తొమ్మిదో రోజు తిరుగు ప్రయాణం చేయకూడదా! కాలాన్ని లెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలే తిథులు చాంద్రమానంలో తొమ్మిదో తిథి నవమి ఈ తిథి శుభకార్యాలకు పనికిరాదంటారు. వివాహానికి మినహాయింపు ఉంది నవమి విషయంలో ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, ప్రత్యక్ష నవమి అని ధర్మశాస్త్రం మూడు రకాలుగా వివరించింది పుట్టింటికి వెళ్లినా, ఇంకెవరైనా బంధువుల ఇంటికి వెళ్లినా తొమ్మిదో రోజు తిరుగు ప్రయాణం చేయరాదంటారు నవమి తిథి నాడు ప్రయాణాలు చేస్తే కష్టనష్టాలు ఎదురవుతాయని విశ్వసిస్తారు అత్తవారింట్లో ఆడపిల్ల సంతోషంగా ఉండాలని కోరుకుంటారంతా..అందుకే తొమ్మిదో రోజు తిరుగుప్రయాణం కూడదంటారు కేవలం పుట్టింటి నుంచి మాత్రమే కాకుండా ఎక్కడికి వెళ్లినాకానీ తొమ్మిదో రోజు తిరుగు ప్రయాణం చేయకూడదన్న నియమం ఫాలో అయిపోతున్నారు Image Credit: Pixabay