Meghasandesam Serial Today August 2nd: ‘మేఘసందేశం’ సీరియల్: ఎమోషనల్ అయిన చెర్రి – పెళ్లికి రెడీ అయిన భూమి
Meghasandesam serial today episode August 2nd: మీరు ఇద్దరు కలవాలనే తాను నక్షత్రను పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు అలా జరగడం లేదని చెర్రి, భూమితో ఎమోషనల్ అవుతాడు.

Meghasandesam Serial Today Episode: భూమి ఏడుస్తూ శారద ఇంటికి వచ్చి శారద కాళ్ల మీద పడి ఏడుస్తుంది. మీ అబ్బాయి నా భర్త అత్తయ్యా నాభర్తను నేను ఎలా చంపుకుంటాను అత్తయ్యా అంటూ ఎమోషనల్ అవుతుంది.
శారద: అమ్మా భూమి నిన్ను అర్థం చేసుకునేంత తెలివితేటలు నాకు లేవు. ఒకవైపు పెళ్లి ఆపేసుకన్నావు. మరోపు మా అబ్బాయి నీ భర్త అంటున్నావు. ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను.
భూమి: అవును అత్తయ్యా మీ అబ్బాయితో నాకు ఎప్పుడో మానసికంగా పెళ్లి అయిపోయింది. ఇక ఈ పెళ్లి ఎందుకు ఆపేసుకున్నానో మీకు తెలియదా.? మా నాన్న ఇష్టం కొద్ది ఈ పెళ్లి చేస్తున్నారు అనుకున్నాను. మీరు మామయ్య విడాకులు తీసుకోవాలని కండీషన్ పెట్టి చేస్తున్నారు అని కలలో కూడా ఊహించలేదు. అంటే బావతో నా పెళ్లి చేయడం మా నాన్నకు ఇష్టం లేదనే కదా అర్థం. మా నాన్నకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను మన ఇంటికి వచ్చేస్తే నేను మా నాన్నకు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే కదా అత్తయ్యా..? అప్పుడు నెరవేర్చాలనుకుంటున్న మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చలేను. మీకు మీ అబ్బాయి ఎలా బలహీనతో.. నాకు మా నాన్న అలా బలహీనత. ఆయన ఇష్టపూర్వకంగ ఒప్పుకుంటేనే మా పెళ్లి జరుగుతుందని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను.
శారద: ఒప్పుకోకపోతే పెళ్లి జరగదు అంటున్నావు. మీ నాన్న ఒప్పుకోవాలి నువ్వు మా ఇంటిని ఉద్దరించాలి అని నేను అనలేదే.. నా కొడుకును వదిలేయమంటున్నాను. నువ్వు కొట్టిన దెబ్బ నుంచి కొంచెం కోలుకోనివ్వు అంటున్నాను. నువ్వు ఇలా ఇంటి చుట్టు తిరిగి వాడికి మనఃశాంతి లేకుండా చేయకు ఫ్లీజ్ భూమి వెళ్లిపో..
భూమి: నేను ఇంత చెప్పాక కూడా మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏడుపొస్తుంది అత్తయ్య.. ఇది నా ఇల్లే అని నేను అనుకోకపోతే మా ఇంట్లో పెట్టిన పెళ్లిచూపులు కూడా నేను వదులుకుని రాను కదా అత్తయ్యా..?
శారద: ఎందుకు పెళ్లి చూపులు కూడా వదులుకుని రావాల్సి వచ్చింది భూమి..
భూమి: మీ కొడుకుతో మానసికంగా పెళ్లి అయిపోయాక నేను మరో పెళ్లి ఎలా చేసుకోగలను అత్తయ్య. నేను బావ కలిసి ఉమ్మడిగా డాన్స్ అకాడమీ పెడదామని గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు బావ లేకుండా నేను అకాడమీ నడపలేను. ఇప్పుడు బావను అడిగినా ఒప్పుకోడు ఎలాగైనా మీరే ఒప్పించాలి అత్తయ్య
అంటూ భూమి ప్రాధేయపడుతుంది. దీంతో శారద ఎమోషనల్ అవుతూ సరే నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వైతే ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో భూమి అని చెప్తుంది. భూమి ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. టెర్రస్‌లోకి వెళ్లి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. చెర్రి వస్తాడు.
చెర్రి: కుదిరిన పెళ్లి సంబంధం గురించి ఆలోచిస్తున్నావా..? భూమి. ఇంకేం మిగిలిందని ఆలోచిస్తున్నావు భూమి. ఏం మిగల్లేదు కదా..? ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం కాపురం చేయడానికి ప్రిపేర్ అయిపో భూమి.
భూమి ఏడుస్తూనే ఉంటుంది.
భూమి: ఏం మాట్లాడుతున్నావు చెర్రి..
చెర్రి: ఎందుకు ఏడుస్తున్నావు భూమి కొత్తగా కుదిర్చిన ఈ పెళ్లి కొడుకు పక్కన నువ్వు కూర్చుంటే నవ్వుతూ మేము అక్షింతలు వేయాలి. ఈ దుఃఖం జీవితాంతం ఏడ్చినా తీరదు.
భూమి: చెర్రి నువ్వు అలా మాట్లాడకు..
చెర్రి: ఎలా మాట్లాడాలి భూమి నేను నక్షత్రను పెళ్లి చేసుకుంది దేనికి మీరిద్దరు కలవాలనే కదా..? నేను చేసింది త్యాగం అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. అది త్యాగం కాదు విధి రాత నాకు రాసిన రోగం అని
అంటూ చెర్రి ఎమోషనల్ అవుతాడు. భూమి ఏడుస్తూనే ఉంటుంది. మరోవైపు గగన్ కూడా ఒంటరిగా రూంలో కూర్చుని ఏడుస్తూనే ఉంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















