Meghasandesam Serial Today April 30th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ వదిలేసిన రాజేంద్ర – రాజును చితక్కొట్టిన గగన్
Meghasandesam Today Episode: ఏసీపీ స్టేషన్‌లో ని టైంలో గగన్‌ను షెల్ లోంచి బయటకు వదిలేస్తాడు ఇన్స్పెక్టర్ రాజేంద్ర. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : అపూర్వ జైలుకు వచ్చి గగన్‌కు వార్నింగ్ ఇస్తుంది. నువ్వు జైల్లో ఉంటే మీ అమ్మా చెల్లిని ఎవరు కాపాడతారని చెప్తుంది. దీంతో గగన్ కోపంగా చూస్తుంటే.. వాళ్లను ఏమీ అనను దూరంగా వెళ్లి బతకమంటాను. కానీ భూమిని ఎవరు కాపాడతారు అంటుంది. గగన్ కోపంతో ఇంకా ఇక్కడే ఉంటే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు గగన్. మరోవైపు భూమిని లోపల నుంచి ఎలాగైనా తప్పించాలని చెర్రి, బిందు ప్లాన్ చేస్తారు. రూం కీస్ కొట్టేయాలని అనుకుంటారు. అపూర్వ కీస్ తిప్పుతూ కూర్చుని ఉంటుంది. సుజాత వస్తుంది.
సుజాత: సొమ్మొక్కరిది సోక ఒకరిది అంటే ఇదే అమ్మాయి. మహారాణిలా ఉండాల్సిన ఆ భూమి దాసి దానిలా పడుంది. దాని దగ్గర దాసిలా ఉండాల్సిన నువ్వు మహారాణిలా ఉన్నావు.
అపూర్వ: పిన్ని నాతో తిట్లు తినకుండా ఒక్కరోజు కూడా ఉండలేవా..? చీ అనిపించుకోకపోతే నీకు రోజు గడవదా..?
అని తిడుతూ వెళ్లిపోతుంది. ఇంతలో చెర్రి, బిందు ఒక వైరు తీసుకుని వచ్చి సుజాత కూర్చున్న చైర్‌కు చుడతాడు.
చెర్రి: ఏంటి ఫ్రూట్స్ తింటున్నారా..?
సుజాత: ఏంటో అబ్బయి తొందర్లో పెళ్లి కావాల్సిన దాన్ని ఆ మాత్రం మెయింటనెన్స్ చేయాలి కదా..?
చెర్రి: రేపో మాపో పోయేదానికి ఈ వయసులో పెళ్లంటా..?
అంటూ బిందుకు సైగ చేస్తాడు. బిందు కరెంట్ స్విచ్ వేస్తుంది. సుజాత గిలా గిలా కొట్టుకుంటుంది. చెర్రి గట్టిగా అరుస్తూ గోరింటాకు పిన్నికి పిట్స్ వచ్చినట్టు ఉన్నాయి. అంటాడు. అపూర్వ పరుగెత్తుకు వస్తుంది. చెర్రి ఆ తాళాలు ఇటివ్వండి అని తాళాలు తీసుకుని సుజాత చేతిలో పెడుతుంటే బిందు స్విచ్చాప్ చేస్తుంది. చెర్రి తాళాలు సుజాత చేతిలో పెడతాడు. సుజాత మామూలుగా అయిపోతుంది. చెర్రి తాళాలు మార్చేస్తాడు.
సుజాత: అదేంటి అమ్మాయి నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందేంటి..?
చెర్రి: ఓ ఫిట్స్ వస్తే.. కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుందా..? చూడండి గోరింటాకు వయసు అయిపోతుంది కదా..? ఎక్కువ ఆలోచించకు మళ్లీ ఫిట్స్ వస్తాయి.
అనగానే సుజాత కోప్పడుతుంది. అపూర్వ చెర్రిని అక్కడి నుంచి వెళ్లిపో అని చెప్తుంది. చెర్రి వెంటనే వెళ్లి భూమి రూం ఓపెన్ చేస్తాడు. భూమి వెళ్లిపోతుంది. రూంలో ఎవ్వరూ లేకపోతే డౌట్ వస్తుంది. అని బిందును రూంలో ఉంచి లాక్ చేస్తాడు చెర్రి. మరోవైపు పూర్ణి కోపంగా శారదను తిడుతుంది.
పూర్ణి: ఆయన భార్య అపితే ఆగిపోయాడు. కొడుకు కంటే ఆయన భార్య మాటే వేదం అయిపోయింది. ఆయనకు నిజానికి ఆ కుటుంబమే కావాలి. వాళ్ల కోసమే కదా మన ముగ్గురిని రోడ్డు మీద నిలబెట్టి వదిలేసి వెళ్లిపోయాడు. నాకు తెలియక అడుగుతాను నిజంగా మేము ఆయన పిల్లలమేనా..? ఆయనకే పుట్టామా..?
శారద కొట్టడానికి ప్రయత్నించి ఆగిపోతుంది.
పూర్ణి: ఆగిపోయావేం.. కొట్టు అమ్మా కొట్టు.. నిజం అన్నయ్యకు తెలిసిన రోజు ఏం సమాధానం చెప్తావో నేను చూస్తాను.
అంటూ పూర్ణి వెళ్లిపోతుంది. మరోవైపు స్టేషన్‌లో ఉన్న గగన్‌ను రాజేంద్ర బయటకు తీసుకొచ్చి రాజు షెల్ లోకి పంపిస్తాడు.
గగన్: నీకు నేను సుపారీ ఇవ్వడం ఏంట్రా..?
రాజు: ఇచ్చారు కదా సార్..
గగన్: రేయ్ అబద్దం ఆడావంటే చంపేస్తాను. నువ్వు అపూర్వ మనిషివి అని నాకు తెలుసు. అపూర్వ ఇచ్చిన దానికంటే డబుల్ నేను ఇస్తానురా నిజం చెప్పు.
అని గగన్ అడగ్గానే.. రాజు నవ్వుతుంటాడు. నవ్వుతావేంట్రా అని గగన్ కోపంగా రాజును కొడుతుంటాడు. ఇంతలో స్టేషన్‌కు ఏసీపీ వస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















