అన్వేషించండి

Kirrak RP: బాలకృష్ణ కూడా నా చేపల పులుసే కొంటారు, ఇది కూడా సేవతో సమానం - కిరాక్ ఆర్పీ

Nelluru Peddareddy Chepala Pulusu Prices: జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ ప్రారంభించిన ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ రేట్లపై కిరాక్ ఆర్పీ స్పందించాడు. ఇది చాలా రిస్కీ బిజినెస్ అని పేర్కొన్నాడు.

Kirrak RP about Nelluru Peddareddy Chepala Pulusu Prices: జబర్దస్త్‌లో కమెడియన్స్‌గా తమ కెరీర్‌ను ప్రారంభించిన ప్రస్తుతం టాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ సెటిల్ అయిపోయారు. కానీ మరికొందరు మాత్రం ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏమైపోయారో తెలియదు. అందరికీ భిన్నంగా కిరాక్ ఆర్పీ మాత్రం ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ అనే పేరుతో కర్రీ పాయింట్‌ను ఏర్పాటు చేసి బిజినెస్‌మ్యాన్‌గా సెటిల్ అయిపోయాడు. ప్రస్తుతం తన బిజినెస్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో ఆ కర్రీ పాయింట్‌లో కూరలు చాలా కాస్ట్‌లీ ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో వారందరికీ గట్టి సమాధానమిచ్చాడు ఆర్పీ.

రెండూ ఒకటే రేటు..

‘‘మీకు కిలో చికెన్ తీసుకుంటే కిలో చేతికి వస్తుంది. కానీ కిలో చేప తీసుకుంటే కిలో రాదు. తలకాయ, తోక పోతుంది. మధ్యలో ఉండే ఏడు పీసులే నేను అమ్మాలి. దానికి సాంబార్‌లో వేసినంత నూనె కాదు.. దీనికి వందరెట్లు ఎక్కువ వేయాలి. మామిడి కాయలు వేయాలి. అవి చాలా రేటు ఉంటాయి. ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. లాస్ట్‌లో మసాలా, కొత్తిమీర వేయాలి. దీనికి ఉపయోగించే పదార్థాల రేటు ఎక్కువ ఉంది. అంతే కాకుండా ఇప్పుడు మటన్, బొమ్మిడయిల పులుసు రేటు ఒకేలా ఉంది. మరి మటన్ తినేసి బొమ్మిడాయిలు ఎందుకు అంత రేటుకు ఇస్తున్నారంటే.. రెండూ ఒకే రేటు. రెండు అత్యధిక రేట్లే. ఎవరూ కూడా కావాలని అత్యధిక రేట్లు పెట్టరు’’ అంటూ ‘నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు’ రేట్లపై వస్తున్న విమర్శలపై స్పందించాడు కిరాక్ ఆర్పీ. బాలకృష్ణ, ఖుష్బు వంటి సెలబ్రిటీలు కూడా తన వద్దే చేపల పులుసు కొనుగోలు చేస్తుంటారని ఆర్పీ చెప్పాడు. 

రిస్కీ బిజినెస్..

‘‘నేను కూడా నాసిరకమైన చేపలు తెచ్చి అల్లం పేస్ట్ కలిపి పెట్టాలంటే ఊరికే కూడా ఇస్తా. మీరు మంచి చేపలు తిని బాగుండాలని కోరుకుంటున్నా కాబట్టి రేట్లు అలా పెట్టవలసి వస్తుంది. రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల నా బిజినెస్ జరగదు అని తెలిసినప్పుడు నేను రేట్లు ఎందుకు ఎక్కువ పెడతాను. నేను నష్టపోలేను. నేను చేస్తుంది కూడా సేవతో సమానమే. ఇది మామూలు రిస్కీ బిజినెస్ కాదు. చికెన్, మటన్ దొరికినట్టు అన్ని ప్రదేశాల్లోనూ చేప దొరకదు. ఎక్కడో ఒకచోట మాత్రమే దొరుకుతుంది. బొమ్మిడయిలు వైజాగ్‌లో కూడా దొరకవు. ఎక్కడి నుండో తీసుకురావాలి. ఫిల్టర్ చేయాలి, ఐస్‌లో పెట్టాలి. ఈ రిస్కీ బిజినెస్‌ను ఎవరైతే ఇష్టపడతారో వాళ్లే ఇది చేయాలి’’ అని తెలిపాడు. 

అన్ని బ్రాంచ్‌లు బ్లాక్‌బస్టర్..

కిరాక్ ఆర్పీ ప్రారంభించిన ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పెద్ద హిట్ అవ్వడంతో దీనికి ఫ్రాంచైజ్‌లు ఏర్పాటు చేయడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మణికొండ, అమీర్‌పేట్‌, ఖాజాగూడలో దీని బ్రాంచ్‌లు ఉన్నాయి. అదే విధంగా తిరుపతిలో అయిదు బ్రాంచ్‌లు, వైజాగ్‌లో మూడు బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇక ఈ ‘నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు’ ఎక్కడ ప్రారంభించినా.. అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్టే అవుతుందని కిరాక్ ఆర్పీ తెలిపాడు. ఈ క్రమంలో తాను కూడా కొన్ని ఎదురుదెబ్బలు తిన్నానని బయటపెట్టాడు. తమ దగ్గర ఫుడ్ చాలా నేచురల్‌గా ఉంటుందని, కలర్ పౌడర్లులాంటివి ఉపయోగించమని అన్నాడు.

Also Read: ‘పుష్ప 2’ సెట్‌లో జగదీష్ - జైలు నుంచి విడుదల కాగానే షూటింగ్‌లో బిజీ బిజీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget