Meghasandesam Serial Today October 18th: ‘మేఘసందేశం’ సీరియల్: బిందుకు అన్నం తినిపించిన శివ – తనకు తినిపించమన్న పూర్ణి
Meghasandesam serial today episode October 18th: కేపీ అరెస్ట్ అయ్యాడని ఏమీ తినకుండా కాలేజ్ క్యాంటీన్‌లో ఉన్న బిందు దగ్గరకు శివ వెళ్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ సెంటిమెంట్‌గా జరిగింది.

Meghasandesam Serial Today Episode: భూమి వీడియో కెమెరా రిపేరుకు ఇచ్చిన షాపు దగ్గరకు వెళ్తుంది. ఆ షాపు క్లోజ్ అయి ఉంటుంది. పక్కనే ఉన్న కిరాణ షాపు వ్యక్తిని షాపు ఎందుకు క్లోజ్ ఉందని అడుగుతుంది. దీంతో ఆ షాపు అతను మూడు రోజుల నుంచి రావడం లేదని మీ నెంబర్ ఇచ్చి వెళ్లండి షాపు ఓపెన్ చేయగానే కాల్ చేస్తా అంటాడు కిరాణ షాపు వ్యక్తి సరే అంటూ నెంబర్ ఇచ్చి వెళ్తుంది భూమి. మరోవైపు కాలేజీ క్యాంటీన్‌లో బిందు డల్లుగా కూర్చుని ఉంటుంది. శివ వెళ్తాడు.
శివ: బిందు.. బిందు.. ఓయ్ బిందు.. నిన్నే.. ఏంటి బిందు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు.
బిందు: అబ్బే అదేం లేదు శివ..
శివ: ఏమీ లేకుండానే ఎదుటి వాళ్లు పిలిచినా వినపడనంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావా..?
బిందు: అబ్బా ఏం లేదని చెప్తున్నాను కదా శివ.. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్..
శివ: చూడు బిందు బాధ ఎప్పుడు ఒంటరితనాన్నే కోరుకుంటుంది. అలా అని ఒంటరితనాన్నే అలవాటు చేసుకుంటావా… ఇలా బాధతోనే ఉంటే మనిషి లేవనంతగా పడిపోతాడు. అసలు ఏం జరిగింది బిందు
బిందు: మా నాన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇంట్లో వాళ్లు ఏమీ తినడం లేదు.
శివ: చూడు బిందు మీ నాన్నని అరెస్ట్ మాత్రమే చేశారు. అరెస్ట్ చేసినంత మాత్రాన శిక్ష ఏమీ పడిపోదు కదా..? కోర్టులో కేసు ఫ్రూవ్ అవ్వాలి. అసలు మీ ఇంట్లోనే కాదు.. మా ఇంట్లో కూడా పెద్ద గొడవగా ఉంది. ఈ విషయంలో గగన్ బావ కూడా చాలా సీరియస్‌గా ఉన్నారు. చూడు నువ్వేమీ మనసులో పెట్టుకోకు మీ నాన్న తప్పకుండా తిరిగి వస్తాడు. అయినా మీ నాన్నేం మర్డర్ చేయలేదు కదా..?
బిందు: చ..చ మా నాన్న ఎందుకలా చేస్తాడు.
శివ: మరి ఆ నమ్మకం నీకు ఉంది కదా..?
బిందు: ఉంది..
శివ: మరి ఎందుకు భయపడుతున్నావు.. చూడు బిందు మీ నాన్న అరెస్ట్ అయ్యాడని నువ్వు ఇలా తినడం మానేస్తే చూసే వాళ్లు ఏమనుకుంటారు. మీ నాన్న నిజంగానే తప్పు చేశారు అనుకుంటారు. అందుకే నువ్వు ఇలా ఉన్నావు అనుకుంటారు. వాళ్లు అలా అనుకోకుండా ఉండాలి అంటే ముందు నువ్వు తినాలి కదా.? ఇదిగో ఎవరి గురించో నువ్వు బాధపడకుండా ముందు నువ్వు తిను..
అంటూ శివ లంచ్ బాక్స్ తీసి బిందుకు తినిపిస్తుంటాడు. ఇంతలో క్యాంటీన్‌లోకి వచ్చిన పూర్ణి వాళ్లను చూస్తుంది. దగ్గరకు వెళ్తుంది.
పూర్ణి: ఏంటి సార్ మేడం గారు తినలేరా..?
శివ: అంటే వాళ్ల నాన్న అరెస్ట్ అయ్యాడని బాధలో ఉంటే.. నేను తినిపిస్తున్నాను.
పూర్ణి: అలాగా..? మా నాన్న కూడా అరెస్ట్ అయ్యాడు. నాక్కూడా తినిపించు..
శివ: అంటే రాత్రి బిర్యాణి బాగానే తిన్నావు కదా..?
పూర్ణి: ఆ నాకు పొద్దున్నే తెలిసింది.
శివ: మరి బాక్స్ తెచ్చుకున్నావు..?
అంటూ శివ అడగ్గానే.. బిందు తాను చిన్నప్పటి నుంచి నేను నాన్న దగ్గరే పెరిగాను అందుకే ఆయన లేకపోతే బాధగా ఉందని చెప్తుంది. దీంతో పెరిగినా పెరగకపోయినా నాన్న నాన్నే అంటుంది పూర్ణి. నాకు తినిపించు అంటూ శివను బలవంతం చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















