ఆగష్టు 29 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఈ రోజు ఆర్థిక వనరులు పెరిగే అవకాశం ఉంది!
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 2023 August 29th
మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారు మానసికంగా సంతోషంగా ఉంటారు. సోమరితనం వదిలి చురుకుగా ఉంటారు. మీరు చేసే పనిలో విజయం కొంత ఆలస్యం అవుతుంది కానీ విజయం సాధిస్తారు. ప్రత్యర్థులతో చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక ప్రణాళికలను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారు మీ పనికి సంబంధించి బయటికి వెళ్ళవలసి వస్తుంది. ఎదో ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం వరిస్తుంది. నిరాశ చెందకుండా ఆశాజనకంగా వ్యవహరించండి. అధిక పనిభారం వల్ల అలసట, మానసిక అశాంతి ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకి స్థాన మార్పు మంచిది కాదు. ప్రమోషన్స్ కి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొత్త పనులు వాయిదా వేసుకుంటే మంచిది. ఆహారం, పానీయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. యోగా, ధ్యానంపై దృష్టి సారించేందుకు ప్రయత్నించండి.
Also Read: యోగాకి మాత్రమే కాదు సంగీతం,నాట్యం సహా ప్రతి విద్యకూ పరమేశ్వరుడే ఆద్యుడు!
మిథున రాశి
ఈ రోజు మీ రోజువారీ పనిలో కొంచెం హాడావుడి ఉంటుంది. మనసంతా సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రకు, సినిమాలు ప్లాన్ చేసుకుంటారు. కానీ మనసులో ఆందోళన ఉంటుంది, ఎమోషనల్‌గా ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఇంట్లో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మాతృవర్గం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ప్రత్యర్థులు మీ ముందు తలవంచాల్సిందే. శారీరకంగా , మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మేధోపరమైన చర్చలో మీ ప్రతిభను చూపి ప్రశంసలు పొందుతారు. సంఘంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. వివాహితులు జీవిత బాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు.
సింహ రాశి
ఈ రాశి స్త్రీ పురుషులకు ఈరోజు అనుకూలమైన రోజు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారంతో మరిన్ని విజయాలు సాధిస్తారు. ప్రత్యర్థులను ఓడిస్తారు.
కన్యా రాశి
ఈరోజు మీకు అంత అనుకూలంగా లేనందున అప్రమత్తంగా ఉండండి. ఏ పని చేయాలని అనిపించదు. ధనం నష్టపోయే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. పనిలో విజయం సాధించడంలో వైఫల్యం నిరాశకు దారితీస్తుంది. పిల్లల గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు చేయాల్సి వస్తే వాయిదా వేసుకోవడమే మంచిది
Also Read: రామ రావణ యుద్ధం తర్వాత యుద్ధభూమిలో జరిగిన సంఘటన ఇది
తులా రాశి
ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరటానికి, నూతన వ్యాపారం ప్రారంభించటానికి అనుకూలమైన రోజు. మీ అదృష్టాన్ని పెంచుకునే అవకాశం మీకు లభిస్తుంది. సామాజికంగా గౌరవం పొందుతారు. ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. కుటుంబంలో కొన్నిసమస్యలు తలెత్తే అవకాశముంది. స్థిర ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. ఈరోజు ముఖ్యమైన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. కుటుంబ వాతావరణంలో లేని పోనీ చికాకులు ఏర్పడతాయి. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. ప్రత్యర్థులను ఓడిస్తారు. ఈరోజు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగం మారే అవకాశం ఉంది.
ధనస్సు రాశి
ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిపేందుకు ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళటానికి సుముఖంగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ శ్రమకి తగిన ఫలితం లభించకపోవటంతో కొంత నిరాశ చెందుతారు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
మకర రాశి
ఈ రాశి స్త్రీ పురుషులు ఈరోజు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడమే మంచిది. మనసులో ఏదో ఆందోళన వెంటాడుతుంది. మీ ప్రతికూల ఆలోచనలు మీ పనిపై ప్రభావం చూపిస్తాయి. మాటల విషయంలో సంయమనం పాటించండి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి.
కుంభ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ప్రారంభం ప్రయోజనకరంగా ఉంటుంది. సామాజిక , ఆర్థిక రంగాలలో పురోగతి సాధిస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. అనుకోనిఖర్చులు పెరుగుతాయి. ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. కోర్టు పనుల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రకృతి విపత్తు ప్రభావం మీపై ఉండొచ్చు. కొందరు వ్యక్తుల ప్రతికూల ప్రవర్తన మీకు హాని కలిగిస్తుంది.
మీన రాశి
ఈ రోజు మీరు ఏ కొత్త పనిని ప్రారంభించినా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, ఆర్ధిక వనరులు పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆనందం ,శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.