News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Krishna Mukunda Murari August 30th: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్: సైకోలా మారుతున్న ముకుంద - కృష్ణతో యుద్ధం మొదలు, మురారీ పరిస్థితి ఏంటి?

మురారీ తనని ప్రేమిస్తున్నాడని కృష్ణకి రేవతి చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

మురారీ కృష్ణని తీసుకుని రేవతి ఇంటికి వస్తుంది. కొడుకు తలకి గాయం చూసి భవానీ అల్లాడిపోతుంది. ఏమైందని కంగారుగా అడుగుతుంది. క్యాంప్ లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని ఏమి కాలేదని చెప్తాడు. ఎప్పుడు జరిగిందని, తనకి ఎందుకు చెప్పలేదని బాధగా అంటుంది. ఇలా కంగారుపడతారనే చెప్పలేదని ధైర్యం చెప్తాడు. టెంట్ కాలిపోతుంటే నిజమైన హీరోలాగా వెళ్ళి పిల్లలందరినీ కాపాడారని కృష్ణ చెప్తుంది. ఫైర్ యాక్సిడెంట్ లో గాయపడి స్పృహ కోల్పోతే  సీనియర్ డాక్టర్స్ కూడా చేతులెత్తేస్తే కృష్ణ కాపాడిందని రేవతి చెప్తుంది. ముకుంద కంగారుగా ఎలా ఉందని మురారీని అడుగుతుంది. కృష్ణ పక్కన ఉండగా మురారీకి ఏమి కాదు తను వాడిని కాపాడుకుంటుందని రేవతి బదులిస్తుంది. ఇక అలేఖ్యతో దిష్టి నీళ్ళు తెప్పిస్తుంది. ఇంటి పెద్ద కోడలిగా మురారీ కృష్ణకి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించమని భవానీ ముకుందకి చెప్పడంతో తను షాక్ అవుతుంది. ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో దిష్టి తీస్తుంది.

మీ అగ్రిమెంట్ అయిపోయాక కూడా ఇంటికి తిరిగి వచ్చావంటే నీకు మురారీ మీద ఆశ పోలేదు కృష్ణ. నా ప్రేమని నేను దక్కించుకుంటాను. ఇక నీకు నాకు మధ్య రోజు యుద్ధమే కృష్ణ అని ముకుంద మనసులో అనుకుంటుంది. ఇద్దరూ కుడి కాలు లోపల పెట్టి ఇంట్లోకి వెళతారు. అగ్రిమెంట్ అయిపోయాక కూడా తనని ఇంటికి తీసుకొస్తావా? చెప్తా నీ సంగతని తిట్టుకుంటుంది. కృష్ణ ఇంటికి తిరిగి వచ్చినందుకు మధుకర్ సంతోషంగా ఉంటాడు. ముకుంద ప్రేమ గెలవాలని అలేఖ్య అంటుంది. దీంతో ఇద్దరూ కాసేపు వాదులాడుకుంటారు.

Also Read: చిత్ర చేతిలో కన్నుమూసిన గీత - వేదకి యాక్సిడెంట్, ఇక తల్లి కాలేదా?

ముకుంద: అగ్రిమెంట్ అయిపోయింది కదా కృష్ణ మళ్ళీ ఎందుకు ఇంటికి వచ్చింది

మురారీ: ఇన్నాళ్ళూ మాది అగ్రిమెంట్.. ఒకరికొకరు తెలియనప్పుడు అది పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు మేమేంటో మాకు తెలుసు. అందుకే దాన్ని రద్దు చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాం. ఇది పర్మినెంట్ మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు

ముకుంద: నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మీరు అగ్రిమెం క్యాన్సిల్ చేసుకుని హ్యాపీగా ఉంటే నేను చూస్తూ ఉంటానా? తనని నీ భార్యగా నేను అంగీకరిస్తానా? తనకి తానుగా మీ జీవితాల్లోకి రాను అనేసి కృష్ణ వెళ్లిపోయేలా చేస్తాను. నీ ప్రేమ నాది. ఆ స్థానం ఎవరికి ఇచ్చినా కూడా నేను నీ మనసులో నుంచి వెళ్ళను. నేను మాత్రమే నీ గుండెల్లో ఉండాలి

మురారీ: ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఆదర్శ్ తిరిగి వస్తున్నాడు. నిన్ను వాడికంటే గొప్పగా ఎవరూ ప్రేమించలేరు.. నాతో సహా. నువ్వు కూడా చెప్పావ్ కదా ఆదర్శ్ గొప్పవాడని. నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు ఊహించిన దాని కంటే గొప్పగా నిన్ను ప్రేమిస్తాడు. ఇంకెప్పుడు ప్రేమ నీ మనసు పాడు చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టకు

ముకుంద: ఇన్ని రోజులు నా ప్రేమ గురించి ఆలోచించాను. కృష్ణ మీద ఫోకస్ చేయలేదు. నేను ఎప్పుడు తనని ఇబ్బంది పెట్టలేదు తను చదువుకుని వెళ్లిపోతుందని. నా ప్రేమని ఎగరేసుకుని పోతాను అంటే చూస్తూ ఊరుకొను. అత్తయ్యకి మన ప్రేమ విషయం చెప్పేస్తాను. తను కూడా నా ప్రేమ విషయం తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. మొన్న నా గదిలోకి కూడా వచ్చింది అప్పుడు నీ ఫోటోస్ అక్కడే ఉన్నాయి. కొంచెం ఉంటే చూసేది. నేను ఎవరిని ప్రేమించానో తెలుసుకుని వాడితోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. అందుకే నిజం చెప్పేస్తాను.. నమ్మకం కుదరడం లేదా? అయితే ఇది చూడు అనేసి మురారీ వాళ్ళ గదిలో పెట్టిన లవ్ లైట్స్ చూపిస్తుంది. కృష్ణ నిన్ను ప్రేమించడం లేదు. ఇన్నాళ్ళూ మీది అగ్రిమెంట్ అని అన్నీ సహించాను కానీ నువ్వు మనసు మార్చుకున్నావ్. ఇప్పుడు నేను మనసు మార్చుకుంటున్నా ఇక సహించేది లేదు. ఆదర్శ్ ని కనీసం నా చిటికెన వేలు కూడా తాకనివ్వు

మురారీ: నేను నిన్ను మర్చిపోయినట్టే నువ్వు నన్ను మర్చిపో. లైఫ్ లో సెకండ్ ఛాన్స్ తీసుకో

Also Read: శ్రీవారి సేవలో వసుధార, రిషిని అడిగేద్దామని డిసైడైన ఏంజెల్!

ముకుంద: నువ్వు ఒప్పుకోకపోయినా నీ మనసులో నా మీద ప్రేమ ఉంది. నువ్వు నటిస్తున్నావ్. నేను నిన్ను ఎప్పటికీ అసహ్యించుకొను. కానీ త్వరలోనే మన ప్రేమ విషయం అందరికీ తెలుస్తుంది. మనం పెళ్లి పీటలు కూడ ఎక్కుతాము అనేసి బెదిరిస్తుంది.

కృష్ణ కిచెన్ లో రేవతి దగ్గరకి వచ్చి మళ్ళీ డౌట్ గా అడుగుతుంది. తన మీద ఒట్టు పెట్టించుకుని ఏసీపీ సర్ నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? అని అంటుంది. వాడు కాస్త టైమ్ తీసుకుని నిజం చెప్తాడని రేవతి చెప్తుంది. దీంతో కృష్ణ సంతోషపడుతుంది. అలేఖ్య వచ్చి కృష్ణ ఏదో పెట్టించుకుంది ఏంటని అడుగుతుంది. అవును చెప్పింది అయినా కృష్ణ వాళ్ళ విషయాలు ముకుందకి చెప్తే అట్లకాడ కాల్చి వాత పెడతానని తిడుతుంది.

Published at : 30 Aug 2023 09:20 AM (IST) Tags: Krishna Mukunda Murari Serial Krishna Mukunda Murari Serial Today Episode Krishna Mukunda Murari Serial Written Update Krishna Mukunda Murari Serial August 30th Episode

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్