Meghasandesam Serial Today September 5th: ‘మేఘసందేశం’ సీరియల్: కేపీ కోసం వెతికిన మీరా – శారదతో పూజలో పాల్గొన్న కేపీ
Meghasandesam serial today episode September 5th: గుడిలో జరిగే వరలక్ష్మీ వ్రతంలో శారదతో కలిసి పాల్గొంటాడు కేపీ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: బొమ్మతో బయటకు వచ్చిన రత్నం వెంటనే అపూర్వకు ఫోన్ చేసి చెప్తుంది. దీంతో అపూర్వ లొకేషన్ షేర్ చేస్తాను అక్కడకు వచ్చేయ్ అని చెప్తుంది. సరే అంటుంది రత్నం. అపూర్వ ఒక గెస్ట్ హౌస్‌కు వెల్లి లోకేషన్ పెడుతుంది. బొమ్మతో రత్న అక్కడకు వెళ్తుంది. అపూర్వ కాళ్లు మొక్కుతుంది.
అపూర్వ: చల్లగా ఉండు.. నువ్వు చల్లగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటానే రత్నం. ఇంతకీ ఏదీ ఆ బొమ్మ.
రత్న: ఇస్తున్నాను అమ్మ
అంటూ సంచిలోంచి బొమ్మను తీసి అపూర్వకు ఇస్తుంది. బొమ్మలోని కెమెరా కోసం వెతుకుతుంది అపూర్వ. ఎంత వెతికినా కెమెరా కనిపించదు.
రత్న: ఏమైంది అమ్మగారు..?
అపూర్వ: వీడియో రికార్డర్ ఏదే..?
రత్న: అందులోనే ఉంటుంది కదా అమ్మగారు..
అపూర్వ: లేదే..? చూసుకుని తీసుకురావాలి కదే రత్నం.
రత్న: బొమ్మలోనే ఉంటుంది కదా అమ్మగారు. బొమ్మతోనే వచ్చేసి ఉంటుంది అనుకున్నాను.
అపూర్వ: అయ్యో.. చివరికి మా పిన్నికి కూడా అసలు ఎవ్వరికీ కూడా ఈ వీడియో రికార్డర్ గురించి చెప్పలేదే ఒక్క నీకే చెప్పాను. చెక్ చేసుకోవాలి కదా..? అయ్యో మిస్ అయిపోయాను. ఇప్పుడది ఎవరి చేతుల్లో పడిందో ఏంటో..? ఆ గగన్ గాడి చేతిలోనో ఇంకొకరి చేతిలోనో పడి ఆ వీడియో కనక చూశారో నేను అయిపోయినట్టే.. రత్నం
రత్నం: చెప్పండి అమ్మ..
అపూర్వ: నువ్వు మళ్లీ వెళ్లి తిరిగి ఆ కెమెరా తీసుకురాలేకపోయావో మనం దొరికిపోయినట్టే. ఈ బొమ్మతో సహా వెళ్లి ఆ ఇంట్లోనే ఆ కెమెరా ఉంటుంది వెళ్లి తీసుకురా
రత్న: అయ్యో అమ్మగారు ఎలాగూ బొమ్మతో సహా వచ్చేస్తున్నాను కదా అని వాళ్లందిరతో గొడవ పెట్టుకుని వచ్చాను అమ్మా.. మళ్లీ వెళ్లడం కష్టం.
అపూర్వ: రత్నం ఎప్పుడు నువ్వు నా కాళ్లకు దండం పెడతావు కదా..? ఇప్పుడు నేను నీకు దండం పెడతాను
అంటుంటే వద్దులే అమ్మా ఎలాగైనా వెళ్లి మళ్లీ వీడియో రికార్డర్ తో వచ్చేస్తాను అని చెప్తుంది. తర్వాత శరత్ చంద్ర ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు. అందరూ హడావిడిగా ఉంటారు. ఇంతలో మీరా.. కేపీ కోసం వెతుకుతుంది. ఎక్కడా కనిపించడు. దీంతో కిందకు వచ్చిన మీరా చెర్రిని పిలుస్తుంది.
చెర్రి: ఏంటమ్మా.. పిలిచావు..
మీరా: మీ నాన్న కనిపించారా..?
చెర్రి: రూంలోనే ఉన్నారు కదమ్మా..
మీరా: రూంలో లేడురా..
చెర్రి: లేడా.. మరి ఎక్కడికి వెళ్లాడు..
మీరా: ఏమో ఎక్కడికి వెళ్లారో తెలుసుకో.. త్వరగా ఇంటికి రమ్మను పూజకు టైం అవుతుంది.
అంటూ మీరా చెప్పగానే చెర్రి సరే అంటాడు. కేపీ మాత్రం గుడిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగే చోట శారదతో కలిసి పూజలో కూర్చుని ఉంటాడు. పంతులు గారు భర్తలందరూ భార్యలకు కంకణ ధారణ చేయండి అని చెప్పగానే కేపీ, శారదకు కంకణం కడతాడు. మరోవైపు బ్యాచిలర్ పార్టీలో ఉన్న గగన్ ఏడుస్తూ భూమిని గట్టిగా హగ్ చేసుకుని ఉంటాడు.
గగన్: మన మధ్య మూడో మనిషికి చోటు ఇవ్వొద్దు.. గాలి కూడా కాలి ఇవ్వొద్దు. ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా వదలను.
అంటూ భూమిని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. అంతా చూస్తుంటారు ఉదయ్ ఫ్రెండ్స్.
ఉదయ్ ఫ్రెండ్: ఒరేయ్ ఉదయ్ నీకు కాబోయే భార్య వాడితో జంప్ రా..?
అంటూ రెచ్చగొట్టినట్టు మాట్లాడతారు. దీంతో ఉదయ్ కోపంతో రగిలిపోతుంటాడు. పిచ్చి పట్టిన వాడిలా చేస్తూ.. వెంటనే తన సెల్‌ఫోన్ తీసి గగన్, భూమిని ఎత్తుకుని వెళ్తుండటాన్ని వీడియో తీస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















