Karthika Deepam 2 Serial Today May 30th: కార్తీకదీపం 2 సీరియల్: హోటల్ దగ్గరకు వచ్చి గొడవ చేసిన నర్శింహ.. కడియంతో కలిసి కార్తీక్ ప్లాన్!
Karthika Deepam 2 Serial Today Episode : శ్రీధర్ తన ప్రేయసి కావేరితో మాట్లాడం చూసిన కార్తీక్ ఫోన్ లాక్కోని చెక్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : దీప హోటల్ దగ్గర నర్శింహ మాటలు తలచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నర్శింహ అక్కడికి వస్తాడు. దీప చూడదు. కడియం చూసి ఏదో ఒకటి చెప్పి నర్శింహను తొందరగా పంపేయాలి అనుకుంటాడు. ఇక దీప కడియం మాటలకు నర్శింహను చూస్తుంది.
నర్శింహ కడియానికి టీ తీసుకురమ్మని చెప్పి దీపని చూస్తూ మనసులో.. నిన్ను వెంటాడటమే పనిగా పెట్టుకున్నానే నిన్ను ఎవడు కాపాడుతాడో నేను చూస్తా అని అనుకుంటాడు. ఇక కార్తీక్ కారులో వెళ్తూ ఉంటే శౌర్య స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది. పాటలు, ఆటల పోటీలు జరుగుతాయని వారమే గడువు ఉందని శౌర్య పేరు ఇచ్చిందో లేదో అనుకొని దీపకు విషయం చెప్పాలి అనుకుంటాడు.
నర్శింహ: టీలు కాఫీలు ఇవ్వడానికి ఎవర్నో పెట్టుకున్నట్లు ఉన్నావ్ కదరా వాళ్లతో పంపించు.
కడియం: నీకు కావాల్సింది టీనే కదా ఎవరు ఇస్తే ఏంటి తీసుకో.
నర్శింహ: వెధవ కంటింగ్‌లు ఇచ్చావ్ అంటే కళ్లజోడు పగలకొడతా.
కార్తీక్: వీడిని పోలీస్ స్టేషన్‌లో పెట్టి కొట్టించినా బుద్ధి రాలేదు అనుకుంటా మళ్లీ వచ్చాడు.
దీప: ఎందుకు వచ్చావ్.
నర్శింహ: నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేస్తావే నీ మాటలే కాదు నీ చేష్టలు కూడా అలానే ఉంటాయి. కానీ నేను నీలా కాదు చేసేది ముందే చెప్తా నీ కూతురు స్కూల్‌లో చదవడం నువ్వు ఈ హోటల్‌లో పని చేయడం నాకు ఇష్టం లేదే. నువ్వు దాన్ని తీసుకొని నా కంటికి కనిపించనంత దూరం పోయే వరకు ఇలా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటా. నువ్వెక్కడికి పోతే అక్కడికి వస్తా.
కార్తీక్: వీడు దీపతో ఏం మాట్లాడుతున్నాడు. వీడిని ఇలాగే వదిలేస్తే ఇక్కడ గొడవ చేసేలా ఉన్నాడు.
దీప: నర్శింహ నేను ఇక్కడ బతకడానికి పని చేసుకుంటున్నాను. గొడవలు వద్దు వెళ్లిపో.
కార్తీక్ కడియానికి ఫోన్ చేసి ఒ పని చేయ్ అని ఏదో చెప్తాడు. కడియం సరే అంటాడు. కార్తీక్ చెప్పినట్లు కడియం నర్శింహను రెచ్చగొడతాడు. నర్శింహ కడియాన్ని కొట్టడానికి చేయి ఎత్తగానే కడియం పడిపోయి హోటల్‌లో అందరికీ నర్శింహ దీపని ఏడిపిస్తున్నాడని అడిగినందుకు తనని కొట్టాడని చెప్తాడు. అందరూ నర్శింహ మీద ఫైర్ అవుతారు. నర్శింహ కస్టమర్లను కూడా తిడతాడు. అందరూ తిట్టడంతో నర్శింహ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక దీప ఏడుస్తుంది.
కడియం: దీపమ్మ వాడు ఇక మన జోలికి రాడమ్మ. వస్తే ఏం జరుగుతుందో వాడికి అర్థమైంది.
దీప: బాబాయ్ నా వల్ల మీ వ్యాపారం దెబ్బతింటుంది ఏమో. నేను వేరే చోట పని చేసుకుంటాను.
కడియం: వాడు మళ్లీ రాడమ్మ వస్తే నేను చూసుకుంటాను. ఉమ్మా సమోసా చేస్తా అన్నావ్ చేయమ్మా.
దీప: మనసు ఏం బాలేదు తర్వాత చేస్తానులే.
కార్తీక్: మనసు ఎందుకు బాలేదు.
దీప: మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు బాబు.
కార్తీక్: నీ కోసమే..
దీప: నాకోసం ఇక్కడికి మీరు రావొద్దు బాబు. ఇది నేను పని చేసుకునే చోటు. మీరు నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటే సుమిత్రమ్మకు చెప్పండి. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చారు బాబు అని అడిగితే పోటీలు గురించి చెప్తాడు. ఇక దీప కడియాన్ని నర్శింహ అలా ఎలా తోసేశాడు అని అడుగుతుంది. కడియం కవర్ చేసి వెళ్లిపోతాడు.
దీప: మనసులో.. బాబాయ్ నిజం చెప్పకపోయినా దీని వెనక మీరు ఉన్నారు అని నాకు అర్థమైంది బాబు.
కార్తీక్: మనసులో.. నా వల్ల నీకు చెడ్డ పేరు రాకూడదు దీప. అలా అని నీకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను ఏదో ఒక విధంగా కాపాడుతాను.
దీప ఇంటికి వచ్చి కూడా నర్శింహ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తన మీద కోపంతో శౌర్యకు తానే తన తండ్రి అని చెప్తే పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శౌర్య దీప దగ్గరకు వచ్చి రేపు స్కూల్‌కి వెళ్లను అని చెప్తుంది. ఎందుకని దీప అడిగితే ఈరోజు లానే బూచోడు వస్తాడని భయపడుతుంది. దీంతో దీప పాపకు ఏం కాదు ఎవరూ రారు అని చెప్తుంది. మరోసారి శౌర్య నాన్న గురించి అడుగుతుంది. ఎవర్నీ చూసి నువ్వు భయపడుతున్నావో వాడే నీ నాన్న అని దీప మనసులో అనుకుంటుంది. కూతురికి తిట్టి పంపేస్తుంది. దీంతో శౌర్య తల్లిని కోపంగా చూస్తుంది. ఇక దీప రెండో పెళ్లి చేసుకొని కూడా ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకుంటుంది.
మరోవైపు శ్రీధర్ కావేరితో మాట్లాడూ ఉంటాడు. కాంచన ఇంట్లో లేదు అని నీ దగ్గరకు రావాలి అనుకున్నా కానీ ఇంట్లో కార్తీక్ ఉన్నాడని అంటాడు. అప్పుడే కార్తీక్ రావడంతో కాల్ కట్ చేసేస్తాడు. శ్రీధర్ కంగారు చూసి కార్తక్ ఫోన్ తీసుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'నాగ పంచమి' సీరియల్ : ఘనాకు శక్తులు ఇవ్వాలని తల మీద చేయి వేసిన కరాళి.. అడ్డుకున్న మోక్ష!