By: ABP Desam | Updated at : 07 Aug 2023 10:19 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
Brahmamudi August 7th: తన పని వదిలేసుకొని వచ్చినందుకు చిరాకు పడుతుంది అప్పు. దాంతో కళ్యాణ్ అలా వెళ్ళిపోకు.. నాకు సహాయం చేయటానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారంటూ.. పేరు కనుక్కోమని సవాల్ విసిరిన ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవడానికి నువ్వే సహాయం చేయాలి అని తనను అడుగుతాడు. మరోవైపు కావ్య తండ్రి అప్పు ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడే అక్కడికి రాజ్ వచ్చి గుడ్ న్యూస్ చెప్పాలి అనడంతో.. నాకు గుడ్ న్యూస్ చెప్పే వాళ్ళు కూడా ఉంటారా అని కాస్త నిరాశ పడుతూ మాట్లాడుతుంది. దాంతో రాజ్ నిన్ను డిజైనర్ పోస్ట్ కి తీసుకోవటానికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇదే అని అనగా ఆ జాబ్ చేయలేను అని అంటుంది. వెంటనే రాజ్ కోపంతో.. కంపెనీకి నీ అవసరం ఉందని తెలిసి అలా కావాలని చేస్తున్నావా అని అంటాడు.
దానితో కావ్య కావాలంటే డిజైన్ చేసి ఇస్తాను కానీ డబ్బులు తీసుకోలేను అని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక వీరిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ ధాన్య లక్ష్మీ వింటుంది. ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి రాజ్ వచ్చి కావ్య గురించి చెబుతాడు. దాంతో ధాన్య లక్ష్మి కూడా జరిగిన విషయం చెబుతుంది. ఆ తర్వాత కావ్య వినాయకుడికి దండం పెట్టుకుంటూ వెంటనే మట్టి బొమ్మల ఆర్డర్ కోసం అందరికీ ఫోన్ చేస్తుంది.
ఇక రాజ్ తన తల్లితో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఊరికే ఏమి ఇవ్వలేదు.. తన కష్టానికి ప్రతిఫలం ఇచ్చాను అని అంటాడు. అంతేకాకుండా కావ్య ఉద్యోగం చేయడానికి తన తల్లిని ఒప్పిస్తాడు. ఇక ఈ విషయం కావ్య దగ్గరికి వెళ్లి చెప్పిన కూడా తను అస్సలు ఒప్పుకోదు. ఇక మీ వల్లే మా కుటుంబం బ్రతికిందన్న మాటలు భరించలేను అని కావ్య అనటంతో తనకు ఒళ్లంతా పొగరే అని కోపంతో తిట్టుకుంటాడు.
ఆ తర్వాత కావ్యకి విగ్రహాల ఆర్డర్ వస్తుంది. ఇక స్వప్న తన ప్రెగ్నెంట్ విషయంలో అనుమానం వస్తుంది అని రాహుల్తో కమిట్ అవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడే రాహుల్ తాగి రావటంతో.. తిట్టించినందుకు ఆనందంగా ఉంది అని అంటాడు. ఇక రాహుల్ తన ప్రెగ్నెన్సీ మాటలు వినలేదని ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత మత్తులో ఉన్న రాహుల్ ని లొంగ తీసుకోవాలని చూస్తుంది.
ఇక తరువాయి భాగంలో పుట్టింటికి వెళ్ళిన కావ్య అవసరం కోసం బొమ్మలు చేయటానికి మట్టిని కలుపుతూ బొమ్మలు చేస్తూ ఉండగా దుగ్గిరాల కుటుంబం కావ్య బొమ్మలు తయారు చేస్తున్న దృశ్యం మీడియా కంట్ల పడటంతో అందులో చూసి దుగ్గిరాల కుటుంబం ఒకేసారి షాక్ అవుతారు. పైగా వార్తలలో డబ్బుల కోసం దుగ్గిరాల కోడలు రోజువారి కూలీగా చేస్తుందని.. ఆ ఇంట్లో వాళ్లకి అసలు మనసే లేదా అంటూ వార్తలు రావడంతో.. ఆ మాటలు విని రాజ్ షాక్ అయ్యి బాగా కోపంతో రగిలిపోతాడు.
also read it : Madhuranagarilo August 5th: తాగి రచ్చ రచ్చ చేసిన రాధ.. శ్యామ్ తో ప్రేమలో పడ్డ రాధ?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?
Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'
Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌పై రతిక చెత్త కామెంట్స్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>