వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదే



న నిర్మితా కేన న దుష్టపూర్వా న శ్రూయతే హేమమయూ కురంగీ
తథాఆపి తృష్ణా రఘునన్దనస్య వినాశకాలే విపరీతబుద్ధిః



వినాశకాలం వస్తే బుద్ధికూడా సహకరించదు అని వివరంగా ఇలా చెప్పాడు చాణక్యుడు



విధాత బంగారులేడిని సృష్టించలేదు, అలాంటి లేడిని ఎవ్వరూ చూడలేదు, వినలేదు



కానీ సీతమ్మకు బంగారులేడి కనిపించింది - కావాలని అనిపించింది



సీత అడగగానే రాముడు అలానే వెళ్లిపోయాడు - అంటే ఓ అసంభవాన్ని నమ్మేశాడు



అసలు బంగారు లేడి ఉంటుందా అని క్షణకాలం పాటూ ఆలోచించలేదు



కష్టాల్లో పడాల్సి ఉన్నప్పుడు మనిషి తెలివితేటలు నశిస్తాయని చెప్పేందుకే ఇదే ఉదాహరణ



Images Credit: Pinterest