Meghasandesam Serial Today June 16th: ‘మేఘసందేశం’ సీరియల్: డాన్స్ అకాడమీ ఏర్పాటు చేసిన గగన్ - ఇరిటేటింగ్‌గా ఫీలయిన శరత్ చంద్ర
Meghasandesam Today Episode: అకాడమీ రిజిస్ట్రేషన్ గగన్, భూమి పేర్ల మీద చేయించుకోవాలని భూమి చెప్పడంతో శరత్ చంద్ర వింటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: కూతురు మీద ప్రేమతోనో కూతురు కార్చే కన్నీరు చూడలేకనో శరత్ చంద్ర ఈ పెళ్లికి ఒప్పుకోలేదని.. మనిద్దరం విడాకులు తీసుకోవాలన్న కండీషన్ మీదే భూమిని మన గగన్‌కు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. మీరే అన్నారు కదా నా కోసం నీ ప్రాణమైన ఇస్తాను అని వాడి పెళ్లి కోసం నాకు విడాకులు ఇవ్వండి అని ఏడుస్తూ అడుగుతుంది శారద. కేపీ డైలమాలో పడిపోతాడు. మరోవైపు భూమి, శరత్ చంద్ర కలిసి గగన్ కలవడానికి వెళ్తారు.
గగన్: హాయ్ భూమి..
భూమి: ఏంటి బావ ఏదో ముఖ్యమైన విషయం అని చెప్పి లోకేషన్ షేర్ చేసి మరీ ఇక్కడకు రమ్మన్నావు. ఇక్కడ చూస్తుంటే అమ్మ ఫ్లెక్సీలు ఇవన్నీ ఏంటి బావ.
గగన్: నువ్వు ప్రారంభించబోయే శోభాచంద్ర డాన్స్ అకాడమీ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఇది నీ కోసమే తీసుకున్నాను. లోపలికి రా చూద్దాం.. భూమి ఇది స్టేజ్.. డాన్స్ చేసే ప్లేస్. శోభాచంద్ర నాట్య కళాశాల ఫ్లెక్సీ మొత్తం ఇదంతా కవర్ చేయించాను. మిగతా ఆడిటోరియం ఫ్లెక్సీలతో ఫిల్ చేయిస్తాను. ఆడిటోరియం మొత్తం నీ స్టూడెంట్స్ ఉంటారు.
భూమి: బావ.. బాగుంది కదా నాన్నా
శరత్: చాలా బాగుంది అమ్మా ఐ యామ్ ఇంప్రెస్టు
గగన్: భూమి నీకు కాబోయే భర్తగా నేను చేయాల్సింది అంతా చేస్తాను. భర్తను అయి కూడా ప్రతిక్షణం నిన్ను గెలిపించడానికే ప్రయత్నిస్తాను. నువ్వు మీ అమ్మ ఆస్థితోనే నాట్య కళా సేవ చేయాలనే పట్టుబట్టావు కానీ లేదంటే నా ఆఖరి రూపాయి కూడా నీ ఆశ నెరవేర్చడానికే ఖర్చు పెట్టేవాణ్ని.
శరత్: అంత శ్రమ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు గగన్. నాట్య కళా సేవ చేయాలనేది నా శోభ ఆశయం. మా ఆస్థి అంత తను సంపాదించిందే.. తనంటే నాకు ప్రాణం తన కోసం తన కళ కోసం ఆఖరి పైసా వరకు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మాదే.
భూమి: అమ్మ గురించి మీరిద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు నాన్నా. ఇది వింటుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా..? నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను నాన్న.
శరత్: నేను ఇప్పడే బయలుదేరుతున్నాను. అమ్మా భూమి నేను ఆఫీసుకు వెళ్తున్నాను. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానురా..
గగన్: పర్వాలేదు లేండి నేను డ్రాప్ చేస్తాను.
భూమి: అవును నాన్నా నేను బావతో వెళ్తాను. ఇంకా కాసేపు ఇక్కడ ఉండాలనిపిస్తుంది. బావ చూడండి ఇదంతా ఎంత బాగా ఏర్పాటు చేశారో..
శరత్: సరేనమ్మా జాగ్రత్త..
అని చెప్పి శరత్ చంద్ర వెళ్లిపోతాడు. ఆయన వెళ్లిపోగానే.. భూమి హ్యాపీగా గగన్‌ను హగ్ చేసుకుంటుంది. మీకు ఇందాకే థాంక్స్ చెబుదామనుకున్నాను కానీ నాన్న ఉన్నారు కదా అందుకే ఆగిపోయాను అంటూ భూమి డాన్స్ చేస్తుంది. భూమితో పాటు గగన్ డాన్స్ చేస్తాడు.
గగన్: నిజంగా చాలా గ్రేట్ భూమి. చాలా గొప్పగా డాన్స్ చేశావు. చూస్తుంటే మీ అమ్మగారి కంటే చాలా ఎక్కువగా డాన్స్ చేసేలా ఉన్నావు.
భూమి: మా అమ్మ పేరు నిలబెడితే అది పదివేలు. బావ ఒక చిన్న రిక్వెస్టు.. డాన్స్ అకాడమీ మీ అమ్మ పేరు మీద పెట్టినా రిజిస్ట్రేషన్ మాత్రం మనిద్దరి పేరు మీద చేద్దాం
అని భూమి చెప్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన శరత్ చంద్ర, భూమి మాటలు విని షాక్ అవుతాడు. భూమి, గగన్‌ను కిస్ చేయడం చూసి ఇరిటేటింగ్ గా ఫీలవుతాడు. భూమి, గగన్‌లు మాత్రం శరత్ చంద్రను గమనించకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















