![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Meghasandesham Serial Today October 10th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమిని నిజం చెప్పమన్న శారద – గగన్ కు ఫోన్ చేసి లవ్ ప్రపోజ్ చేసిన నక్షత్ర
Meghasandesham Today Episode: భూమి తన పక్కనే ఉన్నట్లు భ్రమ పడుతున్న గగన్ నిజంగానే భూమి ఎదురుగా వచ్చినా నమ్మడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Meghasandesham Serial Today October 10th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమిని నిజం చెప్పమన్న శారద – గగన్ కు ఫోన్ చేసి లవ్ ప్రపోజ్ చేసిన నక్షత్ర meghasandesham serial today episode October 10th written update Meghasandesham Serial Today October 10th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమిని నిజం చెప్పమన్న శారద – గగన్ కు ఫోన్ చేసి లవ్ ప్రపోజ్ చేసిన నక్షత్ర](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/09/74630fa1e3e99b34ba5a36c4bdfd51581728495509029879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Meghasandesham Serial Today Episode: గగన్, భూమి గురించి ఆలోచిస్తుంటాడు. భూమి వచ్చి తనకు స్నానం చేయించినట్టు ఊహించుకుంటాడు. తర్వాత ఏమైంది నాకు భూమి గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను అనుకుంటాడు. ఇంతలో నక్షత్ర, గగన్ కు కాల్ చేస్తుంది. హాయ్ బావ అని పలకరిస్తుంది. బావేంటి బావ అంటూ అంటాడు దీంతో ఇంట్లో జరిగిన సంగీత్ గురించి చెప్తూ భూమి డాన్స్ బాగా నేర్పింది అని చెప్తుంది. భూమి ఏంటి గోరు ముద్దలు తినిపిస్తుంది. ఏంటి లవ్వా అని అడిగి లేకపోతే ప్రాబ్లమ్ లేదు కానీ ఒకవేళ ఉంది అంటే మాత్రం చంపేస్తా అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో భూమి పాలు తీసుకుని గగన్ రూంలోకి వస్తుంది.
గగన్: ఇదేంటి అయిపోయిందనుకున్న భ్రమ మళ్లీ మొదలయ్యిందా?
భూమి: ఏంటి ఆంటీ పాలు తాగమంటే తాగను అన్నారంట. తాగండి
గగన్: ఎన్నిసార్లు మోసపోతాను. ఇదే భ్రమే..
భూమి: భ్రమేంటి భ్రమ పాలు తాగండి.
గగన్: అరే భ్రమ కూడా నిజంలా అనిపిస్తుందే..
భూమి: అయ్యా తలతిక్క గారు ఇది భ్రమ కాదు పాలు చల్లారిపోతాయి తాగండి.
గగన్: ఇప్పుడు కూడా క్యారెక్టర్ మారడం లేదు తలతిక్కగారు అంట.
భూమి: ఎంటి ఇందాకటి నుంచి ముందు పాలు తాగండి.
అంటూ భూమి శారదను పిలుస్తుంది. శారద, పూరి పరిగెత్తుకొస్తారు. దీంతో రా అమ్మా భూమి లేదు కదా ఇక్కడ. కానీ ఇందాకటి నుంచి నన్ను పాలు తాగు అంటుంది. ఇది భ్రమ కదా? అంటాడు. దీంతో శారద భ్రమ ఏంటిరా భ్రమ నిజంగానే ఉంది అనగానే మీ అబ్బాయికి ఏమో అయింది. ఆయన్ని హాస్పిటల్ లో చూపించండి అని చెప్తుంది భూమి. శారద, భూమిన పక్కకు తీసుకెళ్తుంది.
శారద: ఏంటమ్మా ఇది అసలేం జరుగుతుంది. ఉన్నప్పుడేమో లేదు అటున్నాడు. లేనప్పుడేమో ఉంది అంటున్నాడు. వాడికేమైందో నీకేమైందో నాకు అర్థం కావడం లేదు. నువ్వేమో వాడి కోసం క్యారేజ్ తీసుకెళ్లావట. అడిగితే నేను తీసుకెళ్లమని చెప్పావట నువ్వు.
భూమి: అది…
శారద: ఎప్పుడూ లేనిది ఉదయాన్నే వచ్చి వంట చేస్తానన్నావు. వాడికి ఇష్టమైన వంటకాలు అడిగి తెలుసుకున్నావు. అవే వంటలు చేసుకుని తీసుకెళ్లావు. నిజం చెప్పు వాడిని ఇష్టపడుతున్నావా? భయపడకుండా నిజం చెప్పు. నీలాంటి కోడలు రావాలనుకున్నాను. నువ్వే కోడలుగా వస్తానంటే నా అదృష్టం
భూమి: ఇప్పుడు నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తే.. ఆ తర్వాత మా నాన్న శరత్‌చంద్ర గారని చెప్పాలి. అప్పుడు కచ్చితంగా నన్ను కాదంటారు. ముందు ఆయనకు నాన్న మీద ఉన్న కోపం పోవాలి. నా మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలి. ( అని మనసులో అనుకుంటుంది.)
శారద: ఏంటమ్మా మాట్లాడవు.. నాతో చెప్పడానికి ఆలోచిస్తున్నావెందుకు.
భూమి: నా మనసులో అలాంటి ఉద్దేశం లేదు ఆంటి. కానీ ఆయన మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం.
అని చెప్పగానే శారద వెళ్లిపోతుంది. మరోవైపు కృష్ణప్రసాద్ ఫ్యాక్టరీ గురించి, శోభాచంద్ర గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంటాడు. ఇంతలో మీరా రావడంతో ఫ్యాక్టరీ తగులబెట్టడం గురించి హాస్పిటల్ లో ఉండాల్సిన మనిషి ఫ్యాక్టరీలో ఎందుకుంది అని అడుగుతాడు. దీంతో మీరా ప్రసాద్‌ను లోపలికి తీసుకెళ్తుంది. మరోవైపు అపూర్వ, శోభాచంద్ర ఫోటో దగ్గరకు వెళ్లి నీ కూతురును కూడా నీ దగ్గరకే పంపిస్తానని చెప్తుంది. ఇంతలో అపూర్వ హాస్పిటల్ లో నాగును చంపినప్పుడు చూసిన నర్సు వస్తుంది. నర్సును చూసిన అపూర్వ షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. డబ్బుల ఇచ్చి నర్సును పంపిచేస్తుంది అపూర్వ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్: అనామికకు కనకం మాస్ వార్నింగ్ – రాజ్ ను కలలో కూడా వదలని కావ్య
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)