'నాగ పంచమి' సీరియల్ : ఘనాకు శక్తులు ఇవ్వాలని తల మీద చేయి వేసిన కరాళి.. అడ్డుకున్న మోక్ష!
naga panchami serial today episode: పంచమి ఇద్దరు పిల్లల్లో నాగాంశతో పుట్టిన బిడ్డ ఎవరో తెలుసుకోవడనాకి కరాళి ఘనకు శక్తులు ప్రసాదించడానికి ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
naga panchami today episode : పంచమి పిల్లల్ని పడుకోమంటే నాన్న వచ్చే వరకు పడుకోమని మారాం చేస్తారు. ఇద్దరూ బెడ్ మీద ఆడుకుంటూ ఉంటారు. వైదేహి అక్కడికి వస్తుంది. పిల్లల్ని తీసుకొని కిందకి రమ్మని పంచమితో చెప్తుంది.
వైదేహి: నీ భయం నాకు తెలుసు పంచమి. ప్రతి తల్లికి ఈ భయం సహజమే కానీ నీకు కవల పిల్లలు కాబట్టి ఇంకాస్త ఎక్కువ భయం ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఇలా సరదాగా నవ్వుతూ ఆడుకుంటుంటే అందరి దృష్టి పిల్లల మీద పడుతుంటుంది. పిల్లల్ని తీసుకొని వస్తే దిష్టి తీస్తాను.
పంచమి పిల్లల్ని కిందకి తీసుకెళ్తే వైదేహి దిష్టి తీస్తుంది. దిష్టి తీయడం వల్ల పొగకు పిల్లలకు దగ్గు రావడంతో జ్వాల అక్కడికి వస్తుంది. ఇప్పుడు తనని వైదేహి చూస్తే తన కొడుకుని కూడా పిలుస్తుందని ఆమె చూడకుండా మీదకు వెళ్లిపోతుంది. ఇంతలో మోక్ష వస్తాడు. పిల్లలు పొగకు ఇబ్బంది పడటం చూస్తాడు. ఏంటీ ఈ చాదస్తం అని పిల్లల్ని తీసుకువెళ్లిపోతాడు.
మరోవైపు ఘన ఆడుకుంటూ ఉంటాడు. జ్వాల కంగారుగా వచ్చి డోర్ లాక్ వేసేస్తుంది. వరుణ్ ఏమైంది అని అడిగితే మీ అమ్మ చాదస్తం పనులు వల్ల పరుగున వచ్చానని చెప్తుంది. తన తల్లి అలా చేయదు అని ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు.
జ్వాల: పిల్లలకు దిష్టి తగిలింది అని కిందకి తీసుకెళ్లి మీ అమ్మ దిష్టి తీస్తుంది.
వరుణ్: అందులో ఏముంది మంచి పనే కదా.
జ్వాల: ఏంటి మంచిది ఉప్పు, ఎండుమిర్చి తీసుకెళ్లి నిప్పులో వేసి పొగపెట్టేసింది.
వరుణ్: మరీ విచిత్రంగా మాట్లాడకు జ్వాల మా అమ్మ కూడా మనిషే. నువ్వు ఒక్కడితోనే వేగలోకపోతున్నావ్. మా అమ్మ మా అందర్ని పెంచింది. మా అమ్మ పెంపకాన్ని తక్కువంచనా వేయకు.
జ్వాల: మీ అమ్మ మీద పుస్తకం రాసుకో. కానీ నా కొడుకు జోలికి వస్తే నేను ఒప్పుకోను. ముందు లైట్స్ ఆపి పడుకోండి మీ అమ్మ వస్తే వీడికి దిష్టి తీస్తుంది అంటూ ఘన దగ్గర బొమ్మలు తీసుకొంటుంది. దీంతో ఘన ఏడుస్తాడు.
మోక్ష: పిల్లలు తుమ్ముతూ ఉంటే.. పంచమి ఈ ఘాటు పోవాలి అంటే ఏం చేయాలి. పంచమి ఇద్దరు పిల్లలకు మందు పెడుతుంది. మోక్ష పంచమితో ఇంకెప్పుడూ ఇలా చేయకు.
పంచమి: చాలా బాగుందండి మీ ప్రేమ పిల్లలు అన్నాక అన్నీ వస్తాయి. దానికి తగ్గట్టు అన్నీ చూసుకోవాలి.
మోక్ష: ఏమో నా పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను పంచమి. మోక్ష, పంచమి ఇద్దరు పిల్లలని పడుకోపెడతారు.
కరాళి: శక్తులన్నీ ఆ పిల్లవాడికి దారపోసి వచ్చాను ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడో తెలీడం లేదు. ఒకసారి వెళ్లి చూసి రావాలి. కరాళి ఉన్న ఇంట్లో వాళ్లకి బయటకు వెళ్తున్నా రావడానికి టైం పడుతుంది. ఎదురు చూడొద్దని అంటుంది. ఇక ఆ మహిళ తన భర్తకు కరాళి మీద తనకు అనుమానం వస్తుందని అంటుంది. అర్థరాత్రి కూడా పూజలు చేస్తుందని అంటుంది. అయితే ఆయన ఆమెకు నిజంగా శక్తులు వస్తే మనకే మంచిది మన కూతురికి కంటి చూపు వస్తుందని అంటాడు. కరాళి మారు వేషంలో మోక్ష ఇంటికి వెళ్తుంది. ఇక ఘన అక్కడ ఆడుకుంటూ ఉంటాడు.
కరాళి: ఈరోజు ఆ పిల్లాడికి శక్తులన్నీ దారపోయాలి. ఎవరు నాగాంశతో పుట్టారో ఆ పిల్లవాడు కనిపెట్టాలి. కరాళి దగ్గరకు ఘన వస్తాడు. ఘన తల మీద కరాళి చేయి వేసి శక్తులను ప్రసాదించడానికి మంత్రాలు చదువుతూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి వచ్చిన మోక్ష అది చూసి పరుగున వచ్చి కరాళి చేతిని ఘన తల మీద నుంచి తీసేస్తాడు.
మోక్ష: ఎవరు నువ్వు.. వదినా.. వదినా.. అని పని పిలిస్తే కరాళి వెళ్లిపోతుంటుంది. ఆగు. ఎందుకు పిల్లాడి తల మీద చేయి పెట్టావు.
కరాళి: అమ్మవారి ఉపాసకురాలిని మేం దీవిస్తే పిల్లలకు మంచి జరుగుతుంది.
మోక్ష: మీ దీవెనలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. ఇంకెప్పుడూ పిల్లల్ని ఇలా చేయొద్దు.
జ్వాల: మోక్ష ఏమైంది.
మోక్ష: ఏంటి వదినా పిల్లాడిని ఇలా వదిలేస్తే ఎలా ఈవిడ ఎవరో ఘన తల మీద చేయి పెట్టి మంత్రాలు చదువుతుంది. ఎవరైనా ముష్టికి వస్తే ఎంతో కొంత ఇచ్చి పంపాలి.
జ్వాల: ఏయ్ ఇంకెప్పుడూ ఇటు కనిపించకు వెళ్లు. అసలు నన్ను వదిలి ఎందుకు వెళ్లావురా.. రా లోపలికి..
పిల్లలకు వైదేహి తినిపిస్తూ పరుగులు తీస్తుంది. ఇక జ్వాల ఘనకు తినిపిస్తుంటుంది. చిత్ర కోపంతో చూస్తూ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.