Rashmika Mandanna: నాకు ఎవరూ సపోర్ట్‌గా వచ్చి మాట్లాడేవారు కాదు - డీప్ ఫేక్ వీడియోపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్
Rashmika Mandanna: డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది వైరల్ అయ్యింది రష్మిక మందనా వీడియో ద్వారానే. ఇక అప్పట్లో ఈ వీడియో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా దీనిపై మరోసారి స్పందించింది ఈ భామ.
Rashmika Mandanna about DeepFake Video: టెక్నాలజీ వల్ల ఎంతోమంది సినీ సెలబ్రిటీలకు ఎన్నో ఇబ్బందులు కలిగాయి. టెక్నాలజీ అనేది ప్రేక్షకులకు, సెల్రబిటీలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇక డీప్ ఫేక్ అనే టెక్నాలజీ ప్రస్తుతం హీరోయిన్లను భయపెడుతోంది. ఈ టెక్నాలజీ ద్వారా హీరోయిన్ల మొహాలను మార్చి.. అది నిజమైన వీడియో అనిపించేలా క్రియేట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇక ఈ డీప్ ఫేక్ వీడియో వల్ల ముందుగా బాధితురాలిగా మారింది రష్మిక మందనా. తాజాగా దీనిపై మరోసారి రియాక్ట్ అయ్యింది ఈ కన్నడ బ్యూటీ.
డీప్ ఫేక్ వీడియో..
2023 నవంబర్‌లో మొదటిసారి రష్మిక మందనా డీప్ ఫేక్ వీడియో బయటికొచ్చింది. ఇది ఫేక్ అని తెలియక ముందే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో విశ్లేషకులు.. ఇది ఫేక్ వీడియో అంటూ.. డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి బయటపెట్టారు. ఇక దీనిపై చాలామంది సెలబ్రిటీలు స్పందించగా.. పోలీసులు కూడా అలర్ట్ అయ్యి వారిపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఈ వీడియో క్రియేట్ చేసిన నేరగాళ్లు ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్మిక కూడా తన డీప్ ఫేక్ వీడియోపై వెంటనే స్పందించి.. దానిని షేర్ చేస్తూ ఆ వీడియోలో ఉన్నది తను కాదని క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా దీనిపై స్పందించడానికి కారణాలను కూడా వివరించింది ఈ భామ.
సెలబ్రిటీలు ఎదుర్కుంటున్న నెగిటివిటీ..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎదుర్కుంటున్న ఇబ్బందులపై స్పందించింది. సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలపై స్పందించినప్పుడు సెలబ్రిటీలు ఎదుర్కుంటున్న నెగిటివిటీపై మాట్లాడింది. ‘‘చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. మేము అలాంటి సంఘటనల గురించి మాట్లాడడానికి ముందుకొస్తాం. అప్పుడే కొందరు వచ్చి.. ‘మీరే ఈ పనిచేయడానికి ఒప్పుకున్నారు కదా’ అంటారు. లేదా ‘ఇది ఇలాగే ఉంటుంది, దీని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు’ అంటారు. కానీ నా మైండ్‌లో మాత్రం ఒకటే తిరుగుతుంది. ఒకవేళ నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటిది జరిగి ఉంటే నాకు సపోర్ట్‌గా వచ్చి ఎవరూ మాట్లాడేవారు కాదు’’ అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టింది రష్మిక.
అవగాహన కల్పించడం ముఖ్యం..
‘‘మన కల్చర్‌లో సమాజం మన గురించి ఏమనుకుంటుంది అన్నదే మనకు ముఖ్యం. మనం ఎలా రియాక్ట్ అవ్వాలని సమాజం అనుకుంటుందో అలాగే రియాక్ట్ అవ్వాలి. అలాగే ఆలోచించాలి, అలాగే రియాక్ట్ అవ్వాలి. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడడం వల్ల కనీసం 41 మిలియన్ల మందికి దీని గురించి తెలుస్తుంది. డీప్ ఫేక్ అనేది ఒకటి ఉందని వారికి అర్థమవుతుంది. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఇది మనుషుల మానసిక స్థితిపై ఎఫెక్ట్ చూపించి, వారికి ఒత్తిడిని తీసుకొస్తుంది. అందుకే అందరిలో అవగాహన కల్పించడం నాకు ముఖ్యం’’ అంటూ డీప్ ఫేక్ వీడియోపై తాను ఎందుకు స్పందించాలని అనుకుందో బయటపెట్టింది రష్మిక మందనా. డీప్ ఫేక్ వీడియోను తయారు చేసివారిని కాకుండా రష్మికను కూడా ఎంతోమంది ట్రోల్ చేశారు. తను కూడా కావాలనే అలాంటి దుస్తులు ధరిస్తుందని వ్యాఖ్యలు చేశారు. కానీ రష్మిక అవేమీ పట్టించుకోకుండా తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పింది.
Also Read: ‘యానిమల్ పార్క్’పై కీలక అప్డేట్ - కథ సిద్ధం, షూటింగ్ ఎప్పుడంటే?