Rashmika Mandanna: ప్రతీ విషయంలో తన అభిప్రాయం నాకు అవసరం - విజయ్ గురించి రష్మిక ఆసక్తికర కామెంట్స్
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందనా డేటింగ్ గురించి ఎంతోకాలంగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో విజయ్‌తో తన రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక.
Rashmika Mandanna about Vijay Devarakonda: ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయిన కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందనా. అసలు వీరిద్దరు జస్ట్ ఫ్రెండ్సా? లేదా లవర్సా? అన్న కన్‌ఫ్యూజన్ చాలామంది ప్రేక్షకుల్లో ఉంది. వీరిద్దరి అధికారికంగా ప్రకటించకపోయినా.. లవర్సే అని ఫిక్స్ అయిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ కొందరు మాత్రం లవర్స్ అయితే అధికారికంగా ప్రకటించాలి కదా అని ఎదురుచూస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో విజయ్, రష్మిక లవర్స్ అని, కలిసి ఉంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ‘యానిమల్’ బ్యూటీ.
విజయ్‌పై వ్యాఖ్యలు..
తాజాగా రష్మిక మందనా.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ చిత్రంలో నటించింది. ఇందులో గీతాంజలి పాత్రకు ప్రేక్షకుల దగ్గర నుండి విశేష స్పందన లభించింది. రణబీర్ కపూర్‌తో పాటు తన యాక్టింగ్ కూడా చాలా బాగుందంటూ ఫ్యాన్స్ ప్రశంసించారు. దీంతో బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది రష్మిక. తాజాగా అలా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడింది. కేవలం విజయ్ గురించి మాత్రమే కాకుండా.. తను కలిసి పనిచేసిన ప్రతీ యాక్టర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అందరితో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పుకొచ్చింది రష్మిక మందనా. కానీ విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలపైనే ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
చాలా గౌరవం ఉంది..
ముందుగా విజయ్ దేవరకొండ గురించి మాట్లాడిన రష్మిక.. ‘విజు, నేను కలిసే ఇండస్ట్రీలో ఎదిగాం. నేను నా జీవితంలో ఏదైతే చేస్తున్నానో అందులో తన సహకారం కూడా ఉంటుంది. నేను చేసే ప్రతీ పనిలో తన సలహా తీసుకుంటాను. నాకు తన అభిప్రాయం కావాలి. తను ప్రతీదానికి ఎస్ చెప్పే వ్యక్తి కాదు. పాయింట్ మాట్లాడతాడు. ఇది బాగుంది, ఇది బాలేదు, నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా అనుకోవడం లేదు అని అన్నీ చెప్తాడు. నా జీవితంలో ఎవరూ సపోర్ట్ చేయనంత చేశాడు. అందుకే తనంటే నాకు చాలా గౌరవం ఉంది’’ అంటూ విజయ్ దేవరకొండ గురించి చాలా గొప్పగా మాట్లాడింది రష్మిక.
క్లారిటీ ఇచ్చిన విజయ్..
ఇక విజయ్, రష్మికల బాండింగ్ చూసి వీరిద్దరి త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని, ఫిబ్రవరీలో వీరి ఎంగేజ్‌మెంట్ గురించి అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వబోతున్నారని రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్ అని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. ‘‘నేను ఫిబ్రవరీలో ఎంగేజ్‌మెంట్ గానీ, పెళ్లి గానీ చేసుకోవడం లేదు. ప్రతీ రెండేళ్లకు ఒకసారి మీడియాకు నాకు పెళ్లి చేయాలని అనిపిస్తున్నట్టుంది. ప్రతీ సంవత్సరం ఇలాంటి రూమర్‌ను వింటుంటాను’’ అంటూ ఎంగేజ్‌మెంట్ లాంటిది ఏమీ లేదని స్పష్టం చేశాడు విజయ్. ప్రస్తుతం విజయ్, రష్మిక.. ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు. ‘యానిమల్’ తెచ్చిపెట్టిన సక్సెస్‌తో రష్మిక.. బాలీవుడ్‌లో బిజీ అవ్వనుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: బ్రహ్మానందం కమెడియన్ కాదు... అంతకు మించి - కంటతడి పెట్టించడమూ వచ్చు!