Meghasandesam Serial Today November 17th: ‘మేఘసందేశం’ సీరియల్ : శరత్ చంద్ర ఇంటికి వచ్చిన గగన్ – శారద మాటల్లో నిజం తెలుసుకున్న భూమి
Meghasandesam Today Episode: గగన్ కోపంతో శరత్ చంద్ర ఇంటికి మా అమ్మకు రౌడీతో ఎందుకు పెళ్లి చేయాలనుకున్నావు అంటూ నిలదీస్తుంటే ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: ఇస్తానన్న పెట్టిపోతల గురించి అడగండి అని సౌందర్య, రమేష్‌కు చెప్తుంది. దీంతో అపూర్వ ఏంటి ఏదో సీక్రెట్ గా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. మా ఆవిడ మీరా చెల్లెలమ్మతో ఏదో మాట్లాడాలి అంటుంది. అని చెప్పగానే సరే వెళ్లి మాట్లాడండి అని చెప్తుంది అపూర్వ. దీంతో సౌందర్య, మీరాను పక్కకు తీసుకెళ్లి వంశీకి ఇస్తానన్న కట్న కానుకలు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతుంది. మేము ఏమీ మర్చిపోలేదని 16 రోజుల పండగ రోజు అన్ని ఇస్తాము అని మీరా చెప్పగానే సరేనని బయటకు వస్తారు. ఇంతలో శరత్ చంద్ర వస్తాడు.
శరత్: సారీ ఏంటి మీరంతా నాకోసమే ఎదురుచూస్తున్నట్టు ఉన్నారు. లోపల ఆఫీసు పనిలో పడి అప్పగింతల సంగతే మర్చిపోయాను.
రమేష్: వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం క్యూలో నిలబడ్డప్పుడు టైం చూస్తామా అండి. దర్శనం ముఖ్యం.
చెర్రి: మామయ్య గారు అటువంటి భజనలకు పడరు. స్ట్రైట్ ఫార్వర్డ్.
రమేష్: అంటే ఏదో సోసైటీలో మీ మామయ్యకు మంచి పేరు ఉంది కదండి. అందుకే..
చెర్రి: అందుకే లాగొద్దు.. తెగుద్ది..
అని చెప్పగానే రమేష్ వెంటనే వంశీ వాళ్లను పెద్దల ఆశీర్వాదం తీసుకోమని.. చెప్తాడు. అపూర్వ దగ్గరకు వెళ్లిన ఇందు ఆశీర్వాదం తీసుకుని ఎమోషనల్ అవుతుంది. శరత్ చంద్ర ఇందుకు జాగ్రత్తలు చెప్పి మీ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు. మీరా దగ్గరకు వెళ్లిన ఇందు ఏడుస్తుంది. ఇందును చూసి బిందు, చెర్రి ఏడుస్తుంటారు. అందరూ బరువెక్కిన హృదయాలతో ఇందును అత్తగారింటికి పంపిస్తారు. మరోవైపు కారులో హాస్పి్‌టల్ కు వెళ్తున్న శారద.. గగన్ శరత్ చంద్ర ఇంటికి వెళ్లాడేమోనని భయపడుతుంది. శారదకు పూరి ఫోన్ చేస్తుంది.
పూరి: అమ్మా ఎక్కడున్నావు అమ్మా.. ఎలా ఉన్నావు అమ్మా..
శారద: ఉన్నాను పూరి.. నాకు జరిగిన అవమానాన్ని భూమి, మీ అన్నయ్య అడ్డుకుని ఉండకపోతే నేను ఈ పాటికి చనిపోయి ఉండేదాన్ని.
పూరి: అలా మాట్లాడకు అమ్మా… ఇప్పుడు నువ్వు ఎక్కడు ఉన్నావు.
శారద: జరిగిన గొడవలో భూమికి దెబ్బ తగిలింది. హాస్పిటల్ కు తీసుకెళ్తున్నాను.
పూరి: గొడవ ఏం గొడవ అమ్మా ఇప్పటికి ఇప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది. నువ్వు వచ్చేయ్ అమ్మా భూమిని అన్నయ్య హాస్పిటల్ కు తీసుకెళ్తాడు.
శారద: ఇంకెక్కడి అన్నయ్య కోపంతో ఆ శరత్ చంద్ర ఇంటికి వెళ్లాడు.
అని శారద ఫోన్ లో చెప్తుండగానే భూమి ఉలిక్కిపడి లేస్తుంది. ఆయన శరత్ అంకుల్ మీదకు గొడవకు వెళ్లాడా..? అని అడుగుతుంది. అవునమ్మా నేను ఆపలేకపోయాను. అని శారద చెప్పగానే భూమి కారు ఆపుకుని ఇంటివైపు పరుగెత్తుతుంది. శారద వెనకాలే వెళుతుంది. మరోవైపు కోపంగా శరత్ చంద్ర ఇంటికి వెళ్లిన గగన్ ఇంట్లోంచి వెళ్లి గట్టిగా శరత్ చంద్ర అంటూ అరుస్తుంటాడు.
శరత్: ఏరా మదమెక్కిన ఆంబోతులా మా ఇంటికి వచ్చి ఆరుస్తున్నావు. ప్రాణం తీస్తా..
గగన్: అరేయ్ నీ ప్రాణాలు గాల్లో కలపాలని ఫిక్స్ అయి వచ్చా..?
శరత్: ఫిక్స్ అయి వచ్చావో.. పిచ్చెక్కి వచ్చావో ముందు బయటకు పోరా..
గగన్: బయటకు పోవడానికి రాలేదురా… నీ ప్రాణం తీసయడానికి వచ్చాను. మాట తప్పిన నీలాంటి వాడికి ఈ భూమ్మీద బతకడానికి అర్హత లేదు.
అని శరత్ మీదకు గగన్ వెళ్తుంటే బామ్మ వచ్చి గగన్ ఆపి ఏం జరిగిందని అడుగుతుంది. ఇందు పెళ్లి జరిపిస్తే మా అమ్మను వదిలేస్తానని చెప్పి పెళ్లి జరిగాక మా అమ్మకు ఒక రౌడీతో తాళి కట్టించాలని చూశాడు అని చెప్తాడు గగన్. దీంతో అందరూ షాక్ అవుతారు. నేను మీ అమ్మకు పెళ్లి చేయడం ఏంటి…? ఆ రౌడీకి ఇప్పుడే కాల్ చేసి నిజమేంటో ఇప్పుడే వాడితో చెప్పిస్తాను. అని కాల్ చేస్తాడు శరత్ చంద్ర. ఇంతలో అపూర్వ ఆ రౌడీతో శారదకు తాళి కట్టమని చెప్పింది నేనే అని చెప్తుంది. మన కుటుంబ పరువు కోసమే చేశానని.. సందు దొరికితే చాలు ఆ కృష్ణప్రసాద్ ఆ ఇంట్లోనే ఉంటున్నాడు.. మన మీరాకు సవతి పోరు ఉండదు అని చేశాను అంటుంది అపూర్వ ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!