అన్వేషించండి

Guppedanta Manasu August 29th: శ్రీవారి సేవలో వసుధార, రిషిని అడిగేద్దామని డిసైడైన ఏంజెల్!

Guppedantha Manasu August 29th: గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త లవ్ ట్రాక్ మొదలైంది. వసుధార-రిషి ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటే... మధ్యలో వచ్చి చేరింది ఏంజెల్.

గుప్పెడంతమనసు ఆగష్టు 29 ఎపిసోడ్ (Guppedanta Manasu August 29nd Written Update)

ఇష్టం మితిమీరిపోతోంది ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే మనకు మంచిది అన్న రిషి మాటలు తల్చుకుంటూ కూర్చుంటుంది ఏంజెల్. ఇంతలో అక్కడికి వచ్చిన విశ్వనాథం ఏం ఆలోచిస్తున్నావో నాకు చెప్పు. నాకు చేతనైతే నీ సమస్యని తీరుస్తాను అంటాడు. ఇన్నాళ్లు నాకోసం కష్టపడింది చాలు ఇకమీదట నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటే చాలు అనేసి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి బీపీ చెక్ చేసి రెస్ట్ తీసుకోమని చెబుతుంది. మళ్లీ రిషి గురించి ఆలోచనలో పడుతుంది. అసలు రిషి మనసులో ఏముందో అర్థం కావటం లేదు. వసుధార, రిషి ప్రేమించుకుంటున్నారా.. ఆ విషయం నాకు తెలిస్తే బాధపడతానని చెప్పడం లేదా ఈరోజు ఎలాగైనా విషయం కనుక్కోవాలి. వసుధారకి కాల్ చేద్దామా అనుకుని ముందు రిషితో మాట్లాడాలి. రిషి-వసు మధ్య ఏమైనా ఉంటే నేను తప్పుకుంటాను కదా..రిషి మనసులో ఎవరున్నారో కనుక్కోవాలి తన మనసులో ఎవరూ లేకపోతే పెళ్లి చేసుకునే వరకు వదిలి పెట్టకూడదు అని ఒక నిర్ణయానికి వస్తుంది

Also Read: 'గుప్పెడంత మనసు' సీరియల్: రిషితో క్యాండిల్ నైట్ డిన్నర్ ప్లాన్ చేసిన ఏంజెల్.. రిషి ప్రేమ కోసం ఆరాటపడుతున్న వసు?

మరోవైపు కాలేజీలో కూర్చున్న రిషి ఇంటికి వెళ్లడానికి ఇష్టపడడు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లిపోదాం అంటే కాలేజీ భవిష్యత్ ఏమవుతుందో , ఉందామంటే ఈ నరకం భరించలేకపోతున్నా..అసలు నాకే ఎందుకిలా జరుగుతోందో అని ఆలోచనలో పడతాడు. ఇంతలో అటెండర్ వచ్చి అందరూ వెళ్లిపోయారు సార్ అని చెప్తాడు. నాకు కొంచెం పని ఉంది నేను వెళ్లేటప్పుడు మీకు చెప్తాను అప్పుడు ఈ రూమ్ లాక్ చేసుకుందువు గాని అనడంతో అటెండర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత వసుధార అటువైపుగా వెళుతూ ఇంకా ఇంటికి వెళ్ళలేదేంటని అడుగుతుంది. 

రిషి-వసు
నాకు పని ఉంది అనడంతో హెల్ప్ చేయమంటారా అని అడుగుతుంది వసు. ఎవరిపని వాళ్లు చేసుకుంటే మంచిది పక్క వాళ్ళ పనుల్లో జోక్యం చేసుకుంటేనే పరిస్థితులు ఇంతవరకు వచ్చాయి అంటాడు రిషి. అది జోక్యం అని ఎందుకు అనుకుంటారు సాయం అని అనుకోవచ్చు కదా అంటుంది వసుధార. ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. నన్ను డిస్టర్బ్ చేయకండి మీరు వెళ్ళండి అని గట్టిగా చెప్పడంతో  రిషివైపు తీక్షనంగా చూస్తుంది. ఆ కళ్ళను చూసి మైమరిచిపోయిన రిషి..ఆ కళ్లతోనే ప్రేమలో పడేసింది..ఇప్పుడు ప్రాణం అయింది..ఇప్పుడు ఆ కళ్లతోనే ఎదుటివారికి లొంగిపొమ్మని చెబుతోందా  అనుకుంటూ ఆ కళ్లను గీస్తూ కూర్చుంటాడు. 
 
ఏంజెల్- రిషి
ఇంకా రిషి ఇంటికి రాలేదని కంగారుపడుతుంది ఏంజెల్. ఫోన్ చేద్దామనుకుంటుంది మళ్ళీ కోప్పడతాడని ఊరుకుంటుంది. చాలా రాత్రి వరకు కాలేజీలోనే ఉంటాడు రిషి. కరెంటు పోవడంతో అక్కడినుంచి బయలుదేరుతాడు. రిషి  కారులో వస్తుండగా  ఏంజెల్ రిషికి  కాల్ చేస్తుంది కానీ రిషి లిఫ్ట్ చేయడు. ఎందుకిలా చేస్తున్నాడో అని ఏంజెల్ బాధపడుతుంది. మరోవైపు రిషి మాత్రం ఇంటికి వెళ్లకుండా కారుని ఆపేస్తాడు. ఏంజెల్ కి ఎదురుపడాలని లేదు కానీ వెళ్ళక తప్పదు ఏంటి నాకీ పరిస్థితి అని బాధపడతాడు. కారు అక్కడే వదిలేసి ఆలోచించుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. తను ఆలోచనల నుంచి బయటికి వచ్చేసరికి వసుధార ఇంటిముందు ఉంటాడు. అదేంటి ఆలోచించుకుంటూ ఇంత దూరం ఎలా నడిచి వచ్చేసాను అనుకుంటాడు. అసలు వసుధార  ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో కనుక్కుందాం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తాడు.

Also Read: ఆగష్టు 29 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఈ రోజు ఆర్థిక వనరులు పెరిగే అవకాశం ఉంది!

అప్పుడే భోజనానికి కూర్చున్న వసు-చక్రపాణి..ఆ సమయంలో వచ్చిన రిషిని చూసి షాక్ అవుతారు. భోజనానికి రమ్మని పిలిస్తే...మాట్లాడేందుకు వచ్చాను భోజనానికి కాదనేస్తాడు. చక్రపాణి కూడా బతిమలాడడంతో అప్పుడు భోజనానికి కూర్చుంటాడు వసుధార పక్కనే. ఇద్దర్నీ చూసి మురిసిపోతాడు వసు తండ్రి చక్రపాణి. ఆ సమయంలో ఏంజెల్ ఎంట్రీ ఇస్తుంది. ముందుగా ఏంజెల్ ని చూసిన రిషి నన్ను తను ఇక్కడ చూస్తే అనుమానపడుతుంది నేను వచ్చినట్టు చెప్పొద్దని వెళ్లి దాక్కుంటాడు. ఇంట్లోకి వచ్చిన ఏంజెల్ ని ఈ టైంలో వచ్చావ్ ఏంటని అడుగుతుంది వసుధార. రిషి ఇంటికి రాలేదు..కాల్ లిఫ్ట్ చేయలేదు అందుకే నీకేమైనా తెలుసేమో అని అడుగుదామని వచ్చాను అంటుంది..
ఎపిసోడ్ ముగిసింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Embed widget