ఉప్పు అప్పు వద్దు - దానం ఇవ్వండి అంటారెందుకు!



శ్లోకం
ధాన్యమన్న సమృద్ధ్యర్థం మధురాహారదం గుడమ్‌
రౌప్యం రేతోభివృద్ధ్యర్థం షడ్రసార్థం తు లావణమ్‌



ధాన్యాన్ని దానంగా ఇస్తే అన్న సమృద్ధి కలుగుతుంది



వెండి దానం వల్ల వీర్యాభివృద్ధి, బెల్లాన్ని దానంగా ఇవ్వడం వల్ల మధురమైన ఆహారం లభిస్తుంది



లవణం (ఉప్పు) దానం చేస్తే షడ్రసోపేతమైన ఆహారం లభిస్తుందని పురాణ వచనం



ఆహార పదార్థాలకు రుచిని ఇచ్చే ఉప్పు దానంగా ఇస్తే మృత్యుదేవత ఆయుష్షు, బలం, ఆనందం ఇస్తుందని పురాణోక్తి



ఉప్పు దానం చేయవచ్చు గానీ, అప్పుగా ఇవ్వకూడదని చెబుతారు



ఉప్పును అప్పుగా ఇవ్వడం వల్ల లక్ష్మీదేవిని వేరేవాళ్ల చేతిలో పెట్టినట్టు అవుతుందని అందుకే ఉప్పును అప్పుగా ఇవ్వడం మంచిదికాదంటారు



ఓసారి చేజారిన సంపద మళ్లీ రావడం చాలా కష్టం..అందుకే ఉప్ప చేతికి అందించరు



ఉప్పు చేతికి అందుకుంటే కలహాలు వస్తాయని కూడా అంటారు పెద్దలు..
Images Credit: Pixabay