా విలువైనది కోరుకోవాలంటూ మెలిక పెట్టాడు
హాయిగా నవ్వేసిన రాధారాణి..నీ కన్నా విలువైనదా...అయితే నేనే అని సమాధానం చెప్పింది.. అప్పుడు ఆశ్చర్యపోవడం కృష్ణుడి వంతైంది..
నా కన్నా నువ్వు విలువైనదానివి ఎలా అవుతావని అడిగాడు కన్నయ్య... నీ ప్రేమకు నేను యజమానిని అయినప్పుడు నువ్వు నా బానిసవు..
మరి నిన్ను నువ్వే ఎలా కోరుకుంటావ్ అని మరో ప్రశ్న సంధించాడు కృష్ణుడు.. ఎప్పటికీ నీ ప్రేమకు యజమానిగానే ఉండిపోవాలని సమాధానం చెప్పింది..
అందుకే మరి రాధ ప్రేమకు కృష్ణుడు ఎప్పటికీ దాసోహమే..అంత మంచి ప్రేమ దొరకడం కన్నా విలువైనది ఏముంటుంది అనుకుంటూ రాధ పాదాలు తాకాడు..
చటుక్కున పాదాలు వెనక్కు లాక్కున్న రాధా రాణి..ఏంటి కృష్ణా నువ్వు నా పాదాలు ముట్టుకోవడం ఏంటని ప్రశ్నించింది...
బానిస యజమానికి నమస్కరించాలి కదా అని బదులిచ్చాడు జగన్నాథుడు..ఆ మాటకు రాధ చెక్కిళ్లనుంచి పొంగిన నీటి ధార ఆ ప్రేమికులకు అభిషేకం చేశాయి..
వారి ప్రేమకు బృందావనం మొత్తం ప్రణమిల్లింది..