Meghasandesam Serial Today July 29th: ‘మేఘసందేశం’ సీరియల్: ఇంట్లోంచి వెళ్లిపోయిన భూమి – షాక్‌లో శరత్‌చంద్ర
Meghasandesam serial today episode July 29th: భూమికి అపూర్వ పెళ్లి సంబంధం తీసుకురావడంతో భూమి ఇంట్లోంచి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: అపూర్వ కోపంగా అటూ ఇటూ తిరుగుతుంది. సుజాత టెన్షన్‌గా చూస్తూ.. చెర్రి.. శివను తీసుకెళ్లి గగన్ ఇంట్లో పెట్టాడా..? అని అడుగుతుంది. అవును పిన్ని అంటూ అపూర్వ చెప్తుంది.
అపూర్వ: నాకేంటి మహరాణిలా బతుకుతున్నాను అనుకున్న టైంలో ఆ భూమి వచ్చి నా కాన్ఫిడెంట్ మీద కొంచెం కొంచెం దెబ్బ కొట్టింది. ఇప్పుడేమో ఆ భూమి తమ్ముడు వచ్చాడు.
సుజాత: ఆస్థిలో వాటా అడగడానికి వాడేమైనా అల్లుడుగారికి పుట్టాడా ఏంటి అమ్మాయి. వాడు ఆ భూమిని పెంచుకున్న వాళ్లకు పుట్టాడు. వాడితో నీకేంటి టెన్షన్ అమ్మాయి.
అపూర్వ: వాడితో నాకేంటి టెన్షన్ పిన్ని వాడు తీసుకొచ్చిన బొమ్మతోనే టెన్షన్. అందులో కెమెరా ఉంది. కెమెరాలో ఫ్రూప్ ఉంది.
సుజాత: కెమెరానా..? ఫ్రూపా..? ఏముంది అమ్మాయి కెమెరాలో ..?
అపూర్వ: ఏముంటే నీకెందుకులే.. టైం వచ్చినప్పుడు చెప్తాను. అయినా ఆ భూమి చాలా తెలివైనది.. అదెంత తెలివైంది కాకపోతే వాణ్ని కలిసి భూమి వాణ్ని తిన్నగా మన ఇంటికి తీసుకురాక ఆ గగన్ గాడి ఇంట్లోనే పెట్టిస్తుంది.
సుజాత: ఆ ఎందుకంటావు..?
అపూర్వ: ఎందుకంటావు పిన్ని..దాని తమ్ముడు అని తెలిశాక మనం ఊరుకుంటామా..? దాని కసి మొత్తం వాడి మీద చూపిస్తాం. అది పసిగట్టే ఆ భూమి తెలివిగా వాణ్ని ఆ గగన్ ఇంట్లో పెట్టింది. వాడి తమ్ముడితో పాటు ఆ బొమ్మను కూడా అక్కడే పెట్టించింది.
సుజాత: ఆ బొమ్మ తిన్నగా మన ఇంటికి రావాలి అంతేగా..?
అపూర్వ: మన ఇంటికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు పిన్ని. మన చేతికి మాత్రం చిక్కాలి.
సుజాత: మన ఇంటికి వచ్చాక తిన్నగా నీ చేతికి చిక్కడం ఎంత పని అమ్మాయి. ఇప్పుడు నేను బ్రహ్మండమైన ప్లాన్ చెప్తాను. దెబ్బకు భూమిని పెంచిన అమ్మ కొడుకు మన ఇంటికి వచ్చేస్తాడు. నువ్వు చెవులు రెక్కించుకని విను. ఆశ్చర్యపోవడానికి కళ్లు పెద్దవి చేసుకో..
అపూర్వ: ముందు ఆ ఐడియా ఏంటో తగలడు..
సుజాత: సింపుల్ అమ్మాయి.. ఆ గగన్ గాడికి ఫోన్ కొట్టి ఒరే వెర్రి బాగుల వెర్రి నారాయణ నీ ఇంట్లో ఉంటున్నది ఎవరో అనాథ కాదురా.. భూమి తమ్ముడు అని చెప్పేసెయ్.. అంతే దాంతో వెంటనే ఆ గగన్ గాడు భూమి తమ్ముడిని మెడపట్టి బయటకు గెంటేస్తాడు. అంతే వాడు బొమ్మతో వచ్చి మన ఇంట్లో పడతాడు. షాక్ అవుతున్నావు కదూ.. ఇంత చిన్న ఐడియా నీకెందుకు రాలేదని సిగ్గు పడుతున్నావు కదూ..
అపూర్వ: సిగ్గు పడుతున్నాను. ఇంత దిక్కుమాలిన ఐడియా నాకు రాలేదని సిగ్గు పడుతున్నాను. గాడిదల నిన్ను మేపుతున్నాను చూడు సిగ్గు పడుతున్నాను.
సుజాత: సరేలే అమ్మాయి నా ఐడియాలో తప్పేం ఉంది చెప్పు..
అపూర్వ: మనం ఫోన్ చేసి చెబితే ఆ గగన్ గాడు భూమి తమ్ముడిని బయటకు తోసేస్తాడు అనుకుంటున్నంత వరకు కరెక్టే. కానీ వాడు వాణ్ని నేరుగా మన ఇంట్లో దింపడు.. వెంటనే భూమికి ఫోన్ కొడతాడు. అప్పుడు భూమి తన తమ్ముడి గురించి చెప్పింది ఎవరా అని ఆలోచించింది అనుకో..? మనమే అని అర్తం అవుతుంది. అప్పుడు బొమ్మ మీద అనుమానం వస్తుంది. అది కానీ చెక్ చేస్తే ఆ కెమెరా బయట పడుతుంది. అప్పుడు నా పని కేల్‌ఖతం.
సుజాత: అది సరే అమ్మాయి బొమ్మ అంటావు.. గుట్టు అంటావు.. రట్టు అంటావు.. ఇంతకీ ఆ కెమెరా ఏంటి అమ్మాయి
అపూర్వ: తర్వాత చెప్తాను అంటున్నాను కదా..?
అంటూ సుజాతను తిడుతుంది అపూర్వ. తర్వాత భూమి కోసం పెళ్లి సంబంధం తీసుకొస్తుంది అపూర్వ. పెళ్లి వాళ్లు ఇంటికి రాగానే అందరూ మర్యాదలు చేస్తారు.
అపూర్వ: భూమి గురించి అన్ని తెలిసి కూడా రఘుపతి అన్నయ్యగారు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు.
శరత్: మీరా వెళ్లి భూమిని తీసుకురా..?
మీరా: అలాగే అన్నయ్యా
మీరా వెళ్లి ఇంట్లో చూస్తుంది. భూమి కనిపించదు. కంగారుగా బయటకు వస్తుంది మీరా.
మీరా: వదిన భూమి ఇంట్లో లేదు..
అని చెప్పగానే.. అందరూ భూమి కోసం ఇంట్లో వెతుకుతారు. భూమి ఎక్కడా కనిపించదు. శరత్ చంద్ర ఫోన్ చేస్తాడు. భూమి ఫోన్ స్విచ్చాప్ వస్తుంది. అందరూ షాక్ అవుతారు. మరోవైపు భూమి, గగన్ వాళ్ల ఇంటికి వెళ్తుంది. ఇంటికి వచ్చిన భూమిని చూసి శారద షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















