Krishna mukunda Murari November 24th Episode: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ : మురారి అమెరికా టూర్ క్యాన్సిల్ చేసిన భవాని – కృష్ణ నుంచి మురారిని దూరం చేసేందుకు భవాని కొత్త ప్లాన్
Krishna Mukunda Murari Today Episode: కృష్ణ తన చిన్నాన ప్రభాకర్ ను చూడటానికి జైలుకు వెళ్తుంటే మురారి కూడా తాను వస్తానడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna mukunda murari serial today Episode Promo: మురారికి చేతులు కాలిన విషయం తెలియడంతో భవాని కోపంగా కృష్ణ దగ్గరకు వెళ్తుంది. అయితే అప్పటికే కృష్ణ ఇంటిలో నందిని ఉండటం చూసి భవాని లోపలికి వెళ్లకుండా గుమ్మం దగ్గరే ఉండిపోతుంది. లోపల నందిని, మురారి గురించి బాధపడుతుంది. మురారికి గతం గుర్తుకు వస్తే నీకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు.. అంటూ కృష్ణ వైపు బాధగా చూస్తుంది. మురారికి త్వరగా గతం గుర్తుకువస్తే బాగుండు అంటుంది నందిని. ఏసీపీ సార్‌కు త్వరలోనే గతం గుర్తుకు వస్తుంది. మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటామని కృష్ణ చెప్తుంది. అది ఎలా అంటూ నందిని కృష్ణను అడగగానే.. చూస్తూ ఉండు పెద్దత్యయ్యే మా ఇద్దరిని కలుపుతుంది. అని కృష్ణ చెప్పగానే గుమ్మం దగ్గర ఉన్న భవాని షాక్ అవుతుంది. లోపల ఉన్న నందిని కూడా అది ఎలా సాధ్యం కృష్ణ.. త్వరలోనే ముకుంద, మురారి అమెరికా వెళ్తున్నారు కదా మురారి అమెరికా వెళ్తే ఇక నువ్వు ఒంటరిదానివి అవుతావు. పైగా ఇక నీ అవసరం లేదని ఇక్కడి నుంచి నిన్ను పంపించేస్తారు అంటుంది నందిని. ఏసీపీ సార్ బెటర్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్తున్నారు. బెటర్ ట్రీట్‌మెంట్ అంటే ఏసీపీ సార్‌కు త్వరగా గతం గుర్తుకు వస్తుంది. గతం గుర్తుకు రాగానే ఏసీపీ సార్ ఎక్కడ ఉన్నా నాకోసం వచ్చేస్తారు. సో ఏసీపీ సార్ వీలైనంత త్వరగా అమెరికా వెళ్లాలి. ఆయనకు గతం గుర్తుకు రావాలి అని నేను కోరుకుంటున్నాను అంటుంది కృష్ణ. దీంతో నందిని నిజమే కదా నా బుర్రకు ఇది తట్టనేలేదు. అంటూ సంతోషిస్తుంది. గుమ్మం దగ్గర ఇదంతా వింటున్న భవాని ఆలోచనలో పడుతుంది.
మురారి, కృష్ణను మరచిపోవాలని ముకుంద అనుకుంటుంది. అందుకు మురారికి లేనిపోని కట్టుకథలు చెప్తుంది. కృష్ణ గురించి వాళ్ల ఫ్యామిలీ గురించి లేనిపోని అబద్దాలు చెప్తుంది. ముకుంద ఎన్ని చెప్పినా మురారి నమ్మడు. ముకుంద అసహనంతో రగిలిపోతూ.. మురారి మనసులో నుంచి కృష్ణ ను ఎలాగైనా చెరిపివేయాలని ఫిక్స్ అవుతుంది. ఇక భవాని కూడా మురారికి కృష్ణ ను శాశ్వతంగా దూరం చేయాలని అనుకుంటుంది. అయితే అమెరికాకు మురారిని పంపిస్తే గతం త్వరగా గుర్తుకు వస్తుందని అప్పుడు మురారి, కృష్ణ కోసం అమెరికా నుంచి పరుగెత్తుకొస్తాడని అలా జరగకూడదని భవాని అనుకుంటుంది. అందుకోసం మురారిని అమెరికా పంపించాలనే తన నిర్ణయాన్ని మార్చుకుని కృష్ణకు షాక్ ఇవ్వాలనుకుంటుంది భవాని. అలాగే కృష్ణను మురారికి శాశ్వతంగా దూరం చేసేందుకు కొత్త ప్లాన్ వేస్తుంది భవాని.
జైలులో ఉన్న తన చిన్నాన్నతో మాట్లాడటానికి కృష్ణ ఆటోలో బయలుదేరుతుంది. కృష్ణ ఆటో ఎక్కడాన్ని ఇంట్లోంచి గమనించిన మురారి పరిగెత్తుకు వచ్చి వేణి గారు మీరు నన్ను అవమానిస్తున్నారు అని అంటాడు. మురారి మాటలకు షాక్ అయిన కృష్ణ నేను మిమ్మల్ని అవమానించడమేంటని అడుగుతుంది. మీరు నిజంగానే నన్ను అవమానించారు. ఎందుకంటే మీరు బయటికి వెళ్లాలనుకుంటే నన్ను అడగొచ్చు కదా.. నేను కారులో మిమ్మల్ని డ్రాప్ చేసేవాడిని అలా కాకుండా మీరు ఆటోలో వెళ్తున్నారంటే నన్ను అవమానించినట్లే కదా అని మురారి అనడంతో కృష్ణ ఆలోచనలో పడిపోతుంది. తన చిన్నాన్న దగ్గరికి మురారిని తీసుకెళితే ఎలాంటి సమస్యలు వస్తాయోనని కృష్ణ భయపడుతుంది. మురారితో ప్రభాకర్ ఏం మాట్లాడుతాడో అని కంగారు పడుతుంది. మురారిని తనతో రాకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా ఇంటి బాల్కనీలోంచి గమనిస్తున్న భవాని ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటుంది. ఇదే అదనుగా మురారికి కృష్ణపై అనుమానం కలిగేలా చేయాలనుకుంటుంది భవాని. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply