అన్వేషించండి

Raksha Bandhan 2023: ఆగష్టు 30 or 31 రక్షాబంధన్ ఎప్పుడు, రాఖీ పండుగ ఎప్పుడు - ఎలా మొదలైంది!

Raksha Bandhan Shubh Muhurt 2023: చాలా ప్రత్యేకదినాల్లా రక్షా బంధన్ కూడా పాశ్చాత్య పండుగల్లో భాగమే అనుకుంటే పొరపాటే. పురాణ కాలం నుంచీ ఈ పండుగ జరుపుకుంటున్నారు

Raksha Bandhan 2023:  ఆగస్టు 31 గురువారం రాఖీ పౌర్ణమి. 
శ్రావణ పౌర్ణమి ఆగష్టు 30 బుధవారం ఉదంయ 10 గంటల 33 నిముషాలకు ప్రారంభమై ఆగష్టు 31 గురువారం ఉదయం 8 గంటలవరకూ ఉంది. సాధారణంగా పండుగలకు సూర్యోదయానికి ఉన్న తిథిని లెక్కలోకి తీసుకుంటారు కావున..రాఖీ పౌర్ణమి గురువారం జరుపుకోవాలని పంచాంగ కర్తలు నిర్ణయించారు. అయితే ఈ వేడుకను కొందరు సాయంత్రం సెలబ్రెట్ చేసుకుంటారు..వారంతా ఆగష్టు 30 రోజునే చేసుకోవచ్చని సూచిస్తున్నారు. 

రాఖీ పండుగ ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలియజేస్తూ ఎన్నో పురాణ కథనాలున్నాయి....

ఇంద్రుడి భార్య మొదలుపెట్టిన రాఖీ పండుగ

దేవతలకు, రాక్షసుల కు మధ్య దాదాపు పన్నెండేళ్లు యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు ఇంద్రుడుతన పరివారాన్ని తీసుకెళ్లి   అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి...దేవేంద్రుడు యుద్ధంలో పాల్గొనేలా ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలంతా వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. యద్ధంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం..రాఖీ పండుగగా ఆచరిస్తున్నామని పురాణాలు చెబుతున్నాయి.

Also Read: ఆగష్టు 24 రాశిఫలాలు, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ రాశివారి పనితీరు అద్భుతంగా ఉంటుంది

ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం

మహాభారతంలో శ్రీకృష్ణుడు, శిశుపాలుడిని వధించాలని అనుకుంటాడు. అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా... సుదర్శన చక్రాన్ని వదిలే క్షణంలో చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసినవెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా తన చీరకొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి రక్షగా చుట్టింది. అన్నగా భావించి వెంటనే స్పందించినందుకు అండగా ఉంటానని అప్పుడు భరోసా ఇచ్చాడు.ఈ సంఘటనే రాఖీ పండుగకు నాందిగా నిలిచిందని చెబుతారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం కురుసభలో అవమానం ఎదుర్కొంటున్న ద్రౌపదికి అండగా నిలిచాడు శ్రీ కృష్ణుడు.

Also Read: శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతానికి బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు

శ్రీ మహాలక్ష్మి-బలిచక్రవర్తి

రాక్షస రాజు బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు రాక్షసుల నుంచి మనుషులను రక్షించడానికి  శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. 

వినాయకుడి సోదరి ఆవిర్భావం

శ్రావణ పౌర్ణమి రోజున వినాయకుడు తన సోదరి అయిన నాగదేవతతో 'రక్ష' కట్టించుకోవడం చూసిన ఆయన కుమారులు..తమకి కూడా సోదరి కావాలని పట్టుబట్టారట. అప్పుడు వినాయకుడి కళ్లనుంచి సంతోషిమాత ఆవిర్భవించిందని చెబుతారు. అవివాహితులు, పిల్లలు లేని దంపతులు సంతోషి మాతని శుక్రవారం రోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ కట్టిన, కట్టించుకున్నవారిపై సంతోషిమాత దీవెనలుంటాయంటారు. 

చరిత్రలోనూ రాఖీ పౌర్ణమి
పురాణ కాలంలో, ప్రాచీన గ్రంథాల్లోనే కాదు...రాఖీ సంప్రదాయం చరిత్రలోనూ కనిపిస్తుంది. అలగ్జాండర్ మన దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు పురుషోత్తముడనే రాజు నిలువరించాడు. పురుషోత్తముని చేతిలో తన భర్త హతం అవుతాడనే భయంతో...అలగ్జాండర్ భార్య పురుషోత్తముని పతిభిక్ష పెట్టమని వేడుకుంటూ రాఖీని పంపిందట. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెట్టాడని చెబుతారు. 
మొఘల్ పాలనలో చిత్తోడ్ రాజ్యాన్ని ఏలుతున్న కర్నావటి అనే రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయున్ కి రాఖీ పంపిందని చరిత్ర చెబుతోంది. రవీంద్రనాథ్ టాగూర్ కూడా ...స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలందరినీ ఒకటిగా ఉంచేందుకు, రక్షాబంధన్ ప్రోత్సహించారట.

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో ఈ పండుగను బాగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా వైభవంగా జరుపుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Embed widget