Meghasandesam Serial Today August 12th: ‘మేఘసందేశం’ సీరియల్: అకాడమీని క్యాన్సిల్ చేయించేందుకు అపూర్వ ప్లాన్ - అయోమయంలో పడిపోయిన భూమి
Meghasandesam serial today episode August 12th: అకాడమీ ఓపెనింగ్ విషయంలో అపూర్వ ప్లాన్ ప్రకారం శరత్చంద్రను రెచ్చగొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: భూమి.. శివకు ఫోన్ చేసి తనకు గగన్‌ను చూడాలని ఉందని చెప్తుంది. అయితే గగన్ రూంలో నిద్రపోతున్నాడని వీడియో కాల్ చేస్తానని శివ చెప్పగానే.. ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నారు వీడియో కాల్ చేసి డిస్టర్బ్ చేయోద్దని చెప్తుంది భూమి. ఒక ఫోటో తీసి పంపించు అని చెప్పగానే.. శివ, గగన్ ఫోటో తీసి భూమికి సెండ్ చేస్తాడు. గగన్ ఫోటో చూసిన భూమి నవ్వుతూ ఫోటోను కిస్ చేయబోతుంటే.. గగన్ ఫోటో మాట్లాడుతుంది.
గగన్: ఏయ్ అసలు నీకు బుద్దిందా.. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని పరాయి మగాడితో పరాచికాలా..? ముద్ద ముచ్చట్లా..? నిన్న చేసుకోబోయే వాడికి ఈ విషయం తెలిస్తే ఉరేసుకుని చస్తాడు.
భూమి: చస్తే చావనివ్వండి నాకేంటి..? ఆయినా ఆయన చూసేవాడు.. మీరు చేసుకోబోయేవారు. అయినా మీరు తప్పా నన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. అందుకే ముద్దు ముచ్చట్లు..
గగన్: వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావు.
భూమి: మీ ఇంట్లో ఉండి ధైర్యం చూశాను కదా..? ఆ ధైర్యమే కొంచెం అప్పు తీసుకున్నాను. అయినా మీకు తియ్యగా ముద్దు పెట్టుకుందామనుకుంటే చిరాగ్గా ఈ డిస్కషన్స్ ఏంటి..? కళ్లు మూసుకుని పడుకోండి ఫస్ట్.. ఏ ఊరికే చెబితే చాలదా..? కర్ర పట్టుకుని రమ్మంటారా…?
అంటూ ఫోటోతో మాట్లాడుతుంది భూమి. తర్వాత మెల్లగా ఫోటోను ముద్దు పెట్టుకుంటుంది. మరోవైపు నక్షత్ర పుల్లుగా తాగి గగన్ వాళ్ల ఇంటికి వెళ్తుంది. డోర్ కొడుతుంది.
నక్షత్ర: బావా… బావా నీ నక్షత్ర వచ్చింది రా బావ
గగన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు.
గగన్: తాగి వచ్చావా...?
నక్షత్ర: అవును బావ తాగే వచ్చాను. నేను విషం తాగేం రాలేదు బావ. జస్ట్ మందు తాగి వచ్చాను. రోజూ అనిపిస్తుంది బావ విషం తాగి చచ్చిపోవాలని. నీ మీద ఆశ చావక చచ్చే ధైర్యం లేక ఏం చేయాలో అర్థం కాక ఇలా తాగుతున్నాను బావ.
శారద: అమ్మా నక్షత్ర ఒక ఆడపిల్ల తాగడమే తప్పు తాగిన తర్వాత పరాయి వాళ్ల ఇంటికి రావడమే పెద్ద తప్పు.
నక్షత్ర: బాగా చెప్పారు.. ఎంత బాగా చెప్పారో..? నేనొక ఆడపిల్లనని గుర్తించారు. థాంక్యూ సో మచ్ అత్తయ్యా.. మరి భూమి ఒక ఆడపిల్లే మీ అబ్బాయి ప్రేమించాడు. ఇక్కడ ఉన్న ఈ ఆడపిల్ల మీ అబ్బాయిని ప్రేమించింది. కానీ మీ అబ్బాయిని ఆ భూమిని కలపడం కోసం ఎవడో ఒకడు వచ్చి నా మెడలో తాళి కట్టేస్తే నాకెలాగుంటుంది. వాళ్లది మాత్రమే ప్రేమా.. నాది ప్రేమ కాదా...? చెప్పు బావ..
అంటూ నక్షత్ర నిలదీస్తుంటే.. శారద ఓదారుస్తుంది. మన సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిపోయక ఇష్టం ఉన్నా లేకపోయినా సర్దుకుపోవాలి అంటూ చెప్తుంది. మరోవైపు అపూర్వ, శరత్ చంద్ర దగ్గరకు వెళ్లి భూమి డాన్స్ అకాడమీ ఎవరితో ఓపెన్ చేయిస్తుంది అని అడుగుగుతుంది.
శరత్: డాన్స్ అకాడమీ మన భూమి ఎవరితో ఓపెన్ చేయిస్తుంది. అయితే నాతో ఓపెన్ చేయిస్తుంది. లేదా నేను చెప్పిన వాడితో చేయిస్తుంది.
అపూర్వ: ఇంకెవరితోనైనా చేయిస్తానని మాట ఇచ్చిందేమో…? ఒకసారి నిర్దారించుకుంటే మంచిది బావ
అని అపూర్వ చెప్పగానే శరత్ చంద్ర బయటకు వచ్చి భూమిని పిలుస్తాడు. భూమి చెప్పండి నాన్న అంటూ రాగానే డాన్స్ అకాడమీ ఎవరితో ఓపెన్ చేయిద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఇప్పుడ అదెందుకు నాన్న అని భూమి అడగ్గానే.. మీ నాన్న గారు ఉదయ్‌తో ఓపెనింగ్ చేయించాలనుకుంటున్నారు అని అపూర్వ చెప్తుంది. ఇంతలో ఉదయ్ కూడా తాను రెడీ అంటూ వస్తాడు. దీంతో భూమి డైలమాలో పడిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















