Gruhalakshmi July 15th: దొంగని పట్టుకొచ్చిన లాస్య, పిచ్చోడిలా నమ్మేసిన విక్రమ్ - నందు, తులసికి మళ్ళీ పెళ్ళా?
రాజ్యలక్ష్మి ఇంట్లో లాస్య పాగా వేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రాములమ్మ దివ్యకి ఫోన్ చేసి కథ సుఖాంతం అయ్యిందని చెప్తుంది. విక్రమ్ తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చి సోరి చెప్పారు, ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటానని కూడా అన్నారని చెప్తుంది. ఈ విషయం చెప్పినట్టు ఎవరికీ చెప్పొద్దని అంటుంది. దివ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి విక్రమ్ ని వెనుక నుంచి కౌగలించుకుంటుంది. ఎందుకంత ప్రేమ అంటాడు. తనకి మంచి రోజులు వస్తాయని నమ్మకం కలిగిందని చెప్తుంది. పొరపాటు చేయడం సహజం కానీ దాన్ని ఒప్పుకోవడం గొప్పతనమని మెచ్చుకుంటుంది. విషయం రాములమ్మ చెప్పిందని అంటుంది. నువ్వు కాల్ చేసి మాట్లాడొచ్చు కదా లేదు అమ్మ చేసే వరకు చేయనని చెప్తుంది. ఇద్దరి మధ్య కాసేపు కళ్ళతోనే రొమాన్స్ నడుస్తుంది.
Also Read: స్వప్నకి యాడ్ షూట్ ఆఫర్- డిజైన్స్ వేస్తుంది కళావతేనని తెలుసుకున్న రాజ్, కావ్యకి కొత్త కష్టాలు?
దొంగతనం చేసింది తనే కావడంతో బసవయ్య వణికిపోతూ ఉంటాడు. రాజ్యలక్ష్మి, లాస్య వచ్చి కదిలించేసరికి తిక్క తిక్కగా మాట్లాడతాడు. ఇలా పిచ్చి వాగుడు వాగితే తనే పెట్టిస్తానని రాజ్యలక్ష్మి బెదిరిస్తుంది. నువ్వు దొరికిపోతే మీ అక్కని పట్టించినట్టేనని లాస్య అనేసరికి వామ్మో నాకేం సంబంధమని రాజ్యలక్ష్మి చేతులెత్తేస్తుంది. ప్లాన్ నాది ఎవరూ దొరక్కుండా చూసుకునే బాధ్యత కూడా తనదేనని లాస్య హామీ ఇస్తుంది. తెల్లారే సరికి ప్రాబ్లం సాల్వ్ చేస్తానని హాయిగా నిద్రపోమ్మని లాస్య అంటుంది. నందు తిండి తినకుండా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తులసికి పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. దొంగని పట్టుకున్నామని మంగళసూత్రం దొరికిందని చెప్తాడు. ఈ విషయంలో సంతోషంగా ఇంట్లో చెప్తుంది. కేఫ్ మళ్ళీ రీఓపెన్ చేయించబోతున్నామని ఆనందంగా ఉంటారు.
లాస్య సీరియస్ గా ఆలోచిస్తుంటే దివ్య వచ్చి పలకరిస్తుంది. ఇంతకీ లక్ష రూపాయలు ఎవరు నొక్కేశారని దివ్య అంటుంది. తనకేం తెలియదని లాస్య బుకాయిస్తుంది. ఇలాంటి పనులు నీకు తెలియకుండా జరుగుతాయా? విక్రమ్ కి ఆల్రెడీ తెలిసిపోయింది దొంగతనం నువ్వే చేశావని దివ్య చీకట్లో బాణం వేస్తుంది. వామ్మో ఇదేంటి నా వెనుక పడింది నను ఫిక్స్ చేస్తుందా ఏంటని లాస్య బెదిరిపోతుంది. ఈ ఇంట్లో అందరూ తమని తాము కాపాడుకోవాలని అనుకుంటారు. దొంగతనం నీమీద వేసినా వేసేస్తారు. జాగ్రత్త అసలు మొగుడు వదిలేసిన ఆడడానివి. ఉద్యోగం కూడా పోతే రోడ్డున పడతావాని దివ్య హెచ్చరిస్తుంది. తులసి, నందు తాళి తీసుకోవడం కోసం పోలీస్ స్టేషన్ కి బయల్దేరతారు. కారులో వెళ్దామని అంటే తులసి మాత్రం బైక్ మీద వెళ్దాం డబ్బులు ఆదా చేయాలని హితబోధ చేస్తుంది. రాములమ్మ వచ్చి హెడ్ మాస్టర్, స్కూల్ మాస్టర్ అని వాగుతుంది. తులసి, నందు మళ్ళీ కలిస్తే ఇంటికి కొత్త వెలుగు వస్తుందని రాములమ్మ మనసులో అనుకుంటుంది.
Also Read: అత్తమామల కాళ్ళ మీద పడ్డ విక్రమ్- నిజం బయటపడుతుందని భయపడుతున్న రాజ్యలక్ష్మి
లాస్య ఒకడిని పట్టుకొచ్చి కొడుతూ ఉంటుంది. ఎందుకు కొడుతున్నారని విక్రమ్ అడుగుతాడు. లక్ష రూపాయలు దొంగతనం చేసింది వాడేనని చెప్తుంది. పిల్ల చదువు కోసం దొంగతన చేయాల్సి వచ్చిందని చెప్తాడు. తప్పు అయ్యిందని క్షమించమని కాళ్ళ మీద పడతాడు. తనని పోలీసులకి పట్టించమని దివ్య అనేసరికి లాస్యకి ఫ్యూజులు ఎగిరిపోతాయి.