అన్వేషించండి

Animal Park: ‘యానిమల్ పార్క్’పై కీలక అప్డేట్ - కథ సిద్ధం, షూటింగ్ ఎప్పుడంటే?

Animal Park: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ‘యానిమల్ పార్క్’ గురించి ప్రేక్షకులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ బయటికొచ్చింది.

Animal Park Update: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాను పాజిటివ్‌గా తీసుకున్న వారికంటే నెగిటివ్‌గా తీసుకున్నవారి సంఖ్యే ఎక్కువ. అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు ‘యానిమల్’. పైగా దీనిని ఒక ఫ్రాంచైజ్‌లాగా తెరకెక్కిస్తానని దర్శకుడు సందీప్ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులు మరింత ఆసక్తితో దీనికోసం ఎదురుచూస్తున్నారు. ఇక ‘యానిమల్’కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘యానిమల్ పార్క్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది. 

‘రామాయణ’లో రణబీర్ కపూర్..

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘యానిమల్’లో రెండో భాగంగా వస్తున్న చిత్రమే ‘యానిమల్ పార్క్’. తాజా సమాచారం ప్రకారం ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన బేసిక్ స్క్రిప్ట్ పూర్తయ్యిందట. ఇక ఈ స్క్రిప్ట్ పనిని పూర్తిస్థాయిలో ముగించడం కోసం రైటర్స్‌తో కలిసి సమావేశం అవ్వనున్నాడట సందీప్. ఈ ఏడాది చివరిలోపు స్క్రిప్ట్ పనులు దాదాపుగా ఫైనల్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక స్క్రిప్ట్ పూర్తయినా కూడా రణబీర్ కపూర్ డేట్స్ అందుబాటులో ఉండడం ముఖ్యం. ప్రస్తుతం రణబీర్ కపూర్.. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’లో నటిస్తున్నట్టు సమాచారం.

‘యానిమల్ పార్క్’ కథ అదే..

‘యానిమల్’ కథను రాసుకున్నప్పుడే.. ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన బేసిక్ కథ పూర్తయినట్టు సమాచారం. కానీ దానిని పూర్తిస్థాయి స్క్రిప్ట్‌గా మార్చడానికి మరికాస్త సమయం పడుతుంది. ఇక ‘యానిమల్ పార్క్’ బేసిక్ కథ ప్రకారం.. ఇది రణబీర్ కపూర్ క్యారెక్టర్ అయిన రణవిజయ్ సింగ్‌కు, తనలాగే కనిపించే విలన్‌కు మధ్య జరిగే వైలెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే రణబీర్ కపూర్ తరహాలోనే ఉండే విలన్‌ను ‘యానిమల్’ క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు పరిచయం చేశాడు దర్శకుడు సందీప్. దాంతో పాటు రణవిజయ్ పాత్రకు, తన భార్య గీతాంజలి, వాళ్ల కొడుకుకు మధ్య రిలేషన్‌షిప్‌ను కూడా ‘యానిమల్ పార్క్’లో మరింత స్పష్టంగా చూపించబోతున్నాడట సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం రణబీర్ కపూర్.. ‘రామాయణ’పై ఫోకస్ చేస్తుండగా.. సందీప్ ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానున్నాడు.

‘స్పిరిట్’తో బిజీ..

సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ‘రాజా సాబ్’తో పాటు ‘స్పిరిట్’ షూటింగ్‌ను కూడా ఒకేసారి చేసేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే సందీప్ సోదరుడు ప్రణయ్ వంగా.. ‘యానిమల్ పార్క్’ స్క్రిప్ట్‌పై దృష్టిపెట్టనున్నాడు. రైటర్స్‌తో కలిసి స్క్రిప్ట్‌ను పూర్తిచేసే విషయంలో ప్రణయ్ సాయం చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే రణబీర్ కపూర్, రష్మిక మందనా సైతం ‘యానిమల్ పార్క్’ చాలా వైలెంట్‌గా ఉంటుందని స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2025లో ప్రారంభం కానుంది.

Also Read: ప్రతీ విషయంలో తన అభిప్రాయం నాకు అవసరం - విజయ్‌ గురించి రష్మిక ఆసక్తికర కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Ravi Teja Thulabharam : ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
This Week Theatrical Releases : ఈ దసరాకు మస్త్ ఎంటర్టైన్మెంట్ - ఒకే రోజు థియేటర్లలో మూడు సినిమాలు... మరి మీ ఛాయిస్ ఏంటి?
ఈ దసరాకు మస్త్ ఎంటర్టైన్మెంట్ - ఒకే రోజు థియేటర్లలో మూడు సినిమాలు... మరి మీ ఛాయిస్ ఏంటి?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget