Krishna Mukunda Murari Serial Today December 23rd Episode - ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: కృష్ణ, మురారిలు దేవ్ మాయలో పడినట్లేనా!
Krishna Mukunda Murari Today Episode కృష్ణ, మురారీలను కలిసిన దేవ్ తన మాటలతో వాళ్లని ఆయన వైపునకు తిప్పుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Telugu Serial Today Episode:
దేవ్ ఇంటికి రావడంతో ముకుంద టెన్షన్ పడుతుంది. రేవతి వచ్చి ముకుందతో ఎవరు ఈ అబ్బాయి ఇతని గురించి నాకు ఎప్పడూ చెప్పలేదని ముకుందని అడుగుతుంది. దానికి దేవ్ తనకి మేమంటే పెద్ద ఇష్టం ఉండదు లెండీ. మమల్ని పరాయి వాళ్లలా చూస్తుందని అంటాడు. అప్పుడు ముకుంద మనసులో.. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. ఇక రేవతి కూడా మనసులో నీలా మీ నాన్నలా ముకుంద ఉంటే మాకు ఇన్ని తిప్పలు ఉండేవి కాదు కదా అనుకుంటుంది.
ఇక ఇంట్లో వాళ్లందరినీ పిలిచిన ముకుంద తన అన్న దేవ్‌ని వాళ్లకి పరిచయం చేస్తుంది. ఇక రేవతి భోజనం చేసి వెళ్లమని చెప్తుంది. దానికి భవాని అంటే తిని వెళ్లి పోమని చెప్తున్నావా అని అడుగుతుంది. దానికి రేవతి ఈ అబ్బాయి వాలకం చూస్తుంటే ఇప్పుడే వెళ్లిపోయేలా ఉన్నాడు అందుకే అలా అన్నాను అంటుంది. ఇక దేవ్ అయితే మీ అందరిని ఏడిపించి నా చెల్లి పెళ్లి చేసిన వరకు ఇక్కడి నుంచి వెళ్లను అని మనసులో అనుకుంటాడు. ఇక మురారి కృష్ణతో రొమాన్స్ చేయాలి అని చూస్తే కృష్ణ అడ్డుకుంటుంది. తర్వాత మురారి అలిగిపోతాడు. దీంతో అతన్ని కూల్ చేస్తుంది కృష్ణ.
కృష్ణ: చూడండి ఏసీపీ సార్ ఈ కేసును మీరు తప్పకుండా ఛేదిస్తారు. ఆ తర్వాత మనం..
మురారి: చెప్పావు కదా మీ ఊరు వెళ్తాం అని.
కృష్ణ: ప్లాన్ మార్చేశా ఏసీపీ సార్.. ముందు మనం హనీమూన్‌కి వెళ్దాం.. మనదేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అన్ని చుట్టి వచ్చేద్దాం. అంటూ మాట్లాడుకుంటారు. ఇంతలో ముకుంద, దేవ్ అక్కడికి వస్తారు.
దేవ్: చూడు నేను ఏం మాట్లాడినా నీ మంచి కోసమే. నేను నీ మీద రివర్స్ మాట్లాడినా నా మంచి కోసమే అని నవ్వుతూ ఉండు. నా మీద రియాక్ట్ అవ్వకు.
ముకుంద: దేవ్ ఇవన్నీ నాకు నచ్చవు ఏంటీ ఈ కుట్రలు, కుతంత్రాలు..
దేవ్: తప్పదు ముకుంద నీ పెళ్లి ముఖ్యం అదొక్కటే ఆలోచించు. పద.. మనసులో.. వీళ్ల మధ్య దూరం పెంచడం చాలా కష్టంలా ఉందే. హాయ్..
ముకుంద: మురారి మా అన్నయ్య దేవ్.. దేవ్ మురారి ఏసీపీ..
దేవ్: నేను మీ ఇద్దరితో మాట్లాడాలి అని వచ్చాను. ఏపీసీ సార్ నా చెల్లి పిచ్చి ప్రేమతో నిన్ను విసిగిస్తుంది క్షమించండి. అవును ఏసీపీ సార్ మా చెల్లి అంతా నాకు చెప్పింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీరిద్దరి ఇలానే ఉన్నారు అంటే మీ బంధం దైవ నిర్ణయం అని నాకు అర్థమవుతుంది. నాకు ముకుంద ఎంతో కృష్ణ కూడా నాకు అంతే..
మురారి: మీరు ఏమీ అనుకోకపోతే ఏసీపీ సార్ అని నన్ను పిలవకండి. నన్ను అలా పిలిచేది ఒక్క నా భార్య కృష్ణే. మీరు నన్ను మురారి అని పిలవండి.
దేవ్: చూశావా ఇంత మంచి జంటనా నువ్వు విడదీయాలి అని చూసేది. కరెక్ట్ కాదు.
ముకుంద: ముందు ఈ కేసు వెనుక ఎవరు ఉన్నారో తెలిస్తే అప్పుడు కూడా ఇదే మాట అను.
దేవ్: ఏం అనుకోకు బావ.. కృష్ణ కూడా నాకు చెల్లి లాంటిదే కదా అందుకే.. మా చెల్లిని నేను సెట్ చేస్తాను.
మురారి: ఇందాక మీరు వస్తే ముకుందని పెళ్లి చేసుకో అంటారు అనుకున్నా.
దేవ్: అలా అనుకోవడంలో తప్పు లేదులే ఎందుకంటే ముకుంద నేను తోడపుట్టాం కదా. బావ వచ్చే శుక్రవారం లోపే కేసు ఫైనల్ చేయకపోతే ముకుందతోనే పెళ్లి చేస్తా అని మీ పెద్దమ్మ అన్నారు అంట కదా. చూడు బావ నీకు నేను సాయం చేస్తాను. మీ ఇద్దరు కలిసి ఉండటానికి నేను ఏమైనా చేస్తాను. మీరు వాడిని పట్టుకోవడానికి ఎలా వెళ్తున్నారో మీరు చెప్పండి మిగతాది నేను చూసుకుంటా.
మురారి: అప్పుడే నేరస్తులను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
కృష్ణ: మనకి టైం కూడా లేదు అన్నయ్య.
దేవ్: అమ్మా నువ్వు టెన్షన్ పడకు. నాది ఓ చిన్న రిక్వెస్ట్. నేను మీతో చేతులు కలిపాను అని మాత్రం ముకుందకు చెప్పొద్దు. ముకుందను వ్యతిరేకిస్తున్నాను అని మాత్రమే అనుకోవాలి. నేను ఇక వెళ్తాను బావ. మనసులో.. పడిపోయారు. వచ్చే శుక్రవారం కాదు కదా వచ్చే సంవత్సరం కూడా ఆ శేఖరే ఈ దేవ్ అని కనిపెట్టలేరు.
ముకుంద: రేవతి ముకుందని పిలిస్తే.. అసలే నేను చాలా టెన్షన్‌లో ఉన్నాను నీతులు మాత్రం చెప్పకండి అత్తయ్య.
రేవతి: లేదు ముకుంద నేను నీ గురించి చెప్పడానికే ఆగాను. మా అక్క రాత్రి పగలు నీగురించే ఆలోచిస్తుంది. గతం గుర్తుకురాదు. ఆదర్శ తిరిగి రాడు అన్న నమ్మకంతో మీ పెళ్లి చేయాలి అనుకుంది. కానీ హఠాత్తుగా పరిస్థితులు మారాయి. ఇప్పుడు అక్క చేతిలో ఏం ఉందో చెప్పు.
ముకుంద: అత్తయ్య చేతిలో ఏం లేదో చెప్పండి అత్తయ్య పవర్ ఉంది అది చాలదా. మనిషిని ఆకాశానికి ఎత్తాలి అన్నా పాతాళానికి తొక్కాలి అన్నా పవర్‌కి మించి ఏం ఉంటుంది చెప్పండి.
రేవతి: ధర్మంగా న్యాయంగా ఆలోచించు మా అక్క నువ్వు అనుకున్నట్లు అధర్మంగా ఏదీ చేయదమ్మా. అనవసరంగా నువ్వు పంతానికి పోయి మా అక్కను ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి లేదు అనిపిస్తుంది. అవును ముకుంద పోని అక్క స్థానంలో నువ్వు ఉండి ఇదే పరిస్థితిలో నువ్వు ఉంటే ఏం చేస్తావో ఆలోచించు.
ముకుంద: అత్తయ్య స్థానంలో నేను ఉండక్కర్లేదు. నాస్థానంలో నేను ఉండి ఒక మాట చెప్తాను. ఏం అనుకోరు కదా. మురారి లేకుండా కృష్ణ బతకగలదు. క్యాంపు అని చెప్పి తన ఊరు వెళ్తుంటే మీరే వెనక్కి తీసుకొచ్చారు.
రేవతి: అప్పుడు కృష్ణ ఇష్టంగా వెళ్లలేదు తప్పక వెళ్లింది.
ముకుంద: ఇష్టంగానో కష్టంగానో వెళ్లింది కదా. కానీ నేను మురారి వదిలి ఒక్క క్షణం ఉండలేను. బతకలేను. బతకనివ్వను కూడా. ఇక నిర్ణయం లేదు. సిగ్గు విడిచి చెప్తున్నాను మురారితో పాటు కృష్ణ ఉన్నా నాకు ఏం ప్రాబ్లమ్ లేదు. నాకు మురారి కావాలి అంతే.
ఇక ఉల్లి పాయలు కోస్తుంటుంది కృష్ణ. ఆ నెపంతో ఏసీపీ సార్‌ని ఒక ఆట ఆడుకుంటాను అనుకొని వాటిపైన పుస్తకాలు కప్పి ఏడుస్తున్నట్లు నటిస్తుంది. కంగారుగా వచ్చిన మురారి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు.
కృష్ణ: మీరు ఒక గంట క్రితం ముకుందకు ఐలవ్‌యూ చెప్పారంట కదా..
మురారి: నేను ముకుందకు ఐలవ్‌యూ చెప్పానా.. అయినా నువ్వు ఇలా నమ్మేయడమేనా.. అంటూ అక్కడ ఉల్లిపాయలు చూసేస్తాడు.( కృష్ణ దొరికిపోయాను అనుకొని నవ్వుకుంటాయి. ) అంటే ఉల్లిపాయలు చూస్తే కళ్లలో నీళ్లు వచ్చాయి. నేను రావడం చూసి ఈ వంకతో నన్ను ఆటపట్టిస్తున్నావ్ కదూ. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ అక్కర్లేదు నువ్వు తప్ప. గతం మర్చిపోయినా నిన్ను మర్చిపోయి నీ వెంటే తిరిగాను. అన్నీ గుర్తొచ్చాక నిన్నెలా మర్చిపోతాను చెప్పు.
కృష్ణ: ఊరికే ఆటపట్టించాలి అని అలా చేశాను. కానీ మీరు ముకుందకు ఐలవ్‌యూ చెప్పారంట అన్నప్పుడు మీ ముఖం చూడాలి పాపం అనిపించింది. ఇక తన ఇంటికి ఎవరో భోజనానికి వస్తారు అని అది ఎవరో కనిపెట్టమని కృష్ణ మురారితో అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.