Meghasandesam Serial Today December 6th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్‌కు ఐలవ్యూ చెప్పిన నక్షత్ర – భూమి కోసం గుడికి వెళ్లిన గగన్
Meghasandesam Today Episode: భూమి కోసం గుడికి వెళ్తున్న గగన్ కు మధ్యలో నక్షత్ర ఐలవ్యూ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: నక్షత్ర బర్తుడేకు డ్రెస్ సెలెక్షన్ చేస్తుంది అపూర్వ. ఇంతలో నక్షత్ర రావడంతో.. డ్రెస్ సెలెక్షన్ నువ్వు చేసుకో అని చెప్తుంది. డిజైనర్ చూపించిన డ్రెస్సుల్లో ఒకటి సెలెక్షన్ చేసుకుంటుంది నక్షత్ర. ఎక్కడికి వెళ్తున్నావు అని అపూర్వ అడగ్గానే మాటల్లో బావను కలవాలి అంటుంది నక్షత్ర. తర్వాత తేరుకుని చెర్రి బావతో అని మాట మారుస్తుంది. ఇంతలో సుజాత వచ్చి ఆ భూమి రేపు బాలాజీ టెంపుల్ లో గగన్‌ను కలుస్తుందట అని చెప్పగానే ఇది మా బావకు చూపించి ఆ భూమిని ఇంట్లోంచి వెళ్లగొట్టాలి అని అపూర్వ ప్లాన్ చేస్తుంది. తర్వాత భూమి గుడికి వెళ్లి గగన్ పేరుతో అర్చన చేయిస్తుంది. గగన్ ఏదో చెప్తా అన్నారు. నా మనసులో ఉన్నదే ఆయన చెప్పాలి. మా నాన్నే మా పెళ్లి చేయాలి దయతో నా కోరిక మన్నించి తీర్చు స్వామి అని మొక్కుతుంది. మరోవైపు నక్షత్ర, గగన్ కారుకు ఎదురుగా నిలబడుతుంది.
గగన్: ఏయ్ నక్షత్ర నాకు మీ డాడీకి జరుగుతున్న గొడవలు చాలు. పొగరెక్కిన పోట్ల గిత్తలు కుమ్ముకుంటే మధ్యలో కాళ్ల కింద పడ్డ దూడలా బలైపోతావు. కారు తీయ్.
నక్షత్ర: ఏంటి బావా నేను ప్రేమగా నీకోసం చూస్తుంటే.. నువ్వు పొగరుగా పలకరిస్తున్నావు. కోపంలో కూడా అందమైన ఆవుదూడతో పోల్చడం నాకు నచ్చింది. నీకు గుడ్ న్యూస్ చెబుదాం అని వచ్చాను.
గగన్: నీ నోటి నుంచి వచ్చే ఏదీ కూడా ఈ చెవికి గుడ్ న్యూస్ లా అనిపించదు. అయినా ఏదో చెప్పాలని ఎక్సైట్ అవుతున్నావు కదా చెప్పేయ్. చెప్పింది కాస్త నా చెవికి చేదైతే చెప్పు తీయక ముందే ఇక్కడి నుంచి చెక్కేయ్.
నక్షత్ర: స్వీటు ఎప్పుడూ చేదు అవ్వదు బావ. జస్ట్ హోల్డ్ యువర్ హార్ట్. రెడీ వన్ టూ త్రీ.. ఐ లవ్యూ.. ఇంత బ్యూటీ అది అపూర్వ కూతురు ఐ లవ్యూ చెప్పే సరికి నీ గుండె ఆగిపోయింది కదూ.. యువర్ సో లక్కీ బావ. ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి.
గగన్: నక్షత్ర మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు. అపూర్వ కూతురిని అంటున్నావు కదా..? ఆ మాత్రం పొగరు ఉంటుందిలే.. నీ పొగరు నీ దగ్గరే ఉంచుకుని నీ దారిన నువ్వు పో.. నా దారిన నేను వెళ్తాను ఒకే దారి మన ఇద్దరికీ సెట్ అవ్వదు.
నక్షత్ర: వాట్ డు యూ మీన్
గగన్: బేసికల్లీ ఐ యామ్ రిజెక్టింగ్ యువర్ లవ్
నక్షత్ర: ఏ.. ఎందుకు…
గగన్: ఎందుకంటే నువ్వు శరత్ చంద్ర కూతురివి.. ఒక్క విషయం గుర్తు పెట్టుకో శరత్ చంద్ర రక్తం పంచుకుని పుట్టిన ఎవరితోనైనా నేను శత్రుత్వాన్నే ఎంజాయ్ చేస్తాను.
నక్షత్ర: బావా నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో.. నీ లవ్ ను రిజెక్ట్ చేసి తప్పు చేశాను నక్షత్ర. అంటూ నువ్వే నా కాళ్ల దగ్గరకు వచ్చి బతిమాలేటట్టు చేయకపోతే నా పేరే నక్షత్ర కాదు.
అంటూ చెప్పగానే అది ఎప్పటికీ జరగదు అంటూ గగన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. గుడి దగ్గర భూమి ఎదురుచూస్తుంది. గగన్ వస్తాడు. గుడిలో భూమిని వెతుకుతుంటాడు. ఇంతలో భూమియే గగన్‌కు ఎదురు వస్తుంది. మీ పేరు మీద అర్చన చేయించాను అని గగన్‌కు బొట్టు పెడుతుంది. నా గోత్రం నీకెలా తెలుసు అంటే చెర్రిని అడిగానని చెప్తుంది భూమి. ఇంకా ఏంటని గగన్ అడగ్గానే మీరే చెప్పాలి గుడికి రమ్మని చెప్పారు కదా అంటుంది భూమి. అయితే అటు తిరుగు చెప్తాను. నిన్ను చూస్తే మాట తడబడుతుంది అంటాడు గగన్. నాకు ముఖం మీద చెప్పడమే ఇష్టం అంటుంది భూమి. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!