అన్వేషించండి

Krishna Mukunda Murari December 9th Episode కృష్ణతో తాడోపేడో తేల్చుకోవడానికి వెళ్లిన మురారి.. ముకుంద పని ఇక అంతే!

Krishna Mukunda Murari Today Episode కృష్ణ భర్త గురించి నేరుగా తనకే అడగడానికి మురారి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Krishna Serial Mukunda Murari Today Episode

కృష్ణ డల్‌గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే తన పిన్ని అక్కడికి వస్తుంది. ఇలా ఎంత కాలం బాధపడతావని అడిగి రెండు రోజులు నువ్వు సైలెంట్‌గా ఉంటే నేనే మొత్తం తేల్చేస్తా అని అంటుంది. దీంతో కృష్ణ ఏం కాదు నేను చూసుకుంటా అని తన పిన్నికి సర్ధిచెప్తుంది. ఇక శకుంతల కృష్ణ తండ్రి పెద్ద పెద్ద చదువులు చదివించడం వల్లే ఇదంతా జరిగింది అని తన బావని తిడుతుంది. కృష్ణని తిడుతుంది. ఇంతలో రేవతి అక్కడికి వచ్చి ఏంటి వదినా నా కోడల్ని తిడుతున్నావ్ అని అంటుంది. ఇక శకుంతల రేవతి మీద కూడా కేకలు వేస్తుంది. కృష్ణ కూరగాయలు తీసుకురా అంటూ తన పిన్నిని అక్కడ నుంచి పంపేస్తుంది.

కృష్ణ: సారీ అత్తయ్య మా చిన్నమ్మకు ఏం తెలీదు
రేవతి: లేదు కృష్ణ శకుంతల వదిన బాధలో న్యాయం ఉంది. కానీ ఏం చేయలేని స్థితిలో ఆ భగవంతుడు నన్ను పడేశాడు. ఇంకా మీ పెద్దత్తయ్య చెప్పిన విషయం మీ పిన్నికి తెలిస్తే ఏం అంటుందో. చెప్తే నువ్వు కూడా బాధపడతావు కృష్ణ. కానీ నా కొడుకు పడే బాధ చూడలేక నీతో చెప్పాలి అని వచ్చాను.
కృష్ణ: టెన్షన్ పెట్టకుండా.. మీరు టెన్షన్ పడకుండా పెద్దత్తయ్య ఏం అన్నారో చెప్పండి
రేవతి: నువ్వు దీపాలు పెడతాను అని వెళ్లావు కదా. నువ్వు వెళ్లాక మురారి కోనేటిలో దీపాలు ఎందుకు పెడతారు అని అడిగాడు. ఆ మాట అనడంతో అక్కయ్య పెళ్లయిన వారు తమ భర్తలకు కోసం అలా చేస్తారు కృష్ణ అందుకే వెళ్లింది అని చెప్పింది. ఇక మీ పెద్దత్తయ్య ఆ మాట అన్నప్పటి నుంచి మురారి నీకు పెళ్లయింది అన్న భావనతో నిలకడగా ఉండలేకపోతున్నాడు. ఏదో పోగొట్టుకున్న వాడిలా ఆలోచిస్తూనే ఉన్నాడు. 
కృష్ణ: పెద్దత్తయ్య చాలా తెలివిగలది అనుకున్నను కానీ అమాయకురాలు అత్తయ్య.. 
రేవతి: అదేంటి అంత మాట అన్నావ్. నీకు పెళ్లి అయిందని తెలిస్తే వాడు నీకు దూరంగా ఉంటాడు అనే ముందరి కాళ్లకు బంధం వేసింది మా అక్క
కృష్ణ: అలా అనుకునే ఆ మాట అన్నారు. కానీ మీ అబ్బాయి అవునా అని ఏమీ పట్టనట్లు కూర్చొలేదు కదా. మీరే అన్నారు కదా కుదురుగా ఉండడం లేదు అని.. పెద్దత్తయ్య ఏసీపీ సార్‌కి ఆ మాట చెప్పడం వల్ల గతం గుర్తురావడానికి సాయం చేశారు అందుకే అమాయకురాలు అని అన్నాను. ఇప్పుడు నాకు పెళ్లి అయింది అని తెలిసి ఆ భర్త ఎవరు అని తీవ్రంగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనల్లో ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏసీపీ సార్ గతం గుర్తుతెచ్చుకోవడానికి ఓ స్ట్రాంగ్ పాయింట్‌ను పెద్దత్తయ్య ఇచ్చారు. చూస్తూ ఉండండి రెండు మూడు రోజుల్లో ఏసీపీ సార్‌కి గతం గుర్తొచ్చేస్తుంది. 

మరోవైపు మురారి కృష్ణని పిలుస్తాడు. వేణి గారి భర్త ఎవరు అని అడుగుతాడు. ఇంతలో మధుని తన తండ్రి పిలిస్తే వెళ్లిపోతాడు. ఇక మధు కృష్ణ భర్త నువ్వే అని మురారితో చెప్పలేకపోతున్నా అని బాధపడి తాగుతాడు. ఇక వాళ్ల తండ్రి అక్కడికి వస్తాడు. ఆయనతో మురారి గురించి చెప్పుకొని బాధ పడతాడు. ఇక మధు తల్లి సుమలత వచ్చి తండ్రీ కొడుకుల్ని తిట్టి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. అందరూ భోజనాలకు రెడీ అవుతారు. గౌతమ్ మురారిని పిలవడానికి వెళ్తాడు. తాగిన మైకంలో ఉన్న మధు నిజం చెప్పేయాలి అనుకుంటాడు. 

ఇక ముకుంద కూడా భోజనానికి వస్తుంది. మురారి కూడా వస్తే ఏంటి డల్‌గా ఉన్నాడని రేవతి అనుకుంటుంది. ముకుంద మురారికి వడ్డిస్తుంది. వద్దు అన్నా వడ్డిస్తుండడంతో మురారి ముకుందపై సీరియస్ అవుతాడు. దీంతో ముకుంద డల్ అయిపోతుంది. 

రేవతి: ప్లేట్‌లో భోజనం పెట్టుకొని ఏం ఆలోచిస్తున్నావ్ మురారి
మురారి: నీ గురించే
రేవతి: నా గురించి ఆలోచించడానికి ఏముందిరా.. ఏమైంది నాకు 
ముకుంద: మనసులో.. ఇప్పుడు రేవతి అత్తయ్యకి కృష్ణ భర్త ఎవరు అని అడుగుతాడేమో.. అడిగితే ఈవిడ గారు చెప్తేస్తే
మురారి: అమ్మ నేను ఒకటి అడుగుతాను. అబద్ధం చెప్పకుండా నిజం చెప్తావా.. 
రేవతి: నేను ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా
మురారి: ఏమో గతం మర్చిపోయినా వెర్రివెధవను కదా నాకు గుర్తులేకపోవచ్చు
రేవతి: నాన్న ఏంటిరా ఆమాటలు ఇప్పుడు నేను ఏం అన్నాను. 
మురారి: అదే నా బాధ కూడా నేను ఏం అడిగినా ఏమీ సమాధానం చెప్పడం లేదు. 
రేవతి: సరే అడుగు నిజమే చెప్తాను
మురారి: నిజమే చెప్తావా.. వేణి గారి భర్త ఎవరు.. అతని పేరు ఏంటి.. అడిగేది నిన్నే అమ్మ దయచేసి తెలిసినా తెలీదు అని మాత్రం చెప్పకు. 
రేవతి: భగవంతుడా ఎవరో కాదు నువ్వే అని చెప్పలేని పరిస్థితి నాది. చెప్తే అక్క నానా రచ్చ చేస్తుంది. 
మురారి: భోజనం ప్లేటు కిందకి విసిరికొట్టి.. చెప్పరు నువ్వే కాదు ఇక్కడ ఎవరూ నిజం చెప్పరు. 
మధు: అసలు మా అందర్ని అడగడం ఎందుకు బ్రో. నీకు వేణి గారు తెలీదా ఏంటి. నువ్వే వెళ్లి నేరుగా ఆవిడని అడుగు. ముకుంద ఏమంటావ్. 
మురారి: నేనే వెళ్లి అడుగుతాను. ఇప్పుడే వెళ్లి అడుగుతాను
ముకుంద: మురారి ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్లి అడగాల్సిన అవసరం ఏంటి. ఆవిడ భర్తతో నీకు ఏంటి పని. నిజంగా ఉండుంటే ఆవిడతోనే ఉంటాడు కదా. లేడు అంటే ఏంటి అర్థం ఏవో మనస్పర్థలు ఉండొచ్చు. నువ్వు వెళ్లి అడిగితే తను హర్ట్ అవ్వొచ్చు.. ఏమంటారు అత్తయ్య
మురారి: ఎవరో ఏదో అనుకుంటారు అని నేను ఆగలేను. మీరంతా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. వేణి గారు ఏమనుకున్నా సరే నేను అడుగుతా. 
ముకుంద: మురారి నేను వస్తా
మురారి: అవసరం లేదు.. ఎవ్వరూ అవసరం లేదు. ఈ విషయంలో నేను ఎవరినీ నమ్మలేను. ఎవరూ రావొద్దు
మధు: ఇది కదా కావాల్సింది ఎందుకు ఈ ముసుగులో గుద్దులాటలు. మీ అందరికీ ఎలా ఉందో తెలీదు కానీ నాకు అయితే నేను తీసిన సినిమా వంద రోజులు ఆడినంత సంతోషంగా ఉంది. 
భగవంతుడా కృష్ణ చెప్పకపోతే బాగున్ను అని ముకుంద అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Sankranthiki vasthunnam: వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
Viral News: బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Sankranthiki vasthunnam: వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
Viral News: బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Sri Reddy News: ఏపీలో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు- వైసీపీ హయాంలో చేసిన పోస్టులు, కామెంట్లతో చిక్కులు!
ఏపీలో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు- వైసీపీ హయాంలో చేసిన పోస్టులు, కామెంట్లతో చిక్కులు!
Maruti Brezza vs Tata Nexon: మారుతి బ్రెజ్జా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ఏది బెస్ట్ కారు?
మారుతి బ్రెజ్జా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ఏది బెస్ట్ కారు?
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
Embed widget