అన్వేషించండి

Pushpa 2: ‘పుష్ప 2’ సెట్‌లో జగదీష్ - జైలు నుంచి విడుదల కాగానే షూటింగ్‌లో బిజీ బిజీ

Jagadeesh Bandari: ‘పుష్ప’ సినిమాలో కేశవ పాత్రలో కనిపించి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు జగదీష్ బండారి. కానీ ఒక కేసు విషయంలో జైలుకు వెళ్లొచ్చాడు. తాజాగా ‘పుష్ప 2’ సెట్‌లో అడుగుపెట్టాడు.

Jagadeesh Bandari in Pushpa 2: ‘పుష్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్రకు వరల్డ్ వైడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తనతో పాటు ఎప్పుడూ తన పక్కనే ఉండే ఫ్రెండ్ పాత్రలో నటించిన జగదీష్ బండారికి కూడా అదే రేంజ్‌లో గుర్తింపు లభించింది. కేశవ పాత్రలో కామెడీ చేస్తూనే.. సినిమా మొత్తానికి వాయిస్ ఓవర్‌ను అందించాడు ఈ నటుడు. కానీ కొన్నిరోజుల క్రితం ఒక క్రిమినల్ కేసు విషయంలో ఈ నటుడు అరెస్ట్ అయ్యాడు. కొన్నిరోజులు జైలు జీవితం గడిపిన తర్వాత తాజాగా విడుదలయ్యాడు. ఇప్పుడు మళ్లీ ‘పుష్ప 2’ సెట్‌లో అడుగుపెట్టాడని సమాచారం.

కీలకమైన సీన్ షూటింగ్..

ఒక జూనియర్ ఆర్టిస్టును వేధించాడని, దీంతో ఆమె సూసైడ్ చేసుకుందని జగదీష్ బండారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2023లో జగదీష్‌ను చంచల్‌గూడ జైలుకు కూడా తరలించారు. ఆ తర్వాత కొన్నిరోజులకే తనకు బెయిల్ వచ్చి జైలు నుండి విడుదలయ్యాడు. కానీ జగదీష్‌కు బెయిల్ వచ్చే విషయంలో కూడా ‘పుష్ప’ మేకర్స్ హస్తం ఉందని టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. అందుకే ఒక సూసైడ్ కేసులో నిందితుడు అయినా కూడా తను వెంటనే బయటికి రాగలిగాడని అప్పట్లో సినీ సర్కిల్లో గుసగుసలు వినిపించాయి. ఇక జగదీష్ బయటికి వచ్చిన కొన్నిరోజులకే ‘పుష్ప 2’ సెట్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఒక కీలకమైన సీన్ షూటింగ్‌లో తనకు పాల్గొంటున్నట్టు సమాచారం.

గంగమ్మ జాతర సీన్ కోసం..

‘పుష్ప 2’లో గంగమ్మ జాతర సీన్ అనేది చాలా ముఖ్యమైన సీక్వెన్స్. ఇప్పటికే ఈ గంగమ్మ జాతర సీన్‌కు సంబంధించి అల్లు అర్జున్ లుక్‌ను విడుదల చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేశారు మేకర్స్. ఇక ఈ సీన్‌లో అల్లు అర్జున్‌తో పాటు జగదీష్ బండారు ఉండడం కూడా ముఖ్యం కాబట్టి ప్రస్తుతం ఈ సీన్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడట ఈ నటుడు. ప్రస్తుతం జైలుకు వెళ్లొచ్చిన ఒక నటుడు ‘పుష్ప 2’ కోసం షూటింగ్ చేయడం అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పైగా పార్ట్ 1లో తన పాత్రకు విపరీతమైన పాపులారిటీ లభించింది. అలాంటిది 2వ భాగంలో తను లేకపోతే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందని.. పైగా కామెడీ చేసే పాత్ర కూడా ఉండదని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

హీరోగా సినిమా..

‘పుష్ప’ తర్వాత జగదీష్ బండారికి ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆహా ఒరిజినల్ సినిమాగా తెరకెక్కిన ‘సత్తిగాని రెండు ఎకరాలు’ చిత్రంలో లీడ్ రోల్ కూడా చేశాడు. ఇందులో తన నటనకు పాజిటివ్ రివ్యూలు లభించాయి. ఇక ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉందనే పాయింట్‌లో సినిమా ముగుస్తుంది. ప్రస్తుతం ఈ నటుడి చేతిలో ‘పుష్ప 2’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఇంతలోనే తనపై పోలీస్ కేసు నమోదు అవ్వడం తన కెరీర్‌పై నెగిటివ్ ప్రభావం చూపిస్తుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. 2024 ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా లేట్ అవుతూ వచ్చింది. అందుకే హైదరాబాద్‌లో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

Also Read: నాకు ఎవరూ సపోర్ట్‌గా వచ్చి మాట్లాడేవారు కాదు - డీప్ ఫేక్ వీడియోపై రష్మిక ఎమోషనల్‌ కామెంట్స్‌

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Avengers Doomsday Promo : అవెంజర్స్ డూమ్స్ డే ప్రోమో వచ్చేసింది - ఐరన్ మ్యాన్ పవర్ ఫుల్ విలన్
అవెంజర్స్ డూమ్స్ డే ప్రోమో వచ్చేసింది - ఐరన్ మ్యాన్ పవర్ ఫుల్ విలన్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget