Brahmamudi July 15th: స్వప్నకి యాడ్ షూట్ ఆఫర్- డిజైన్స్ వేస్తుంది కళావతేనని తెలుసుకున్న రాజ్, కావ్యకి కొత్త కష్టాలు?
రాజ్ కి కావ్య మీద మంచి అభిప్రాయం రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య శృతికి ఫోన్ చేస్తుంది. నీకు కావాల్సిన డిజైన్స్ నేను వేసిస్తాను. మాయనకి నేను డిజైన్స్ వేస్తానని తెలియకూడదు. ఆఫీసుకి కూడా రాను. ఇక మూడో కండిషన్ మంత్లీ శాలరీకి పని చేయను డిజైన్ కి ఇంత అని చెప్పి తీసుకుంటానని కావ్య అంటుంది. మీరు కోటీశ్వరుల ఇంటి కోడలు కదా మీకు డబ్బు అవసరం ఏంటని శృతి అడుగుతుంది. అమ్మ వాళ్ళకి సాయం చేయాలని అనుకుంటున్నా. ఆ విషయం ఆయనకి తెలిస్తే ఎన్ని లక్షలైన ఇస్తారు. కానీ అలా తీసుకోవడం నాకు ఇష్టం లేక పని చేస్తున్నట్టు కావ్య చెప్తుంది. తనకి కావాల్సిన డిజైన్స్ ఈరోజు రాత్రి వేసి పంపిస్తానని కావ్య మాట ఇస్తుంది. గదిలోకి వచ్చి చూసేసరికి రాజ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఈయన ఇంకా పడుకోలేదు డిజైన్స్ ఎలా వేయాలా అని ఆలోచిస్తుంది.
Also Read: అత్తమామల కాళ్ళ మీద పడ్డ విక్రమ్- నిజం బయటపడుతుందని భయపడుతున్న రాజ్యలక్ష్మి
రాజ్ ని పడుకోమని చెప్తుంది. కానీ రాజ్ మాత్రం వినకపోయే సరికి కావ్య తనని ఎలాగైనా నిద్రపోయేలా చేయాలని ట్రై చేస్తుంది. నైట్ అంతా మేల్కొని ఉంటానని చెప్పేసరికి అయితే పదండి అందరూ నిద్రపోతున్నారు కదా కారు డ్రైవింగ్ నేర్పించండి అనేసరికి రాజ్ బిత్తరపోయి వామ్మో అని నిద్రపోతాడు. రాజ్ నిద్రపోయాక కావ్య మెల్లగా డిజైన్స్ వేసేందుకు కిందకి వెళ్తుంది. రాజ్ కి మెలుకువ వచ్చి చూసేసరికి కావ్య గదిలో ఉండదు. ఇల్లంతా వెతుక్కుంటూ కిందకి వస్తాడు. కావ్య డిజైన్స్ వేసుకుంటూ ఉంటే రాజ్ మెల్లగా వచ్చి ఇంత రాత్రి ఏం ఘనకార్యం చేస్తుందని అనుకుంటాడు. తన చేతిలోని పేపర్స్ లాగి చూస్తాడు. అందులో ముగ్గు ఉంటుంది. రాజ్ డోర్ తీసే ముందు సౌండ్ రావడంతో కావ్య గబగబా డిజైన్స్ వేస్తున్న పేపర్స్ దాచి పెట్టి ముగ్గు వేస్తున్న పేపర్ పెడుతుంది. ఇంత రాత్రి వేళ నువ్వు చేసే పని ఇదా? అందుకేనా నన్ను జోల పాడి మరీ నిద్రపుచ్చడానికి ట్రై చేశావని అంటాడు.
మీ అమ్మకి, పెద్దమ్మ మాత్రమే కాదు నీకు కూడా ఉందన్న మాట నా పిచ్చి లచ్చి తింగరబుచ్చి అంటాడు. కాసేపు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. అప్పు కళ్యాణ్ ని తిట్టిన విషయం గురించి ఆలోచిస్తుంది. మరీ అంత కోపంగా మాట్లాడానా? ఫీల్ అయి ఉంటాడా? నిజంగానే హర్ట్ అయి కబడ్డీ ప్రాక్టీస్ కి రాకుండా ఉంటాడా? అనుకుని ఫోన్ చేసి మళ్ళీ కట్ చేస్తుంది. తనే తిట్టింది కదా సోరి చెప్పాలి అప్పుడే మాట్లాడాలని అనుకుంటాడు. మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా ఫోన్ చేయలేదని తిట్టుకుంటూ కళ్యాణ్ కి ఫోన్ చేసి మళ్ళీ తిట్ల దండకం మొదలుపెడుతుంది. దీంతో కళ్యాణ్ సోరి చెప్తాడు. రేపు పొద్దున్నే ప్రాక్టీస్ ఉంది వస్తున్నావా అంటే వస్తున్నానని అంటాడు. స్వప్న ఫుల్ ఖుషీగా ఉంటుంది. రాహుల్ వచ్చి ఏంటి అంత హ్యాపీగా ఉన్నావని అడుగుతాడు.
Also Read: బెడిసికొట్టిన ప్లాన్- మాళవికని తీసుకెళ్లిపోయిన వసంత్, వేదనే వెళ్లగొట్టిందని అనుకున్న యష్
యాడ్ షూట్ లో సెలెక్ట్ అయ్యానని సంబరంగా చెప్తుంది. దీనికి కారణం నువ్వే లేకపోతే ఈ ఛాన్స్ వచ్చేది కాదని స్వప్న సంతోషంగా ఉంటుంది. రెండు రోజుల్లో పర్ఫ్యూమ్ యాడ్ షూట్ చేసి ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తారట. నేను సెలెబ్రెటీని అయిపోతాను. అందరూ వచ్చి ఆటో గ్రాఫ్ లు అడుగుతారు. సూపర్ గా ఉంటుంది. వెంటనే పార్టీ చేసుకుందామని అంటుంది. డ్రెస్ కి చాలా డబ్బులు అయ్యాయి మళ్ళీ ఇప్పుడు పార్టీ అంటే రాజ్ ని డబ్బులు అడగాలి వద్దని రాహుల్ చెప్తాడు. నేను సెలెబ్రెటీ అయినాక నువ్వే నా ఫైనాన్సియల్ మేనేజర్ వి అప్పుడు డబ్బు అంతా మన దగ్గరే ఉంటుందని తెగ సంబరంగా చెప్తుంది. నువ్వు చేసే యాడ్ చూస్తే వెళ్ళి బస్తీలో పడతావని రాహుల్ మనసులోనే సంతోషపడతాడు. కావ్య డిజైన్స్ వేసి శృతికి పంపిస్తుంది. అమ్మానాన్నకి సాయం చేస్తున్నందుకు కావ్య రిలీఫ్ గా ఫీల్ అవుతుంది.