Krishna Mukunda Murari July 17th: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్: భవానీ దేవి అవతారం ఎత్తిన కృష్ణ - బిత్తరపోయిన మురారీ ఫ్యామిలీ
కృష్ణ కూడా మురారీని ప్రేమిస్తుందని తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ పెద్దమ్మ దగ్గర ఏం చెప్పిందని మురారీ ఆలోచిస్తుంటాడు. కృష్ణ నా గురించి పడే తాపత్రయం చూస్తుంటే నేనంటే ఇష్టం ఉందని అర్థం అవుతుంది. కానీ తనని డాక్టర్ ని చేశానని కృతజ్ఞత ఉందో అర్థం కావడం లేదని ఆలోచిస్తుంది. కృష్ణ రాగానే ఏమైంది పెద్దమ్మ ఒప్పుకుందా అని అడుగుతాడు. మీరు ఇంక హ్యాపీగా ఉండవచ్చు అత్తయ్య ఒప్పుకున్నారని అంటుంది. అంటే నేను రిజైన్ చేయడానికి అత్తయ్య ఒప్పుకుందా అంటాడు. మీరు ఇంట్లో ఉండండి అని కృష్ణ చెప్తుంది. ఆ మాటకి మురారీ డల్ గా మారిపోతాడు. పెద్దత్తయ్య మీరు డ్యూటీ మానేయమంది అంటే నమ్ముతారా? అలా ఎందుకు చెప్తారని అంటుంది. మిమ్మల్ని డ్యూటీ మానేయమన్నందుకు కృష్ణ మురారీకి సోరి చెప్తుంది. తన కోసం మీరు డ్యూటీ వదిలేయొద్దని అంటుంది. పోలీస్ ఉద్యోగం ఎంత గొప్పదో వివరించి తన కళ్ళు తెరిపించిందని మెచ్చుకుంటుంది. ఈసారి పెద్దత్తయ్య మనసు గెలుచుకునేందుకు ఆమెని ఇమిటేట్ చేస్తానని చెప్తుంది.
ముకుంద దేవుడి ముందు నిలబడి మురారీ తన ప్రేమ కోసమే బతికాడని, తన ప్రేమని బతికించమని వేడుకుంటుంది. అది చూసి ఈ పిల్ల సంగతి ఏం అర్థం కావడం లేదని అనుకుంటుంది. నీ జీవితం బాగుండాలని మొక్కుకో. కానీ నీ జీవితం బాగుండాలని నువ్వే కోరుకునే కోరిక వల్ల వేరే వాళ్ళ జీవితం ఆగమ్యగోచరంగా మారాలని అనుకోవద్దని హెచ్చరిస్తుంది. తన కొరికలో ఎటువంటి తప్పు లేదని ముకుంద మూర్ఖంగా సమాధానం ఇస్తుంది. మీ అబ్బాయి ప్రాణ స్నేహితుడి కోసం ప్రేమని త్యాగం చేశానని చెప్తున్నాడు. కానీ నా ప్రేమకి త్యాగం లేదు దక్కించుకోవడం తప్ప. కృష్ణ తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో తెలుసుకుని ఉంటుందని వెళ్లిపోతుందని కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది. తన కంఠంలో ప్రాణం ఉండగా కృష్ణ వాళ్ళని విడిపోనివ్వనని చెప్తుంది. కానీ ముకుంద మాత్రం తన పంథా మార్చుకోదు.
Also Read: వేద వచ్చి క్షమాపణ చెప్తేనే ఇంటికి వస్తానని కండిషన్ పెట్టిన ఆదిత్య- సంబరపడిపోతున్న మాళవిక
కృష్ణ భవానీ దేవిలాగా రెడీ అయ్యేందుకు ట్రై చేస్తుంది. మురారీ మాత్రం వామ్మో కృష్ణ ఏదో పాన్ ఇండియా ప్లాన్ వేసిందే అని కంగారుపడతాడు. గదిలో ఉన్న డైరీ మురారీ చూసి కృష్ణ చూస్తే ఏమౌతుందని అనుకుని మళ్ళీ చూస్తే తన మూడ్ మారిపోతుందేమోనని దాన్ని దాచి పెడతాడు. మురారీ ఎన్ని చెప్పినా కూడా కృష్ణ మాత్రం భవానీ దేవిలాగా రెడీ అయి కిందకు వస్తుంది. భవానీ వెనుకే కృష్ణ తనని ఇమిటేట్ చేస్తూ రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ బిత్తరపోతారు. ఏంటి అందరూ నన్నే ఆశ్చర్యంగా చూస్తున్నారని భవానీ సరి చేసుకుంటుంది. అది చూసి అందరూ నవ్వుతారు. అత్తయ్య ని ఇంప్రెస్ చేయడం కోసం అత్తయ్య అవతారం ఎత్తింది ఇంట్లో ఏదో భయంకరమైన సంఘటన జరగబోతోందని ముకుంద మనసులో అనుకుంటుంది. సూపర్ కృష్ణ అచ్చం పెద్దత్తయ్యలాగే ఉన్నావని మధుకర్ మెచ్చుకుంటాడు. అప్పుడు భవానీ కృష్ణ వైపు చూస్తుంది. ఏంటి నాలాగే తయారై వచ్చింది.
Also Read: కొడుకుతో కలిసి భోజనం చేసిన మహేంద్ర - రిషి గురించి నిజం చెప్పిన ఏంజెల్ - షాక్లో జగతి, వసు
ఏయ్ మధు ఏంటి ఆ కేకలు సైలెంట్ గా కూర్చుని టిఫిన్ చేయలేవా అని భవానీ మాట్లాడినట్టు కృష్ణ మాట్లాడటం విని నవ్వుకుంటుంది. ఈ తింగరి పిల్ల ఖచ్చితంగా నవ్వించేలా ఉంది అసలు తగ్గకూడదని భవానీ నవ్వు ఆపుకుంటుంది. ఇప్పుడు అక్క ఏమంటుందో ఏమోనని రేవతి కంగారుపడుతుంది. అచ్చం భవానీ మాట్లాడినట్టే కృష్ణ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంది.