Meghasandesam Serial Today April 7th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమి కోసం వెళ్లిన మీరా – గగనే ప్రాణం అన్న భూమి
Meghasandesam Today Episode: భూమిని ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన మీరాకు తాను ఇంటికి రానని భూమి చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : అపూర్వ బాధపడుతుందని మీరా హాస్పిటల్‌కు వెళ్లి భూమిని తీసుకురావడానికి బయలుదేరుతుంది. ప్రసాద్ వద్దని వారిస్తాడు. ఎంత చెప్పినా వినకుండా మీరా హాస్పిటల్‌కు వెళ్తుంది. మరోవైపు అపూర్వ బాధతో రూంలోకి వెళ్లిపోతుంది. వెనకే సుజాత వాటర్ తీసుకుని వెళ్తుంది.
సుజాత: మంచినీళ్లు తాగు అమ్మాయి. కొంపదీసి నేను ఇప్పుడు షాక్ అవ్వాలా ఏంటి..? నువ్వంతా పశ్చాతాప పడిపోయిన లబోదిబో అంటే నేనెందుకు నమ్ముతాను అమ్మాయి. ఏదో స్కెచ్ వేశావు. ఫోటో ముందు డ్రామాను రక్తి కట్టించావు. కానీ నీ ఏడుపును నమ్మలేదు.
అపూర్వ: బాగానే పట్టేశావు పిన్ని గుడ్.. ఏమైంది బేబీ..
నక్షత్ర: ఇంకేం కావాలి. వస్తుందిగా నీ కూతురు భూమి. తననే నెత్తి మీద పెట్టుకుని చూసుకో నన్ను పాతాళానికి తొక్కేయ్..
అపూర్వ: చాచా అవేం మాటలు
నక్షత్ర: నా మాటలు కూడా నీకు చాచా లానే మారిపోయాయి మమ్మీ.. ఇక నేను నెంబర్ టూగానే మిగిలిపోయాను. గగన్ బావను ప్రేమిస్తే అక్కడ నెంబర్ టూనే.. ఇక్కడ నేను నెంబర్ టూనే.. ఇంకెందుకు మమ్మీ నేను బతకాలి.
అపూర్వ: బతకడం కోసం ఇంకొకరి బతుకు తీసైనా మనం బతకాలి. ముందు అది నేర్చుకో..
సుజాత: మరే మీ అమ్మలా మారమని చెప్తుంది. అంతే కదా అమ్మాయి.
అపూర్వ: అంతే పిన్ని.. చూడు నక్షత్ర భూమిని ఇక్కడకు తీసుకురమ్మని ఏడ్చి గగ్గోలు పెట్టింది. ఆ భూమి మీద ప్రేమతో కాదు పగతో ఈ పశ్చాత్తాపం అంటావా అది మనకు అసలు లేదు.
సుజాత: అంటే మీ అమ్మది సిగ్గు శరం లేని బతుకు అని చెప్తుంది అమ్మాయి.
అపూర్వ: పిన్ని
సుజాత: అంటే నక్షత్ర చిన్న పిల్ల కదమ్మా కాస్త డీటెయిల్‌గా చెప్తేనే అర్థం అవుతుందని
అపూర్వ: ఏం అవసరం లేదు నోరు మూసుకో.. చూడు బేబీ ఆ భూమి గగన్ ఇంట్లో ఉంటే దాన్ని వాడు ఎప్పటికీ కాపాడేస్తుంటాడు. అందుకే అంత ఏడుపు ఏడ్చి దాన్ని ఇక్కడకు రప్పిస్తున్నాను. ఈ రాత్రికే నేను దాన్ని చంపేస్తాను. ఎప్పటికీ ఈ ఇంటికి నెంబర్ వన్ గా నువ్వే ఉంటావు. అర్థం అయిందా..?
సుజాత: నీ దిక్కు మాలిన ఏడుపు వెనక ఇంత కుట్ర ఉందా..? ఇది నేను అర్థం చేసుకోలేకపోయాను అమ్మాయి.
అంటుంది సుజాత. దీంతో అపూర్వ కోప్పడుతుంది. మరోవైపు శరత్‌చంద్రను చూసి భూమి ఎమోషనల్ అవుతుంది. నా పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేకుండా ఉంది అటూ ఏడుస్తుంది. నీ కూతురిని అయినందుకు నన్ను వద్దంటున్నారు అంటూ బాధపడుతుంది. మరోవైపు గగన్ కూడా బాధగా ఆలోచిస్తుంటాడు. శారద, పూర్ణి బాధపడుతూ ఉంటారు. ఇంతలో కృష్ణ ప్రసాద్ శారదకు ఫోన్ చేస్తాడు. పూర్ణి ఉందని శారద ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో ఎవరమ్మా ఫోన్ అని అడుగుతుంది. కంగారులో శారద మీ నాన్న అని చెప్తుంది. పూర్ణి కోపంగా చూసే సరికి కృష్ణ ప్రసాద్ అని చెప్తుంది. ఆన్ చేసి స్పీకర్ ఆన్‌లో పెట్టు ఏం మాట్లాడుతారో నేను వింటాను అని చెప్తుంది. శారద ఫోన్ లిఫ్ట్ చేయగానే భూమి కోసం మీరా వచ్చిన విషయం చెప్తాడు. భూమిని అసలు పంపించొద్దని అపూర్వ భూమిని చంపేందుకు ప్లాన్ చేస్తుందని చెప్తాడు. దీంతో శారద కంగారు పడుతుంది. మరోవైపు భూమి కోసం మీరా హాస్పిటల్ కు వెళ్తుంది. హాస్పిటల్ లో ఉన్న భూమి గగన్‌కు ఫోన్ చేస్తుంది. గగన్ లిఫ్ట్ చేయడు.
మీరా: భూమి ఎలా ఉన్నాము అమ్మా..
భూమి: అత్తయ్యా..
మీరా: మా అన్నయ్యకు ఇంత కష్టం వస్తుందని ఎవరం మాత్రం కలగన్నాం తల్లి. నిన్ను మహారాణిలా చూడటానికైనా కోమాలోంచి లేచి వస్తాడు మా అన్నయ్య. రామ్మా మన ఇంటికి వెళ్దాం.
భూమి: నేను రాను అత్తయ్యా.. ఆ ఇంటికి వస్తే.. నేను ప్రాణంగా ప్రేమించిన గగన్ గారు నా ముఖం చూడరు.
మీరా: ఆ ఒక్కడి కోసం మన ఇంటిని అంతా వదిలేసుకుంటావా..?
భూమి: వదిలేసుకుంటాను అత్తయ్యా..గగనగారే నా ప్రపంచం.
అంటూ భూమి ఏడుస్తుంది. మీరా ఎన్ని రకాలుగా కన్వీన్స్ చేయాలని చూసినా భూమి వినదు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















