Meghasandesam Serial Today January 7th: ‘మేఘసందేశం’ సీరియల్: ఆత్మతో మాట్లాడిన గగన్ – భూమి గురించి గగన్ ఎమోషన్
Meghasandesam serial today episode January 7th: భూమి లేకపోతే గగన్ చనిపోయి ఇంట్లో శోకం మిగిలేదని ఆత్మ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: ఊటిలో చెర్రిని చంపేశానని ఇంటికి వచ్చిన నక్షత్రకు అపూర్వ గ్రాండ్ వెల్ కం చెప్తుంది. పూలమాల వేసి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొస్తుంటే.. సుజాత చూసి మనసులో తిట్టుకుంటుంది. మొగుడిని చంపి వచ్చినదానికి ఇంత స్వాగతం అవసరమా అనుకుంటుంది.
అపూర్వ: ఏంటి పిన్ని గొణుగుతున్నావు..?
సుజాత: అదే అమ్మాయి బేబీని నువ్వు బయటకు వినిపించేలా పొగుడుతున్నావు. నేను లోపల గొణుగుకుంటూ పొగుడుతున్నాను అమ్మాయి.
అపూర్వ: పర్వాలేదు పిన్ని బయటకే పొగడొచ్చు.. మేము సంతోషిస్తాం కదా విని..
సుజాత: అంటే అమ్మాయి నా నోటికి కాస్త దురద ఎక్కువ కదా..? ఆ పొగడ్త కాస్త అటూ ఇటూగా బాలెన్స్ తప్పితే నీ చేయి నా చెంప మీద నాట్యం ఆడుతుంది కదా అమ్మాయి అది నా భయం.
అపూర్వ: పర్వాలేదు లే పిన్ని ఈ ఆనందంలో ఏమీ అననులే. అయినా నీకు కూడా ఇలాంటి కూతురు పుట్టి ఉంటే అప్పుడు నా ఆనందం ఏంటో నీకు తెలిసి ఉండేది.
సుజాత: పుడితే పుట్టిన వెంటనే తొక్కి చంపేసుండేదాన్ని..
అపూర్వ: మళ్లీ ఏంటి గొణుగుతున్నావు చెప్పు పిన్ని..
సుజాత: అదేనమ్మాయి పొగడ్తే లో లోపల..
అపూర్వ: అదే ఏంటో బయటకు చెప్పు.. అది పొగడ్తో నీలో పుడుతున్న అసూయో నేను చెప్తాను.
సుజాత: అదేనమ్మాయి నువ్వు దండేశావు కదా..? అదే నేనయితే నాలుగు దండలు వేసేదాన్ని.. ఇప్పుడు నువ్వు తిలకం దిద్దుతున్నావు కదా..? నేనయితే వీర తిలకం దిద్దేదాన్ని
అపూర్వ: మరి దండ తెచ్చింది నువ్వే కదా..? నాలుగు తేలేకపోయావు..
సుజాత: ఎందుకు అమ్మాయి ఎక్కువ తెస్తే ఇంట్లో వాళ్లకు అనుమానం వస్తుంది.
అపూర్వ: అయితే వీర తిలకం ఎలా దిద్దుతారు..?
సుజాత: ఇది కూడా తెలియదా..? అమ్మాయి నీకు మన రక్తంతో దిద్దే తిలకాన్ని వీర తిలకం అంటారు.
అపూర్వ: ఓ అంతేనా..? (అంటూ సుజాత చేయి కోసి ఆ రక్తంతో నక్షత్రకు వీర తిలకం దిద్దుతుంది అపూర్వ.) రా నక్షత్ర ఇప్పుడు మన ఇంట్లోకే కాదు కొత్త జీవితంలోకే అడుగుపెడుతున్నావు.. ఇది పిన్నికి ఇచ్చేయ్ పిన్ని చూసుకుంటుందిలే.. పిన్ని త్వరగా రా..? పిన్ని బేబీ ఎండన పడి వచ్చిందిగా తనకు జ్యూస్ తీసుకురా త్వరగా వెళ్లు..
అని చెప్తుండగానే.. పై నుంచి మీరా వస్తుంది.
మీరా: అయ్యో నక్షత్ర అనుకున్నదానికంటే ముందే వచ్చారు కదా..? చెర్రి ఎక్కడ..?
సుజాత: ఇంకెక్కడి చెర్రి పోయాడుగా..?
మీరా: పోవడం ఏంటి అత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు..?
సుజాత: అంటే నాకు వీళ్లు అదే చెప్పారు.. నేను నీకు అదే చెప్పాను అన్నమాట. చెప్పండి అమ్మాయి.
అపూర్వ: అంటే మీరా మన చెర్రి నక్షత్రను ఎయిర్‌ఫోర్ట్ లోనే వదిలేసి వెళ్లిపోయాడట.
నక్షత్ర: అవును అత్తయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు. చూసి చూసి నాకే విసుగు వచ్చేసి ఇక చేసేదేముందని నేనే వచ్చేశాను.
మీరా: మరి ఆ దండేంటి నక్షత్ర..
సుజాత: ఇదిగో అమ్మాయి చెర్రి ఫోటోకు పడాలి..
అని చెప్పగానే మీరా కంగారుగా ఏడుస్తుంది.
మీరా: ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యా నా కొడుకు ఫోటోకు దండ పడటం ఏంటి..?
అపూర్వ: మీరా నువ్వు ఆగు.. పిన్ని నువ్వు కాసేపు నోరు మూస్తావా..? అయినా నీ అపశకునం నోటితో అలా మాట్లాడతావేంటి పిన్ని.. అయినా నక్షత్ర అంటే ఇష్టం లేదని వెళ్లిపోయిన వాడు చచ్చినవాడితో సమానం అని చెప్తున్నావా..? మీరా ఈ దండ నక్షత్రకు దిష్టి తగులకుండా వేశాము.
మీరా: మరి చెర్రి ఏమైనట్టు..?
నక్షత్ర: నాకు ఎలా తెలుస్తుంది అత్తయ్యా.. ఒకసారి మీరు కాల్ చేయండి మీ కాల్ అయినా లిఫ్ట్ చేస్తాడేమో..?
అని చెప్పి అపూర్వ, నక్షత్ర, సుజాత అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత గగన్ నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తాడు. అప్పుడే గగన్ ఆత్మ బయటకు వచ్చి భూమి లేకుంటే ఇది వరకు నువ్వు చనిపోయి ఉండేవాడివి నీ ఇల్లంతా శోకంతో నిండిపోయేది అని చెప్తుంది. దీంతో గగన్, భూమిని ప్రేమగా చూస్తూ దగ్గరకు వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















