Krishna Mukunda Murari Serial Today May 30th: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : కృష్ణని ఇంటికి తీసుకొస్తున్న ముకుంద.. ఆడదాని చేతిలో మోసపోయానని తల్లి దగ్గర కుమిలిపోయిన ఆదర్శ్!
Krishna Mukunda Murari Serial Today Episode : కృష్ణను ఇంటికి తీసుకురావడానికి ముకుంద పెద్దపల్లి ప్రభాకర్ ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode : ప్రభాకర్ మురారికి కాల్ చేస్తాడు. ఫోన్ ఆఫ్ రావడంతో కృష్ణని అడుగుతాడు. కృష్ణ తన భర్త బిజీగా ఉన్నాడని భవాని కూడా అదే చెప్పింది కదా ఆయనే ఫ్రీ అయితే కాల్ చేస్తారు అని చెప్తుంది. ప్రభాకర్ ఇంకా అనుమానించినా కృష్ణ తనకు ఆకలి వేస్తుందని ఇంటికి తీసుకెళ్లిపోతుంది. ఇక సాయంత్రం ముకుంద కృష్ణ దగ్గరకు వస్తుంది.
ముకుంద: ఎలా ఉన్నావ్ కృష్ణ.
కృష్ణ: నువ్వు ఎందుకు వచ్చావ్.
ముకుంద: మనసులో.. నా మురారి కోసం అంటే వాళ్ల చిన్నాన్న పిన్నితో చెప్పి తన్నినా తన్నిస్తుంది.
కృష్ణ: మళ్లీ అడుగుతున్నాను ఎందుకు వచ్చావ్.
ముకుంద: చెప్పాను కదా కృష్ణ నీ కోసమే అని. అక్కడ నా వల్ల టెన్షన్ భరించలేక ప్రశాంతంగా ఉండొచ్చని ఇక్కడికి వచ్చావ్ కదా. నిన్ను ఎలా ప్రశాంతంగా ఉండనిస్తాను కృష్ణ.
కృష్ణ: నువ్వు ఎప్పుడైతే ముకుంద అని తెలిసిందో అప్పుడే ప్రశాంతత మొత్తం పోయింది. ఇంకేం మిగిలి ఉందని వచ్చావ్.
ముకుంద: నా మురారి ఇంకా నీ దగ్గరే ఉన్నాడు కదా తనని నా సొంతం చేసుకునే వరకు నాకు ప్రశాంతత ఉండదు కదా. అసలు ఈ రెండు రోజులు నువ్వు మురారి ఇంట్లో కనుకు ఉండి ఉంటే ఈ పాటికి నేను అనుకునేది జరిగేది. ఇద్దరూ బాగానే తప్పించుకున్నారు.
కృష్ణ: మనసులో ముకుంద ఏమో ఏదో జరిగుండేది అంటుంది. పెద్దత్తయ్య కూడా డల్‌గా ఉంది. అసలు ఏం జరిగి ఉంటుంది.
ముకుంద: ఇంతకీ మురారి ఎక్కడ.
కృష్ణ: మనసులో.. ఏసీపీ సార్ ఏదో పని మీద వెళ్లారని పెద్దత్తయ్య చెప్పారు. ఈ విషయం ముకుందకు తెలిసినట్లు లేదు. ఆయన ఇక్కడే ఉన్నారు అనుకొని ఇక్కడికి వచ్చినట్లు ఉంది. ఆయన గురించి నీకు ఎందుకు.
ముకుంద: అరే నాకు ఎందుకా. ఎంత మాట అనేశావ్ కృష్ణ. ఏం చేసినా ఎన్ని పాట్లు పడినా మురారి కోసమే కదా తెలిసి కూడా అడుగుతావేంటి. అయినా ఇక్కడే పెట్టి మాట్లాడుతావా లోపలికి రమ్మని చెప్పవా.
కృష్ణ: అక్కడ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ చాలు ఇక్కడి వాళ్లని అయినా ప్రశాంతంగా ఉండనివ్వు వచ్చిన దారిన వెళ్లు.
ఇంతలో శకుంతల పాలు తీసుకొని వచ్చి ఎవరు అని అడిగితే కృష్ణ తన ఫ్రెండ్ అని చెప్తుంది. ఇక శకుంతల మురారి ఫోన్ ఆపేశాడు అని అనేస్తుంది. దీంతో ముకుంద మురారి ఇక్కడికి కూడా రాలేదు అని అనుకుంటుంది. శకుంతల ముకుందని లోపలికి రమ్మని పిలుస్తుంది.
భవాని: కృష్ణకు ఏదో ఒకటి చెప్పి నాలుగు రోజులు అక్కడ ఉండమని చెప్పాను. ఈలోపు మురారి గురించి తెలుసుకోవాలి. మురారి కాల్ చేయకపోతే అది అక్కడ ఉండదు. ఇంట్లో వాళ్లతో.. మురారి మీకు ఎవరికీ కాల్ చేయలేదు కదా. ఎక్కడికి వెళ్లిపోయాడు. ఫోన్ ఆఫ్ చేయడం ఏంటి. ఎందుకు ఎవరూ ఏం మాట్లాడరు. అడిగేది మిమల్నే ఏం జరిగింది.
రేవతి: మీరా వెళ్లిపోయింది అక్క.
భవాని: వెళ్లిపోయిందా ఎక్కడికి అంటే తను చెప్పింది అంతా అబద్ధం అని మురారి ఏ తప్పు చేయలేదు అని చెప్పి వెళ్లిపోయిందా.
మధు: అలా జరిగితే సంతోషంగా మేమే మీకు ఫోన్ చేసేవాళ్లం కదా పెద్దమ్మ అని ఆదర్శ్ చేసిన రచ్చ చెప్తాడు. సమయానికి పెద్దమ్మ ఆపింది కాబట్టి సరిపోయింది లేదంటే మీరా ప్రాణాలు పోయేవి.
భవాని: అసలు వాడికి బుద్ధి లేదా.. ఇదంతా జరుగుతుంటే నువ్వు ఏం చేస్తున్నావ్ రేవతి. నేను అడిగింది మీరా వెళ్లిపోతుంటే నువ్వేం చేశావు అని. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్లిందో ఎవరి మీద కంప్లైంట్ ఇస్తుందో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఒకవేళ మన మురారినే తప్పు చేసి ఉండి ఉంటే. తను చెప్పింది నిజమే అయి మన మురారినే ఆ బిడ్డకు తండ్రి అయితే అప్పుడేంటి పరిస్థితి. మనం తనకి అన్యాయం చేశామని న్యాయం చేయమని అంటే చంపాలని చూశారని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏంటి పరిస్థితి. నాలుగు గోడల మధ్య పరిష్కారం అవ్వాల్సిన సమస్యలు నలుగురిలోకి వెళ్లిపోతున్నాయి మనకు వచ్చే సమస్యలు కొన్ని అయితే కొని తెచ్చుకొనే సమస్యలు మరికొన్ని. కొంచెం అయినా ఆలోచించలేదా.
భవాని ఆదర్శ్ దగ్గరకు వెళ్తుంది. ఆవేశమే కానీ ఆలోచిన ఉండదా అని తిడుతుంది. దీంతో ఆదర్శ్ ఎంత సేపు తప్పు చేసిన ఆ అమ్మాయి కోసం ఆలోచిస్తున్నావ్ కానీ నా కోసం ఆలోచించడం లేదా అని అడుగుతాడు.
ఆదర్శ్: మోస పోయిన నీ కొడుకు నీకు కనిపించడం లేదా. అసలు ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా నీ మాట జవదాటానా. నీకు చెప్పకుండా ఏమైనా చేశానా. నువ్వు ఒప్పుకుంటే కదా పెళ్లి చేసుకుంటా అనుకున్నాను. నాతో పెళ్లికి ఒప్పుకుంది. సరదాగా ఉంది. జీవితంలో నాకు మళ్లీ ఆశలు పుట్టించింది. కానీ మోసం చేసి వెళ్లిపోయింది ఆ బాధ కనిపించడం లేదా.
భవాని: బాధ ఉంటే చంపేస్తారా. నీ బాధ ఆలోచనలా మారాలి. ఆ ఆలోచన ఒక పరిష్కారం అవ్వాలి కానీ. కొత్త సమస్యలు తెచ్చిపెట్టకూడదు. అరే నా కొడుకు జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని బాధ పడని రోజు లేదురా. మీరా మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలీదు. నీతో ఎందుకు పెళ్లికి సిద్ధమైందో తెలీదు. మురారి తన బిడ్డకు తండ్రి అని ఎందుకు చెప్పిందో తెలీదు. అసలు మురారి ఏమయ్యాడో తెలీదు. అసలేం జరిగిందో తెలియాలి అంటే మీరా ఇక్కడ ఉండాలి కదరా.
ఆదర్శ్: అమ్మా జరిగింది చూస్తుంటే తను ఏదో ప్లాన్‌తో ఇక్కడికి వచ్చిందని అనిపిస్తుంది. తను ఎక్కడికి పోతుంది.
ఇక కృష్ణ, ముకుందలను ప్రభాకర్, శకుంతలు కూర్చొపెట్టి మాట్లాడుతారు. తన ఎదుటనే ముకుందని తిడతారు. కృష్ణ ఆపడానికి ప్రయత్నించినా ఆపరు. ముకుంద కానీ దొరికితే చితక్కొట్టాలి అనుకున్నాం అని కానీ చచ్చిపోయిందని అంటారు. ఇక ముకుంద కృష్ణని తనతో తీసుకెళ్తా అని అంటుంది. కృష్ణ కూడా వెళ్తాను అంటుంది. ప్రభాకర్ వాళ్లు కూడా కృష్ణని పంపేస్తారు.
భవాని, రేవతిలు కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పెద్ద తప్పు చేశానని భవాని బాధ పడుతుంది. భవాని పల్లకీ సేవ గురించి రేవతికి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: హోటల్ దగ్గరకు వచ్చి గొడవ చేసిన నర్శింహ.. కడియంతో కలిసి కార్తీక్ ప్లాన్!