Meghasandesam Serial Today December 27th: ‘మేఘసందేశం’ సీరియల్: శివ పెళ్లికి కండీషన్స్ పెట్టిన భూమి – అయోమయంలో పడిపోయిన గగన్
Meghasandesam serial today episode December 27th: శివ, పూరిలకు పెళ్లి చేయాలంటే తన కండీషన్స్ కు ఒప్పుకోవాలంటుంది భూమి దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: పూరి కళ్లల్లో నలక పడితే శివ నోటితో ఊదేస్తుంటాడు. అప్పుడే అక్కడకు భూమి వచ్చి వాళ్లిద్దరిని రొమాంటిక్ మూడ్‌లో చూసి షాక్ అవుతుంది. భూమిని చూసిన శివ వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లభోతుంటాడు.
భూమి: ఏం జరుగుతుంది.
శివ: అంటే అక్కా పూరి కళ్లల్లో నలక పడితే ఊదాను అంతే..
అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పూరి కూడా వెళ్లబోతుంటే భూమి ఆపేస్తుంది.
భూమి: అసలు ఏం జరుగుతుంది ఇక్కడ..
పూరి: మీ తమ్ముడు చెప్పాడు కదా మేం హోం వర్క్ చేసుకుంటున్నాము నా కంట్లో..
భూమి: ఆగు ఆగు చెప్పిన కథే మళ్లీ చెప్పమనలేదు.. అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది.
పూరి: కథా లేదు కాకరకాయ లేదు.
భూమి: చూడు పూరి మీ ఇద్దరిని నేను అలా చూశాను కాబట్టి సరిపోయింది. అదే శారద అత్తయ్యో మరీ ముఖ్యంగా మీ అన్నయ్యో అలా చూసి ఉంటే మీ ఇద్దరి చర్మం వలిచేసి చెప్పులు కుట్టించుకునే వాడు. నీకేం మీ అన్నయ్య కంట్లో పడినా నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు.. కానీ శివే ఏ దిక్కు లేని అనాథలా రోడ్డు మీద పడతాడు.
పూరి: ఎందుకు పడతారు వదిన గారు తమరి తమ్ముడు అని తెలిసిన మరుక్షణమే తమ తాట వలిచి రోడ్డు మీద పడేయబోయాడు. మళ్లీ మనసు మార్చుకుని ఇంట్లోకి ఎందుకు తెచ్చుకున్నాడు.
భూమి: ఎందుకంటే వాడు నా తమ్ముడు కనక. బయట పడకపోయినా మీ అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నాడు కనక.
పూరి: నువ్వు మా అన్నయ్య మోసం చేసి మీ తమ్ముణ్ని ఈ ఇంట్లో పెట్టినందుకు వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా నిన్ను మీ తమ్ముణ్ని బయటకు గెంటేసేవాడు.
భూమి: ఏయ్ ఏం మాట్లాడుతున్నావు..
పూరి: నిజం మాట్లాడుతున్నాను. ఏంటో తెలుసా..? నేను మీ తమ్ముణ్ని ప్రేమిస్తున్నానని తెలిశాకే తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చాడు.
భూమి: నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా..? మా తమ్ముడు ప్రేమించొద్దా..?
పూరి: హలో మేడం ఆత్రం పడి మీ తమ్ముణ్ని ఆశ్రమం చేసుకునే రకం కాదు. ఆడపిల్లను నాకు సిగ్గు ఉంటుంది.
అంటూ శివ తనను ప్రేమించానని చెప్పాడని పూరి చెప్పగానే..
భూమి: అమ్మా నాకు తెలియకుండా నా వెనక ఇంత జరిగిపోతుందా…?
పూరి: ఇంతా లేదు వింతా లేదు. జస్ట్ మా ప్రేమకథ మొదలైంది అంతే..
భూమి: మీ ఇద్దరి పెళ్లి జరగడం కథ మొదలైనంత ఈజీ కాదు.
పూరి: అన్నయ్య ఒప్పుకున్నాక ఇక మా పెళ్లి ఆపేది ఎవరు..?
భూమి: నేను ఆపుతాను. ఆడపడచు అంటే అర్థ మొగుడు అని నీక్కూడా తెలుసు కదా..? అమ్మా మీ అన్నయ్య నాకు ఎంత టార్చర్ చూపించాడు. కట్ల పాములా ఎన్ని బుసలు కొట్టాడు. బదులు తీర్చుకోవద్దూ..?
పూరి: ఎలా తీర్చుకుంటావో మా పెళ్లిని ఎలా ఆపుతావో నేను చూస్తాను.
భూమి: మీ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను.
అనుకంటూ ఇద్దరూ ఒకరి మీద ఒకరు చాలెంజ్ చేసుకుంటారు. తర్వాత శివ, భూమి పెళ్లి చేయాలని తాను నిర్ణయించుకున్నాని గగన్ వెళ్లి భూమికి చెబితే తనకు ఇష్టం లేదని చెప్తుంది భూమి. ఎందుకు ఇష్టం లేదని గగన్ అడిగితే.. నా మీద నువ్వు డామినేషన్ చేస్తావు. నా తమ్ముడి మీద నీ చెల్లి డామినేషన్ చేస్తుందా..? అంటూ తనకు కొన్ని కండీషన్స్ ఉన్నాయని వాటికి ఒప్పుకుంటేనే పెళ్లికి ఒప్పుకుంటాను అంటుంది భూమి. దీంతో ఏంటో చెప్పమని పెన్ను పేపర్ తీసుకుని రెడీగా ఉంటాడు గగన్. భూమి చెప్పే కండీషన్స్ విని గగన్ ఆశ్చర్యపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















