అన్వేషించండి

Ennenno Janmalabandham August 30th: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: చిత్ర చేతిలో కన్నుమూసిన గీత - వేదకి యాక్సిడెంట్, ఇక తల్లి కాలేదా?

వేద తల్లి కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

రాఖీ పండుగ సందర్భంగా వేద ఖుషితో ఆదిత్యకి రాఖీ కట్టిస్తుంది. అన్నకి స్వీట్ తినిపించి హారతి ఇప్పిస్తుంది. ఆదిత్య చెల్లిని ఆశీర్వదిస్తాడు. ఖుషి ఇంకొక రాఖీ తీసుకుని వేద పొట్టకి కడుతుంది. తన బుజ్జి తమ్ముడి కోసమని చెప్పేసరికి అందరూ మురిసిపోతారు. వేద ఆనందపడుతుంది. అమ్మ బొజ్జలో బుజ్జి తమ్ముడు ఉన్నాడని నీకు ఎలా తెలుసని మాలిని అడుగుతుంది. మాకేవారికి చెప్పని వార్త నీకు ఎలా తెలిసిందని సులోచన కూడా అంటుంది. అమ్మానాన్న మాట్లాడుకుంటుంటే విన్నానని చెప్తుంది.

యష్: కావాలని ఏమి దాచలేదు సోరి మావయ్య. చిన్న హెల్త్ ఇష్యూ ఉంది అందుకే చెప్పకుండా కొంచెం టైమ్ తీసుకుని చెప్పాలని అనుకున్నాం

వేద: ఇద్దరం కలిసి ఒకేసారి చెప్పాలని అనుకున్నాం కానీ

మాలిని: కానీ ఖుషి వల్ల తెలిసిపోయిందని అనుకుంటున్నారా? మాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. దాచాలని అనుకున్నారు కానీ కుదరలేదు అది కవర్ చేసుకోవడానికి బేబీ వైరస్ పుట్టించారు

సులోచన: కన్ఫ్యూజన్ ఎందుకని డాక్టర్ దగ్గరకి వెళ్ళి తెలుసుకున్నాం

మాలిని: పండంటి బిడ్డని కని సంతోషంగా ఉండు వేద

Also Read: శ్రీవారి సేవలో వసుధార, రిషిని అడిగేద్దామని డిసైడైన ఏంజెల్!

ఇక ఇంట్లో అందరూ వేదని ఆశీర్వదిస్తారు. ఆదిత్య ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే వేద వచ్చి ఏమైందని అడుగుతుంది.

ఆదిత్య: మా అమ్మ ఇప్పుడు లేదు

వేద: సోరి

ఆదిత్య: తను మంచిది కాదని తెలిసిపోయింది. మీరు మంచి వాళ్ళని తెలిసి మీతోనే ఉండాలని అనుకున్నా. మీరు అమ్మ కాబోతున్నారు కదా మీకు పుట్టబోయే బిడ్డని బాగా చూసుకుంటారు. అప్పుడు నన్ను ఖుషిని ఎలా చూసుకుంటారు

వేద: ఆ డౌట్ ఎందుకు వచ్చింది

ఆదిత్య: మా ఫ్రెండ్ చెప్పాడు వాడికి అమ్మ చనిపోయి రెండో అమ్మ వచ్చింది. తనకి పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళని చూసుకోవడం మానేసిందట

వేద: వాళ్ళు వేరు మనం వేరు. నాకు నువ్వు ఖుషి తర్వాత పుట్టబోయే బిడ్డ

ఖుషి: నాకు చిన్నప్పటి నుంచి వేద అమ్మనే అమ్మ. నన్ను ఎంత బాగా చూసుకుంటుందో చూసావు కదా. నువ్వు వచ్చిన తర్వాత అందరూ హ్యాపీ. ఇంట్లో అందరూ ఎంత మంచి వాళ్ళు నువ్వే చూశావు కదా. మనకి తమ్ముడు పుడితే ముగ్గురం కలిసి హ్యాపీగా ఆడుకుంటాం

Also Read: ఆగష్టు 30 or 31 రక్షాబంధన్ ఎప్పుడు, రాఖీ పండుగ ఎప్పుడు - ఎలా మొదలైంది!

వేద ఆదిత్యని దగ్గరకి తీసుకుని ప్రేమగా మాట్లాడుతుంది. యష్ కూడ ఇది హ్యాపీ మూమెంట్ సంతోషంగా ఉండాలని చెప్తాడు. గీత కోసం చిత్ర వస్తుంది.

గీత: నువ్వు ఏమడగాలని అనుకుంటున్నావో నాకు తెలుసు. వసంత్ తో ఏంటి సంబంధం అని అడగాలని అనుకుంటున్నావ్ కదా. మా మధ్య సంబంధం ఉంది కానీ అది సీక్రెట్

అప్పుడే వసంత్ వస్తాడు. మన సంబంధం గురించి తనకేమి చెప్పలేదు కదా అంటుంది.

వసంత్: తన పేరు గీత. చాలా కాలం క్రితం పేరెంట్స్ తో అమెరికా వెళ్ళిపోయింది. చాలా రోజుల క్రితం తన పేరెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు. తనకి సెరిబోనల్ హ్యమరేజ్.. ఎక్కువ కాలం బతకదు అనేసరికి చిత్ర షాక్ అవుతుంది

గీత: వసంత్ సీక్రెట్స్ అన్నీ చెప్పేశావా? చెప్పకు అనేసి వెళ్లిపోతూ తలనొప్పితో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా వాళ్ళ చేతుల్లోనే కన్నుమూస్తుంది. ప్రెగ్నెన్సీని సెలెబ్రేట్ చేసుకోవాలని యష్ అంటాడు. కానీ అది తమకి కలిసి రావడం లేదని వేద చెప్తుంది. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. కూతురు తల్లి కాబోతుందని సులోచన చాలా ఆనందపడుతుంది.

తరువాయి భాగంలో..

వేద పిల్లలని కారులో స్కూల్ కి తీసుకెళ్తుంది. సడెన్ గా కారు బ్రేక్స్ ఫెయిల్ కావడంతో వేద కంగారు పడుతుంది. ఖుషి, ఆదిత్యని కారులో నుంచి కిందకి తోసేస్తుంది. తర్వాత నేరుగా వెళ్ళి ఒక చెట్టుని ఢీ కొట్టడంతో వేద కిందపడిపోయి పొట్టకి దెబ్బ తగులుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Youtube Income: యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!
యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Youtube Income: యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!
యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
Embed widget