అన్వేషించండి

Ennenno Janmalabandham July 17th: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: వేద వచ్చి క్షమాపణ చెప్తేనే ఇంటికి వస్తానని కండిషన్ పెట్టిన ఆదిత్య- సంబరపడిపోతున్న మాళవిక

మాళవికని వసంత్ తీసుకుని వెళ్లిపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

వేద ఆదిత్యని ఏదో అన్నదని కాంచన అబద్ధం చెప్పడంతో యష్ కోపంగా తనని పిలుస్తాడు. ఆదిత్య ఎక్కడ అంటే వసంత్ తీసుకెళ్లాడని అంటుంది. వెళ్లాడా? వెళ్లిపోయాడా? నువ్వు ఉండి ఏం చేస్తున్నావని అరుస్తాడు. వాడు వెళ్ళడం నీకు ఇష్టం అందుకె వెళ్లనిచ్చావని తిడతాడు. ఆదిత్యతో అమ్మ అని పిలిపించుకోవాలని అన్నావ్ కదా అలాంటప్పుడు ఎంత బాధ్యత ఉండాలి. కానీ నీకు ఆ బాధ్యత లేదు. ఉండి ఉంటే నా కొడుకుని నా ఇంట్లో ఉండనిచ్చే దానివి. చిన్న పిల్లాడిని కన్వీన్స్ చేయలేకపోయావని అరుస్తాడు. మాళవిక వెళ్ళిపోయింది తల్లి చాటున కొడుకు కూడా వెళ్లిపోయాడని కాంచన అంటుంది. ఇంతకముందు కూడా మాళవిక వెళ్తానని అన్నది కానీ ఆపావు కదా మరి ఎందుకు ఆపలేకపోయావు. ఊరికే ఆదిత్య ఎందుకు వెళ్ళిపోతాడు. నువ్వేమి అనలేదా అని నిలదీస్తాడు. అప్పుడే మాలిని, రత్నం ఇంటికి వస్తారు.

వేద: నేనేమీ అనలేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే అలా మాట్లాడకూడదని చెప్పాను

యష్: నువ్వు తప్పు చేశావు ఒప్పుకో. ఈసారి నా కొడుకు నన్ను వదిలి వెళ్లిపోకూడదు అనుకున్నా చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ నువ్వు నా కొడుకుని నాకు దూరం చేశావు

మాలిని: నా మనవడు వెళ్లిపోయాడా మీరందరూ ఏం చేస్తున్నారు

యష్: నేను ఉంటే ఎందుకు వెళ్లనిస్తాను. మీ కోడలే ఏదో అన్నది తననే అడుగు

Also Read: దొంగని పట్టుకొచ్చిన లాస్య, పిచ్చోడిలా నమ్మేసిన విక్రమ్ - నందు, తులసికి మళ్ళీ పెళ్ళా?

మాలిని: వాడికి నువ్వు అంటే పడటం లేదు వాడికి నిన్ను దూరంగా ఉండమని చెప్పాను కదా. వాడిని నువ్వు ఏమన్నావ్

వేద: ఆదిత్యని నేనే తీసుకొచ్చాను మరి నేను ఎందుకు వెళ్లనిస్తాను

రత్నం: ఆదిత్య ఎక్కడికి వెళ్లడు. వసంత్ దగ్గర ఉంటాడు వెళ్ళి తీసుకుని రావచ్చు

కాంచన: రాడు మాళవిక ఎక్కడ ఉంటే ఆదిత్య అక్కడే ఉంటాడు

వేద: నేను వెళ్ళి తీసుకొస్తాను ఆదిత్య వెళ్లిపోవడానికి అందరూ నేనే కారణం అంటున్నారు కదా

యష్: చాలు ఇప్పటి వరకు చేసింది బాధ్యత అప్పగిస్తే బాగానే చూసుకున్నావ్. నా కొడుకుని నేనే తీసుకొస్తాను. నాకు, నా కొడుక్కి మధ్య ఎవరూ రావాల్సిన అవసరం లేదు

వేద సులోచన దగ్గరకి వస్తుంది. జరిగింది తలుచుకుని బాధపడుతుంది.ఆదిత్య వెళ్లిపోతే అందుకు కారణం నేనే అని ఆయన నా మీద కొప్పడ్డారని ఫీల్ అవుతుంది. నిజమైన కడుపు లేదంటే ఫుడ్ పాయిజన్ అయ్యిందో డాక్టర్ తో చెక్ చేయిస్తే బాగుంటుందని నీలాంబరితో భ్రమరాంబిక అంటుంది. అలా అని నేను అనలేదు అభిమన్యు అంటున్నాడని ఇరికిస్తుంది. మీరందరూ నన్ను అనుమానిస్తున్నారని నీలాంబరి ఏడుస్తుంది. అలా ఏమి లేదు ఒకసారి డాక్టర్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయించుకుంటే జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా అని అంటుంది. సరే అయితే అని టెస్ట్ కి ఒప్పుకుంటుంది. అప్పుడే డాక్టర్ వస్తుంది.

Also Read: స్వప్నకి యాడ్ షూట్ ఆఫర్- డిజైన్స్ వేస్తుంది కళావతేనని తెలుసుకున్న రాజ్, కావ్యకి కొత్త కష్టాలు?

నేను ఎంత బ్లడ్ ఇస్తే మీ తమ్ముడు కూడా అంతే బ్లడ్ ఇవ్వాలని నీలాంబరి కండిషన్ పెడుతుంది. మొదట ఒప్పుకోని అభి చేసేది లేక తల ఊపుతాడు. యష్ ఆవేశంగా వసంత్ ఇంటికి వస్తాడు. ఆదిత్య ఎక్కడ నాకు చెప్పకుండా నా కొడుకుని ఎందుకు తీసుకొచ్చావని నిలదీస్తాడు. నేను మా అక్కని మాత్రమే తీసుకురావడానికి వచ్చాను కానీ అని చెప్పబోతుంటే యష్ నోరు మూయిస్తాడు. మాళవిక వచ్చి ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావ్ ఆదిత్య నేను లేకుండా ఉండలేడు కాబట్టి నాతో వచ్చేశాడని చెప్తుంది. ఆదిత్య కోసం ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండాలి. వదిలేసిన భార్యగా ఇంట్లో ఎలా ఉండాలి. ఆదిత్యని చూడాలంటే నువ్వు ఇక్కడికి రా అంటుంది. డ్రామాలు చేయకు డాక్టర్ ఏం చెప్పాడు ఫ్యామిలీ కావాలని అంటే ఎందుకు ఇలా తీసుకొచ్చావని అంటాడు. వాడు అక్కడే ఉంటే వాడి ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. నువ్వు, వేద చీటికి మాటికీ గొడవలు పడుతుంటే మా వల్ల మీకు గొడవలు అవుతున్నాయని వాడు అనుకుంటాడు ఇదేనా మంచి వాతావరణమని అంటుంది. వేదకి ఆదిత్య అంటే చాలా ఇష్టం తను నీకంటే బాగా చూసుకుంటుందని యష్ అంటుంటే కాదు వేద ఆంటీకి మేముంటే ప్రాబ్లం. మేము అక్కడ ఉండటం వేద ఆంటీకి అసలు ఇష్టం లేదు. మీ దగ్గర మంచిదానిలా యాక్ట్ చేస్తుంది.

యష్: అమ్మ కూడా వస్తుంది

ఆదిత్య: అమ్మ కూడా రాదు. తను అక్కడికి రావాలంటే వేద ఆంటీ వచ్చి అమ్మకి సోరి చెప్తేనే వస్తాను

మాళవిక: నువ్వు తప్పు మాట్లాడుతున్నావ్ వేద ఆంటీ చాలా మంచిది

ఆదిత్య: వేద ఆంటీ సోరి చెప్పకుండా నేను వెళ్ళను

దీంతో యష్ వెళ్ళిపోతాడు. మాళవిక సంబరపడుతుంది. వేద వచ్చి నా కాళ్ళు పట్టుకునేలా చేస్తానని మనసులో అనుకుంటుంది. యష్ ఇంటికి వచ్చి ఆదిత్య ఇంటికి రానన్నాడని చెప్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Smriti Mandhana 2 World Records: రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Embed widget