Meghasandesam Serial Today November 9th: ‘మేఘసందేశం’ సీరియల్ : భూమిని మోటివేట్ చేసిన శరత్ చంద్ర – అపూర్వకు వార్నింగ్ ఇచ్చిన భూమి
Meghasandesam Today Episode: ఊరొదిలి వెళ్లిపోతానన్న భూమిని శరత చంద్ర మోటివేట్ చేయడంతో తన నిర్ణయం మార్చుకుంటుంది భూమి దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: భూమి కుర్చీలో నిద్రపోతున్న శరతచంద్ర దగ్గరకు వచ్చి ఏడుస్తూ.. కాళ్లు మొక్కుతుంది. ఇంతలో నిద్ర లేచిన శరత్ చంద్ర ఎందుకు ఏడుస్తున్నావని.. అడుగుతాడు. నేను ఊరొదిలి వెళ్లిపోతున్నానని చెప్పడంతో శరత్ చంద్ర షాక్ అవుతాడు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి భయంతో వెళ్లిపోతున్నావా..? అని అడుగుతాడు. ఆ ఒక్కటే కాదని చాలా ఉన్నాయని చెప్తుంది భూమి. ఇక్కడి మనుషులను చూస్తుంటే నేను ఉండలేను అనిపిస్తుంది. అందుకే వెళ్లిపోవాలనుకుంటున్నాను.
శరత్: నీ మాటలను బట్టి ఏదో జరిగింది అనిపిస్తుంది. ఏం జరిగిందని నేను అడగను కానీ నీ లక్ష్యం కోసం ఇంత దూరం వచ్చావు కదా..? ఆ లక్ష్యం పూర్తి కాకుండానే వెళ్లిపోతావా..? మీ అమ్మా నాన్నలను వెతుక్కుంటూ వచ్చావు కదా.. వాళ్లను కలవకుండానే వెళ్లిపోతావా..?
భూమి: వాళ్ల గురించి తెలుసుకుని వాళ్లను కలుసుకునే లోపు ఎవరైనా ఏమైనా చేస్తారని భయంగా ఉంది అంకుల్.
శరత్: చూడమ్మా నీ అంతట నువ్వు వెళ్లిపోవాలనుకుంటే నేను ఏమీ అనను. కానీ ఎవరో బెదిరిస్తే భయపడి వెళ్లిపోవాలనుకుంటే నేను ఒప్పుకోను.
సుజాత: ఈయన మాటలు వింటుంటే నాకే రోమాలు నిక్కబొడుస్తున్నాయి.
శరత్: ఈ ప్రపంచంలో అన్నింటికన్నా స్థిరమైంది ఏంటో తెలుసా..? భూమి. ఎన్ని సమస్యలు వచ్చినా భూమి తన గమనాన్ని మార్చుకోదు. అలాంటి భూమి పేరు పెట్టుకున్న నువ్వు ఇలా ఉండటమేంటి? ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అమ్మ.
భూమి: లేదు అంకుల్ నా అనుకున్న వాళ్ల కోసం నేను ఎన్నిసార్లైనా ఓడిపోతాను కానీ నేను వెళ్లిపోవడమే వాళ్ల ఓటమి అంటే నేను ఎక్కడికి వెళ్లను. మీరు చెప్పినట్టుగా నిలబడతాను. తలబడతాను. అది సమస్యలైనా.. మనుషులైనా.. తలపడి గెలిచి తీరుతాను. నా వాళ్లను కలుసుకుంటాను.
అని భూమి చెప్పగానే డోర్ చాటు నుంచి వింటున్న సుజాత, అపూర్వ షాక్ అవుతారు. శరత్‌చంద్ర మాత్రం భూమిని మెచ్చుకుంటాడు. భూమి థాంక్స్ చెప్తుంది. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను ఉన్నానని మర్చిపోకు అంటూ భరోసా ఇస్తాడు శరత్‌చంద్ర. భూమి అక్కడి నుంచి వెల్లిపోతుంది. బయట వెళ్తున్న భూమి దగ్గరకు అపూర్వ వస్తుంది.
అపూర్వ: భూమి ఏంటి మీ నాన్న ఏదో నాలుగు మాటలు చెప్పగానే నిలబడతాను, కలబడతాను అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. వెళ్లవా..?
భూమి: వెళ్లను. వెళ్లితే మా నాన్నకే అవమానం.
అపూర్వ: అంటే నీ ఆడపడుచు పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా..?
భూమి: నేను వెళితే జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడిప్పుడే నీ అసలు రూపం అర్థం అవుతుంది. నిన్ను ఆపాలంటే నేను ఉండాలి. ఉంటాను. నీ నుంచి నా రెండు కుంటుంబాలను కాపాడుకోవడం కోసం నేను ఉండే తీరుతాను.
అని చెప్పి భూమి వెళ్లిపోతుంది.
సుజాత: ఏంటో ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందేంటి..? నీ మీద తిరగబడమని మీ ఆయనే దీన్ని రెచ్చగొట్టినట్టు ఉంది.
అపూర్వ: ఎంత తిరగబడిని ఇందు పెళ్లి అయితే వీళ్లు చేయలేరు. అప్పుడు నేను మరింత పట్టు బిగించి దీన్ని దూరంగా తరిమేయకుంగే నా పేరు అపూర్వనే కాదు.
అంటూ అపూర్వ కోప్పడుతుంది. మరోవైపు గగన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సెల్ నెంబర్ గురించి ఆరా తీస్తాడు. చెర్రి వచ్చి గగన్‌తో బాధపడతాడు. దీంతో ఇందు పెళ్లి చేసే బాధ్యత నామీద ఉందని.. శరత్‌చంద్ర వచ్చి శారదను తీసుకెళ్లిన విషయం చెప్తాడు. ఇద్దరూ బాధపడుతుంటారు. ఇంతలో అక్కడికి భూమి వస్తుంది. గగన్ తిట్టి ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు. భూమి తాను వెళ్లనని ఇందు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అంటుంది. దీంతో ముగ్గురు పెళ్లి ఆగిపోయేలా చేసిన వాడిని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!