Krishna Mukunda Murari December 4th Episode - 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్: మురారితో తన మనసులో మాట చెప్పేసిన కృష్ణ!
Krishna Mukunda Murari Today Episode - మురారితో కృష్ణ తన మనసులో మాటలు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Krishna Mukunda Murari Serial Today Episode
భవాని: రేవతి.. ఆ శుభలేఖల అతను వచ్చాడా..
మధు: వచ్చాడు పెద్ద పెద్దమ్మ.. కార్డ్స్ ఇచ్చి సెలక్ట్ చేయమన్నాడు. పాపం చాలా సేపు ఎదురు చూశాడు
భవాని: అంటే ఏంటి నేను రావడం లేట్ చేశా అంటావా.. అతన్ని వెంటనే రమ్మను.
ఫోన్ చేయ్.. గౌతమ్ నువ్వు మధు కలిసి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకోండి. రేవతి నువ్వు మనకి కావాల్సిన వారికి కబురు చెయ్యు. ప్రసాద్, సుమలతను కూడా రమ్మను. ఇంతకీ అలేఖ్యకు ఎలా ఉంది.
రేవతి: అలేఖ్యకు ఇంకా తగ్గలేదు అక్కా. రెస్ట్ తీసుకోమన్నారు
భవాని: ఇంట్లో శుభకార్యం ఉంది అంటే అందరికీ ఇలా అవుతుంది.
మరోవైపు శుభలేఖల వ్యక్తి వచ్చి శుభలేఖలు తీసుకొస్తాడు. అతనితో భవాని రేపు ఉదయానికి కార్డులు ఉండాలి అని చెప్తుంది. ఇక ముకుంద ఓ కార్డు సెలక్ట్ చేసి బాగుంది అంటుంది. భవాని రేవతికి ఆ కార్డు బాగుందా లేదా అని అడుగుతుంది.
నందూ: ఏంటి ముకుంద మీ ఇంట్లో భోజనం చేశారా
ముకుంద: లేదు నందూ రెస్టారెంట్‌లో చేశాం
మధు: ఏదో జరిగింది
శకుంతల: మనసులో.. కిట్టమ్మ ఇంకా రాలేదు ఏంటి ఎక్కడికి వెళ్లింది. (ఇంతలో కృష్ణ రావడం చూసి..) ఏంటి బిడ్డ చాలా సంతోషంగా ఉంది. నువ్వు వెళ్లిన అప్పటి నుంచి మీ అత్తయ్య అడుగుతుంది. బిడ్డా ఇంతకీ చాలా సంతోషంగా ఉన్నావ్ కారణం చెప్పు నేను సంతోషిస్తా.
కృష్ణ: ఏం లేదు చిన్నమ్మ మీ అల్లుడికి గతం గుర్తొచ్చేస్తుంది. తప్పకుండా ఆ దేవుడు మన వైపే ఉన్నాడు. పెళ్లి లోపు ఏసీపీ సార్‌కి గతం గుర్తొచ్చేస్తుంది అని నా నమ్మకం. సరే నేను అత్తయ్య దగ్గరకు వెళ్లి వస్తా.
రేవతి: మనసులో... ఈ కృష్ణ ఎక్కడకి వెళ్లింది. అక్కయ్య శుభలేఖలు వరకు వెళ్లింది. (ఇంతలో కృష్ణ వస్తుంది. రేవతిని బయటకు తీసుకెళ్తుంది.)
కృష్ణ: ఏసీపీ సార్‌కి గతం గుర్తొస్తుంది అత్తయ్య.
రేవతి: అవునా ఎలా .. ఇందాక మామూలుగానే బయట నుంచి వచ్చాడు. ఒక్కడే తన రూంలోకి వెళ్లి పోయాడు. నాతో కూడా ఏం మాట్లాడలేదు.
కృష్ణ: ఒక్కడే రూంలోకి ఎందుకు వెళ్లాడంటే.. (అంటూ రెస్టారెంట్‌లో జరిగిన ఘటన గురించి చెప్తుంది) ఒకరోజు నాకు హెల్ప్ చేశారని ఏసీపీ సార్‌ని రెస్టారెంట్‌కి తీసుకెళ్లా. పార్టీ కూడా ఇచ్చాను గుర్తుందా.. అప్పుడు సార్‌కి నేను వడ్డించాను. అది గుర్తొచ్చి ఏసీపీ సార్ అలా రియాక్ట్ అయ్యారు. మొన్నటికి మొన్న ఎవరో నన్ను సార్ అన్నారు. ఓ అమ్మాయి అన్నది అని ఏసీసీ సార్ అన్నారు.
రేవతి: అంటే ఏసీపీ సార్.. అబ్బాయి అంటే ఏబీసీడీల అబ్బాయి. అంతేనా
కృష్ణ: అబ్బబ్బా లవ్ యూ అత్తయ్య కరెక్ట్‌గా కనెక్ట్ అయ్యారు. మీరు చెప్పండి అత్తయ్య ఏసీపీ సార్‌కి గతం గుర్తొస్తుంది కదా..సో పెద్దత్తయ్య నా భర్తను నా నుంచి దూరం చేయాలని ఎన్ని ప్లాన్‌లు వేయాలని చూసినా వర్క్‌అవుట్ కాదని అనిపిస్తుంది. ఏంటి అత్తయ్య ఆలోచిస్తున్నారు.
రేవతి: ఇందాక వాళ్లు శ్రీనివాస్ అన్నయ్య ఇంటికి వెళ్లినప్పుడు హ్యాపీగా ఉన్నారు. తీరా వచ్చేటప్పుడు ముఖం మాడ్చుకొని వచ్చారు.
కృష్ణ: బాబాయ్ వాళ్ల ఇంటికి వాళ్ల కంటే నేనే ముందు వెళ్లాను. అంటూ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన సీన్ చెప్తుంది.
భవాని: ( రెస్టారెంట్‌లో జరిగిన సంఘటన ఆలోచిస్తూ ) మురారికి గతం గుర్తొస్తుందా.. దీనంతటికీ కారణం ఆ కృష్ణ. కృష్ణను పంపించేస్తే ఎందుకు పంపించారు అని మురారి అడుగుతాడని ఏం చేయలేకపోతున్నా.. తొందరగా ఈ పెళ్లి చేసేయాలి..
మురారి: పెద్దమ్మ
భవాని: ఇప్పుడు వచ్చాడు ఏంటి మళ్లీ ఏమైనా గుర్తొచ్చిందా..
మురారి: పెద్దమ్మ నేను జీవితంలో కూడా ఎక్కడ ఉన్నానో తెలీని స్థితిలో ఉన్నాను. మీరందరూ చాలా మంచి వాళ్లే.. అసలు నేను ఇప్పుడున్న పరిస్థితిలో మీ అందరికీ పరాయి వాడినే కదా.
భవాని: మురారి ఏమైంది నాన్న నీకు నువ్వు పరాయి వాడు ఎలా అవుతావు. ఏంటి ఈ పిచ్చి మాటలు..
మురారి: పిచ్చి మాటలు కాదు పెద్దమ్మ ఉన్న మాటలే. ఎవరో కుక్కని వీధిలో పడేస్తే ఇంకెవ్వరో పెంచుకోవడానికి తీసుకెళ్లినట్లు ఎవరో నన్ను హాస్పిటల్‌లో పడేస్తే మీరు తెచ్చి పెంచుతున్నట్లు అనిపిస్తోంది.
భవాని: మురారి ఆర్ యూ ఆల్‌రైట్
మురారి: నో ఐయామ్ నాట్ ఫైన్.. ఏమీ తెలియని స్థితిలో ఉన్నా. మీరందరూ ఉన్నారు కరెక్టే. మీ అందరికంటే ఎక్కువగా ఒక్కరినే బాగా నమ్మాలి అనిపిస్తోంది. అది ఎవరో తెలుసా వేణి గారు.
భవాని: మనసులో..ఇప్పుడు మురారి పెళ్లి వద్దు అని చెప్పడానికి వచ్చాడా
మురారి: నేను ఎవరు ఇంతకు ముందు ఏం చేసేవాడిని.
భవాని: (మనసులో.. భగవంతుడా మురారి ఏసీపీ అనే నిజం చెప్తే గతం గుర్తొచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక అబద్ధం చెప్పాలి.) మన బిజినెస్‌లు చూసుకునే వాడివి చాలా బిజీగా ఉండేవాడివి... ఇప్పుడు ఆ బిజినెస్‌లను మీ నాన్న చూసుకుంటున్నారు. నీకు ఇలా అయిందని తెలిసినా ఆయన ఇక్కడికి రాలేనంత బిజీగా ఉన్నారు. చూడు మురారి నువ్వు రెస్టారెంట్‌లో రియాక్ట్ అయిన విషయం నేను డాక్టర్‌తో మాట్లాడాను
మురారి: సంతోషంతో.. వేణిగారితోనా
భవాని: కాదు వేణి కన్నా పెద్ద డాక్టర్‌తో మాట్లాడా. అసలు గతం గుర్తురావడానికి దీనికి ఏం సంబంధం లేదు నాన్న. అదే చెప్పారు డాక్టర్. అప్పుడప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు అంట. ఎప్పుడైతే ఇలాంటి కలలు రావడం ఆగిపోతాయో అప్పుడే గతం గుర్తు రావడం ప్రారంభమవుతుంది అంట. చూడు మురారి నిజాలు అని ఎవరు చెప్పినా నమ్మకు. ఎందుకంటే నువ్వు చాలా డిస్టర్బ్ అయిపోతావు. సరేనా. పెళ్లి జరిగితే అన్నీ సెట్ అయిపోతాయి వెళ్లి రెస్ట్ తీసుకో నాన్న.
మురారి: (కృష్ణ దగ్గరకు వచ్చి) మీకు ఒక విషయం అడుగుతాను తప్పుగా అనుకోకండి.. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఓకే కానీ నేను ఇక్కడికి రానప్పుడు మీకు నేను గుర్తొస్తానా.. అసలు నన్ను తలచుకుంటారా.. మీ ఆలోచనల్లో నేను ఉంటానా.. అంటే నేను ఇలా మీ దగ్గరకు రావడం తప్పుగా అనుకోవడం లేదు కదా
కృష్ణ: మనసులో.. మనద్దరం భార్యాభర్తలం ఏసీపీ సార్. ఛా మనకి ఎలాంటి దుస్థితి ఏర్పడింది చూశారా.. ఏ భార్యకు ఇలాంటి పరిస్థితి రాకూడదు దేవుడా..
మురారి: సారీ అండీ తప్పుగా మాట్లాడాను. ఇక నేను వెళ్తా
కృష్ణ: సార్ ఏంటి సార్ ఎందుకు వెళ్తున్నారు. ఉండండి
మురారి: ఎందుకు వేణి గారు నేను ఎక్కడ బాధ పడతానో అని ఇలా మాట్లాడుతున్నారు కానీ లోపల బాధ పడుతున్నారని మీ మొహం చెప్తుంది. వస్తాను. కానీ ఒకటి మాత్రం నిజం. నాకు మాత్రం మీరు అనుక్షణం గుర్తొస్తుంటారు. నేను అక్కడ ఉన్నా నా మనసంతా ఇక్కడే ఉంది. ఇలా చెప్పడం కూడా తప్పే. తప్పే..
కృష్ణ: సార్ ఉండండి.. సార్ తప్పేం లేదు సార్.. అరే నేను మిమ్మల్ని మర్చిపోవడం ఏంటి. మిమల్ని మర్చిపోతే నా జీవితానికే అర్థం లేదు.. నా జీవితాన్ని మార్చింది మీరే.. ఎక్కడో అడవిలో గడ్డి పువ్వుగా ఉన్న నన్ను మంచి పువ్వుగా మార్చింది మీరే. నన్ను డాక్టర్‌ని చేశారు. సమాజంలో నాకు ఓ మంచి గుర్తింపు తెచ్చారు. ఇంత చేసిన మీరే నా దేవుడు. ఇందాక ఎందుకు నేను అలా ఉన్నాను అంటే సంతోషంలో నాకు మాటలు రావు సార్. అందుకే అందరూ నన్ను తింగరి అని పిలుస్తారు.
మురారి: ఏంటి తింగరి నా.. ఈ మాట నేను ఎప్పుడో బాగా పిలిచినట్లు అనిపిస్తుంది.
కృష్ణ: మనసులో.. సూపర్ సార్ మీరు గతానికి బాగా కనెక్ట్ అవుతున్నారు.
మరో వైపు భవాని బంధువులకు ఫోన్ చేసి పెళ్లికి పిలుస్తుంది. రేపటి నుంచి పెళ్లి పనులు ప్రారంభించాలి అని అందరకీ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.