Meghasandesam Serial Today August 18th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి షాక్ ఇచ్చిన ఉదయ్ - ఉదయ్ కి షాక్ ఇచ్చిన గగన్
Meghasandesam serial today episode August 18th: డాన్స్ అకాడమీలో చేరేందుకు శరత్ చంద్ర రికమండేషన్ లెటర్ తీసుకుని వచ్చిన ఉదయ్‌కి గగన్ షాక్ ఇస్తాడు.

Meghasandesam Serial Today Episode: డాన్స్ అకాడమీలో గగన్ చాంబర్‌లోకి వెళ్ళిన నక్షత్ర గగన్ కూర్చునే కుర్చీ మీద గమ్ పోసి బయటకు వెళ్లి చెర్రిని పిలుస్తుంది. చెర్రి రానని చెప్తాడు. రమ్మంటుంటే అని కోపంగా పిలుస్తుంది. చెర్రి రానని చెప్పగానే.. నక్షత్ర తన బ్లౌజ్ హుక్ ఊడిపోయిందని చూపిస్తుంది. దీంతో చెర్రి వెళ్తాడు. చెర్రిని చాంబర్ లోకి తీసుకెళ్తుంది. చెర్రి హుక్స్ పెట్టి బయటకు వెళ్లిపోతుంటే.. చేయి పట్టుకుని ఆపేస్తుంది నక్షత్ర.
నక్షత్ర: సారీ బావ నిన్ను చాలా ఏడిపించాను. రియల్లీ సారీ..
చెర్రి: ఏయ్ ఏంటిది మళ్లీ ఇంకో నాటకమా..?
నక్షత్ర: నాటకం కాదు బావ.. గగన్ బావను ఇందాక నా చేతులతో నేనే చంపుకునే దాన్ని అని చాలా ఫీలయ్యాను. పక్కకు వెళ్లి ఏడ్చాను కూడా అప్పుడే అనిపించింది బావ. ఏముంది జీవితం ఇలా అంటే అలా అయిపోతుందని. ఉన్నదాంతో తృప్తి పడటమే తప్పా..? లేని దాని గురించి ఆలోచిస్తే.. టైం వేస్ట్ అవుతుందని సడెన్‌గా జ్ఞానోదయం అయింది.
చెర్రి: ఏడవకు..? నీ కళ్లకు అసలు కన్నీళ్లు సూట్ అవ్వవు. నక్షత్ర ఏడ్వకు ఆపు.. నువ్వు ఇలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వడం లేదు.
నక్షత్ర: ఇన్నాళ్లు నిన్ను బాధపెట్టాను నన్ను క్షమించు బావ. ఫ్లీజ్ బావ నన్ను క్షమించు.
చెర్రి: ఓకే ఓకే
నక్షత్ర: ఏంటి బావ ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు నమ్మకం కలగడం లేదా..?
చెర్రి: అంటే అది నమ్మాలో లేదో..?
నక్షత్ర: ఏంటి బావ నమ్మకం కలగడం లేదా..? అయితే ఇలా బావ కూర్చో నీ కాళ్లు కడుగుతాను
అంటూ గమ్ వేసిన కుర్చీలో చెర్రిని కూర్చోబెడుతుంది. గమ్ అతుక్కుపోవడంతో చెర్రి ఏయ్ ఏం చేశావో అంటూ లేవడానికి ట్రై చేస్తాడు. నక్షత్ర కోపంగా ఆ భూమితో కలిసి ప్లాన్ చేస్తావా..? ఇప్పుడు చేయరా ప్లాన్ ఎలా చేస్తావో నేను చూస్తాను అంటూ వెళ్లిపోతుంది. తర్వాత డాన్స్ స్కూల్‌లో భూమి పిల్లలకు డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తుంది. ఇంతలో అక్కడిక ఉదయ్ వస్తాడు. గుడ్ మార్నింగ్ భూమి అంటాడు. ఉదయ్‌ని చూసిన గగన్ విసుగ్గా చూస్తాడు.
ఉదయ్: పెళ్లి అయ్యేంత వరకు భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు నాకు నీ చుట్టూ తిరగాలని ఉంది భూమి.
భూమి: ఈ క్లాస్‌లో ఇలాంటివి మాట్లాడకూడదని చెప్తున్నాను కదా..? మీరు వెళ్లండి
ఉదయ్: వచ్చింది వెళ్లడానికి కాదు భూమి. నేను కూడా డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకు డాన్స్ నేర్పమని మీ నాన్న గారి రికమండేషన్ లెటర్.
భూమి: మీకు అడ్మిషన్ నేను ఒక్కదాన్ని ఇవ్వలేను ఆయన కూడా ఓకే అంటేనే మీరు జాయిన్ అవ్వగలరు.
అని చెప్పగానే ఇద్దరూ కలిసి గగన్ చాంబర్‌లోకి వెళ్తారు. ఉదయ్, శరత్ చంద్ర ఇచ్చిన లెటర్ గగన్ కు ఇస్తాడు.
ఉదయ్: బ్రో నన్ను ఈ డాన్స్ అకాడమీలో జాయిన్ చేసుకో..
అని చెప్పగానే.. గగన్ లెటర్ చూసి చదివి కోపంగా ఆ లెటర్ చించి పాడేస్తాడు. దీంతో ఉదయ్ కోపంగా గగన్‌ను చూస్తంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















