Meghasandesam Serial Today November 11th: ‘మేఘసందేశం’ సీరియల్: రెస్టారెంట్‌లో కేపీని చూసిన గగన్ - ఏం చేయాలో తల పట్టుకున్న భూమి
Meghasandesam serial today episode November 11th: కేపీని రెస్టారెంట్‌కు తీసుకెళ్తారు భూమి, శారద. అదే రెస్టారెంట్ కు గగన్ వస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: అపూర్వ, సుజాతను తీసుకుని శారద ఇంటికి వెళ్తుంది. ఇంటికి వచ్చిన అపూర్వను చూసిన శారద షాక్ అవుతుంది. భయంగా భూమి దగ్గరకు వెళ్లి ఏంటమ్మాయి ఇది వచ్చింది అని అడుగుతుంది.
భూమి: నేను మీ అబ్బాయి చేతిలో చావకుండా ఫోన్ చేసి రక్షించాను అత్తయ్య.. థాంక్స్ చెప్పడానికి వచ్చిందేమో..?
శారద: అలా అయితే పర్వాలేదమ్మా..? నేను గుడిలో తనని కొట్టాను అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిందేమోనని భయంగా ఉంది.
భూమి: ఏది ఏమైనా మనం అస్సలు తగ్గకూడదు అత్తయ్యా ఇది మన ఇల్లు..
అపూర్వ: ఏంటి అత్తాకోడళ్లు ఇద్దరు నన్ను చూసి చెవులు కొరుక్కుంటున్నారు. నా రాక హఠా పరిణామంలా అనిపించి మీరు ఇద్దరూ హతాశులైయ్యారా..?
భూమి: హతా లేదు.. శుతా లేదు.. ఎందుకు వచ్చారో చెబితే విని తరిస్తాం..
అపూర్వ: వినే కాదు రేపు చూసి కూడా తరించొచ్చు. సాధారణంగా రెండు శత్రు కుటుంబాలు ఏ పరిస్థితుల్లో కూడా ఒకరిని ఒకరు నమ్మరని ఏలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించరు. కానీ ఇప్పుడు నేను వస్తే రండి లేకపోతే రండి అని చెప్పడానికి వచ్చాను.
అంటూ అపూర్వ మాట్లాడుతుంటే.. శారద కోపంగా ఏడుస్తూ.. అపూర్వను తిడుతుంది. దీంతో అపూర్వ వచ్చిన పని చూసుకుని వెళ్లిపోతుంది. దీంతో అపూర్వను పూర్ణి కూడా తిడుతుంది. దీంతో పూర్ణిని కాలేజీకి వెళ్లమని చెప్తుంది శారద. బయటకు వెళ్లిన అపూర్వను సుజాత ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతుంది. నీకు అంతా తర్వాత మెల్లగా తెలుస్తుందిలే పిన్ని అంటూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోతుంది అపూర్వ. తర్వాత శారద, భూమి ఇద్దరూ కలిసి కేపీని రెస్టారెంట్‌కు తీసుకెళ్తారు. అక్కడ ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తుంటే.. గగన్ అక్కడికి వస్తాడు. గగన్‌ను చూసిన భూమి షాక్ అవుతుంది.
భూమి: ఇదేంటి బావ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మామయ్య చూస్తే ఏంటి పరిస్థితి
అనుకుంటూ చాటుగా వెళ్లడానికి భూమి ప్రయత్నిస్తే గగన్ చూస్తాడు..
గగన్: ఏయ్ ఆగు.. ఏంటి నన్ను చూసి చూడనట్టు వెళ్తున్నావు.. అసలు నేను వచ్చానని ఇక్కడికి వచ్చావా..? లేకపోతే నేను వస్తున్నానని తెలుసుకుని ముందే వచ్చావా..?
భూమి: అదేంటి బావ నువ్వు మార్నింగ్ ఇంట్లో టిఫిన్ చేయలేదు కదా..? నువ్వు ఎలాగూ ఇక్కడకు తినడానికి వస్తావని తెలిసి ముందే వచ్చి నీకోసం ఇదిగో ఈ టిఫిన్ తీసుకొస్తున్నాను తిను బావ.. ఇది నీ కోసమే..
గగన్: అబ్బా నమ్మాలా..? ఏం నాటకాలు ఆడుతున్నావు..?
అంటూ గగన్ వెళ్లి కేపీ, శారద వాళ్లకు వెనక వైపు ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటాడు. దీంతో భూమి మరింత టెన్షన్ పడుతుంది. గగన్ ముందు తాను తీసుకొస్తున్న టిఫిన్ ప్లేట్ పెడుతుంది. దీంతో గగన్ టిఫిన్ చేస్తుంటాడు. ఇంతలో శారద లేచి అక్కడి నుంచి వెళ్లబోయి గగన్ ను చూసి షాకింగ్ గా అక్కడే కూర్చుంటుంది. ఇంతలో టిఫిన్ చేస్తున్న కేపీకి పొలమారడంతో గగనే వాటర్ బాటిల్ ఇస్తాడు. దీంతో కేపీ థాంక్స్ చెప్పి అక్కడి నుంచి లేచి హ్యాండ్ వాష్ దగ్గరకు వెళ్తుంటాడు. కేపీ వాయిస్ విన్న గగన్ ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అనుకుంటూ కేపీ వైపు తిరిగి చూస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















