Meghasandesam Serial Today May 21st: ‘మేఘసందేశం’ సీరియల్: భూమితో ఎమోషనల్ అయిన శరత్ - తాగుబోతుగా మారిపోయిన గగన్
Meghasandesam Today Episode: భూమి తనతో వస్తానని రాకపోవడంతో గగన్ పిచ్చి పట్టినట్టు తాగుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : గగన్‌తో వెళ్ళకుండా ఆగిపోయిన భూమికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. కంగారుగా భూమి స్టేషన్‌కు పరుగెత్తుకు వెళ్తుంది. అక్కడ ఉన్న రాజేందర్‌ను ఏమైంది సార్ అని అడుగుతుంది.
రాజేంద్ర: మీ నాన్నను చంపాలనుకున్న కిల్లర్ చనిపోయాడు భూమి.
భూమి: ఎలా సార్..
ఏసీపీ: మనమే చంపేశామని చెప్పు రాజేంద్ర.. ఎవరమ్మా నువ్వు
భూమి: సార్ నా పేరు భూమి.. మా నాన్నను చంపాలనుకున్న ఈ కిల్లర్ ను నేనే ఏసీపీ మేడంకు అప్పగించాను.
ఏసీపీ: ఓ శరత్‌చంద్ర గారి అమ్మాయివా.? ఇతను చనిపోయాడని ఎలా తెలిసింది.
రాజేంద్ర: నేనే ఫోన్ చేసి చెప్పాను సార్..
ఏసీపీ: ఏమయ్యా రాజేందర్.. నువ్వు పోలీస్ వా.. లేక ఈ అమ్మాయికి ఇన్ ఫార్మర్ వా..? అనవసరంగా ఈ అమ్మాయిన ఇంత రాత్రి పూట ఎందుకు టెన్షన్ పెట్టావు. ఏదో మనమే చంపినట్టు..
రాజేంద్ర: సారీ సార్..
ఏసీపీ: అది కాదయ్యా రేపు ఎలాగూ మన వాళ్లు వీళ్ల ఇంట్లో చెప్తారు కదా..? అమ్మా కాఫీ తీసుకుంటావా..? టీ తీసుకుంటావా..? శవాన్ని పెట్టుకుని మర్యాదలు ఏంటనుకుంటున్నావా..? ఇవన్నీ మాకు మామూలే అమ్మా.. రండి ..
భూమి: సార్ మా నాన్నను ఎవరు చంపాలనుకున్నారో అతను చెప్పాడా సార్..
ఏసీపీ: లేదు మేడం.. వాడు సిన్సియర్ కిల్లర్ లా ఉన్నాడు. చావడానికైన సిద్దంగా ఉన్నాడు కానీ ఎవరు చంపించమన్నారో చెప్పలేదు. అప్పటికీ నేను చాలా గట్టిగా ట్రై చేశాను. నా దెబ్బలకు భయపడిపోయి సూసైడ్ చేసుకున్నాడు.
భూమి: మరి మా నాన్నను ఎవరు చంపించాలనుకున్నారో ఎలా తెలుస్తుంది.
ఏసీపీ: ఎలా తెలుస్తుంది. తెలియదు. ఆ నైట్ ఏం జరిగిందో మీ నాన్నకు గుర్తు వస్తేనే తెలుస్తుంది.
అంటూ చెప్పగానే.. భూమి డల్లుగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. రాజేంద్ర వచ్చి అమ్మా భూమి ఏసీపీ మేడం అదే నయని మేడం ఫోన్ చేస్తా అన్నారు అని చెప్తున్న వినకుండా వెళ్లిపోతుంది. ఇంతలో నయని ఫోన్ చేస్తుంది.
భూమి: హలో మేడం ఆ కిల్లర్..
నయని: వాడు చనిపోయాడు. నాకు తెలుసు. రాజేంద్ర చెప్పాడు. రాజేంద్రతో ఫోన్ చేయించింది కూడా నేనే.. వాణ్ని చంపి కేస్ క్లోజ్ చేస్తారని పోలీస్ అయ్యుండి కూడా నేను గెస్ చేయలేదు. మహా అయితే పోలీసుల నుంచి అపూర్వ వాణ్ని తప్పిస్తుందనుకున్నాను.
భూమి: మాకు న్యాయమే జరగదా మేడం..
నయని: భూమి ఫ్లీజ్ ఏడవకు.. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మీ నాన్న గురించి.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తు రానంత వరకే మీ నాన్న ప్రాణం ఉంటుంది. గుర్తుకు వస్తే దాని చేతుల్లో మీ నాన్న ప్రాణం పోతుంది. ప్రాణం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ చేతుల్లోనే ఉంది భూమి..
అని చెప్పి నయని కాల్ కట్ చేస్తుంది. మరోవైపు ఏసీపీ అపూర్వకు ఫోన్ చేసి ఆ కిల్లర్ పని అయిపోయింది అని చెప్తాడు. అపూర్వ వెరీగుడ్ అంటూ కోకాపేట్‌లో ఒక ప్లాట్ నీ భార్య పేరు మీద రిజిస్టర్ అవుతుంది. రేపు నీ భార్యను తీసుకుని ఆఫీసుకు వచ్చేయ్ అని చెప్తుంది. తర్వాత శరత్ చంద్ర, భూమి దగ్గరకు వెళ్తాడు.
శరత్: ప్రేమించిన వాడితో వెళ్లిపోయే ఆడపిల్లలు ఉన్న ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించిన గగన్‌కు వస్తానని మాటిచ్చి కూడా ఈ తండ్రి కోసం ఆగిపోయావు చూడు.. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది అమ్మా. అడుగమ్మా ఆ ఒక్క వాణ్ని తప్పా నీకేం కావాలన్నా తీసుకొచ్చి నీ కాళ్ల దగ్గర పెడతా
భూమి: నాకేమొద్దు నాన్నా ఇప్పుడు నాకు మిగిలి ఉన్న ఒక్క ప్రపంచం మీరే ఇప్పుడు మీ ప్రేమను ఆస్వాదిస్తూ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయే భాగ్యాన్ని ఇవ్వండి చాలు
అంటూ ఏడుస్తుంది భూమి. మరోవైపు గగన్ బార్‌లో కూర్చుని ఫుల్లుగా మందు తాగుతూ భూమి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంటాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















