అన్వేషించండి

Meghasandesam Serial Today April 5th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్‌చంద్రకు నిజం చెప్పిన భూమి – గగన్‌ గెంటేయడంతో సూసైడ్‌ చేసుకోవాలనుకున్న భూమి  

Meghasandesam Today Episode: గగన్‌ ఇంట్లోంచి గెంటి వేయడంతో శరత్ చంద్ర దగ్గరకు వెళ్లి తనకు చనిపోవాలని ఉంది అంటూ భూమి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : గగన్‌ రౌడీలను కొట్టి డీఎన్‌ఏ రిపోర్ట్‌ మారకుండా చూసిన విషయం శారదకు చెప్తుంది భూమి. గగన్‌ ఎక్కడ అని అడగ్గానే శారద పైన ఉన్నాడని చెప్తుంది. దీంతో భూమి హ్యాపీగా పరుగెత్తుకుంటూ పైకి వెళ్లి గగన్‌ ను హగ్‌ చేసుకుంటుంది.

భూమి: ఈరోజు నా పరువు కాపాడారు. ఏమిస్తే మీ రుణం తీర్చుకోగలను అండి. అయినా నేను మీకు ఏమి ఇవ్వగలను. నన్ను నేను అర్పించుకోవడం తప్పా

గగన్‌: పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి భూమి. ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి మాట్లాడేది ఇలాగేనా..?

భూమి: అదేంటండి. మనిద్దరికే కదా పెళ్లి అవుతుంది.

గగన్‌: అలా ఎవరు చెప్పారు నీకు నేను చెప్పానా..?

భూమి: ఏంటండి అలా మాట్లాడుతున్నారు.. మనం ఇద్దరం ప్రేమించుకున్నాం కదా..?

గగన్: ఎప్పుడు ప్రేమించుకున్నాం. నువ్వు శరత్‌ చంద్ర కూతురువి అని తెలియక ముందు. తెలిశాక ఆ ప్రేమ ఆ క్షణంలోనే సమాధి అయిపోయింది.

భూమి: అలా మాట్లాడకండి మీరు లేకుండా నేను బతకలేను.

గగన్‌: శరత్‌ చంద్ర కూతురు పక్కన నేను బతకలేను.

భూమి: అలా అంటారేంటండి. శరత్‌ చంద్ర కూతురు అని తెలియక ముందే మీరు నన్ను ప్రేమించారు. నేను మిమ్మల్ని ప్రేమించాను. ఒకప్పుడు నా పక్కన బతకాలనుకున్న మీరు ఇప్పుడు నా పక్కన బతకలేను అంటున్నారు. ఇందులో నేను చేసిన తప్పేంటండి. నేను ఆయన కూతురుగా పుట్టడమేనా..?

గగన్‌: అవును.. ఒకప్పుడు అల్లరిగా చూసే నిన్ను ఇష్టపడి ప్రాణంగా ప్రేమించి కలిసి బతకాలనుకున్న కానీ అదంతా ఆ శరత్ చంద్ర కూతురువి అని తెలియక ముందు. ఎప్పుడైతే ఆ కుటుంబంతో బంధం ఉందని తెలిసిందో ఆ క్షణమే నీతో శాశ్వతంగా నా బంధం తెంచేసుకున్నాను.

భూమి: మీరు అలా అంటారనే ఇన్నాళ్లు నేను ఆయన కూతురుని అన్న నిజాన్ని నాలోనే దాచేసుకున్నాను.

గగన్‌: నిజం దాచేస్తే దాగదు భూమి. ఇన్నాళ్లు నా శత్రువు కూతురుని ప్రేమిస్తున్నాను అని తెలిస్తేనే… ఇన్నాళ్లు శరత్‌ చంద్ర కూతురువి అనే నిజం నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు లోకం అంతా తెలిసిపోయింది. వెళ్లు ఇప్పుడు నీకొచ్చిన ఈ కొత్త ఐడెంటితో వెళ్లి మీ ఇంటి దగ్గర హాయిగా బతుకు

భూమి: అలాంటప్పుడు నాకు అపూర్వే మేలు చేసినట్టు కదండి.

గగన్‌: చూడు భూమి మనం ఒకరినొకరం మోసం చేసుకుని కలిసి బతకలేం అని నీకు తెలుసు. నాకు తెలుసు. ఇక నువ్వు శరత్ చంద్ర కూతురువి అని తెలిశాక నీతో కలిసి బతకలేను. అది నువ్వు తెలుసుకో. బయలుదేరు ఇక నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు.

భూమి: ఫ్లీజ్‌ అండి మీరు నా ప్రేమను అర్థం చేసుకోండి.

అని చెప్పగానే.. గగన్‌ కోపంగా భూమి చేయి పట్టుకుని కిందకు తీసుకెళ్తాడు. శారద, పూర్ణి అడ్డు పడినా ఆగకుండా భూమిని గేటు బయటకు తీసుకెళ్లి తోసేస్తాడు. నీకు ఈ ఇంటితో ఎలాంటి  సంబందం లేదు అని చెప్తాడు. శారద అడ్డుపడబోతుంటే అమ్మా నీకు నా గురించి బాగా తెలుసు. ఒక్కసారి నేను నిర్ణయం తీసుకున్నా దానికి నేను ఎంతలా కట్టుబడి ఉంటానో తెలుసు అంటూ శారద మాట కూడా వినకుండా ఇద్దరినీ తీసుకుని లోపలికి వెళ్తాడు. తర్వాత భూమి హాస్పిటల్‌ లో ఉన్న శరత్ చంద్ర దగ్గరకు వెళ్లి బాధ పడుతుంది. నాకు మీ ఇద్దరు దేవుళ్లతో సమానం ఏ దేవుడు లేకపోయినా నేను బతకలేను అంటూ ఏడుస్తుంది. కేవలం నీ కూతురును అయినందుకు ఆయన నన్ను వద్దంటున్నాడు అంటూ ఎమోషనల్‌ అవుతుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నాన్నా అంటూ బోరున విలపిస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలికి కఠిన పరీక్ష! సహస్ర యమున చెప్పినట్లు చేస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలికి కఠిన పరీక్ష! సహస్ర యమున చెప్పినట్లు చేస్తుందా!
Godavari Serial Today October 29th: 'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌కి నందు, మురళీ భార్యాభర్తలని తెలిసిపోతుందా! జాను, సంజుల కారు రైడ్!
'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌కి నందు, మురళీ భార్యాభర్తలని తెలిసిపోతుందా! జాను, సంజుల కారు రైడ్!
Gundeninda Gudigantalu Oct 29:బాలు వాళ్ల ఇల్లులాక్కుని రోడ్డునపడేయడానికి తాయార్‌ కుట్రలు..తాకట్టు ఇల్లు తన పేరిటకు మార్పు
గుండెనిండా గుడిగంటలు:బాలు వాళ్ల ఇల్లులాక్కుని రోడ్డునపడేయడానికి తాయార్‌ కుట్రలు..తాకట్టు ఇల్లు తన పేరిటకు మార్పు
Nindu Manasulu Serial Today October 29th: నిండు మనసులు: ఇందిరనే నా కన్నతల్లి.. మైండ్‌ బ్లాక్ ట్విస్ట్‌ ఇచ్చిన గణ! గుండె బాదుకున్న విజయానంద్!
నిండు మనసులు: ఇందిరనే నా కన్నతల్లి.. మైండ్‌ బ్లాక్ ట్విస్ట్‌ ఇచ్చిన గణ! గుండె బాదుకున్న విజయానంద్!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget