Karthika Deepam October 4th Update: కార్తీక్ ముందు మోనితని అడ్డంగా బుక్ చేసేసిన దుర్గ, డాక్టర్ బాబు బర్త్ డే సెలబ్రేట్ చేసిన వంటలక్క
కార్తీకదీపం అక్టోబరు 4 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క
Karthika Deepam October 4th Episode 1474 (కార్తీకదీపం అక్టోబరు 4 ఎపిసోడ్)
దుర్గ రీఎంట్రీతో మోనితలో టెన్షన్ మొదలైంది. కార్తీక్ తనను అనుమానిస్తున్నాడని టెన్షన్ పడుతుంది మోనిత. దుర్గ విషయంలో నువ్వేమైనా అనుకుంటున్నావా అని మోనిత అడిగితే.. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదే అంటాడు కార్తీక్
మోనిత: నేను ఏ తప్పూ చేయలేదు కానీ దుర్గ చెప్పింది నమ్ముతావేమో అని
కార్తీక్: నువ్వు ఏ తప్పూ చేయకపోతే దుర్గ ఇంత చేస్తున్నా ఎందుకు ఊరుకున్నావ్..ఏసంబంధం లేకపోతే ఎందుకు ఏమీ అడగలేకపోతున్నావ్
మోనిత: నువ్వు నా గురించి తప్పుగా అనుకోవాలని ఆడుతున్న నాటకం
కార్తీక్: నేను నీ గురించి తప్పుగా అనుకుంటే తనకి వచ్చే లాభం ఏంటి..ఎవరతను
మోనిత: అంతా వివరంగా తర్వాత చెబుతాను నేను ఏ తప్పూ చేయలేదు..నన్ను నమ్ము కార్తీక్ నా గురించి తప్పుగా అనుకోవద్దు..నన్ను నమ్ము కార్తీక్ నేను ఏ తప్పూ చేయలేదు... ( ఆ మాటకి కార్తీక్ కి గతంలో దీపని రిజెస్ట్ చేసిన విషయం గుర్తొస్తుంది..నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిని కాదు అంటూ అరుస్తాడు)...
బయటి నుంచి విన్న దీప..గతం గుర్తుచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టున్నారు అది మంచిది కాదని డాక్టర్ చెప్పాడు కదా అని గుర్తుచేసుకుని ఆ పక్కనే ఉన్న బట్టల స్టాండ్ కింద పడేసి డిస్ట్రబ్ చేస్తుంది.. నార్మల్ అయిన కార్తీక్..రూమ్ లోపలకు వెళ్లిపోతాడు...
మోనిత మాత్రం...నేను తండ్రినికాదని కార్తీక్ అన్నమాటలు గుర్తుచేసుకుని టెన్షన్ పడుతుంది..
Also Read: దిమ్మ తిరిగేలా షాకుల మీద షాకులిచ్చిన దీప- కార్తీక్ ముందు అడ్డంగా బుక్కైయిపోయిన మోనిత
మోనిత ఏమంటోంది దీపమ్మా అన్న దుర్గతో..మోనితతో పాటూ డాక్టర్ బాబుపై కూడా ఎఫెక్ట్ చూపించినట్టుంది.. ఇప్పుడు వాళ్లమధ్య ఏం డిస్కషన్ వచ్చిందో ఏమో..నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని కాదన్నారు...కానీ బలవంతంగా గతం గుర్తుచేయకూడదని డాక్టర్లు చెప్పారు కదా అందుకే డిస్ట్రబ్ చేశానని చెబుతుంది..
దుర్గ: అలా ఎందుకు చేశావ్..పనిలో పనిగా గుర్తొచ్చేది కదా... ప్రస్తుతానికి కార్తీక్ బాబుకి మోనితపై అనుమానం వచ్చింది.. ఆడది ఏ మాటనైనా భరిస్తుంది కానీ అక్రమ సంబంధం అంటగడితే భరించలేదు..అనుమానంతో కార్తీక్ బాబుతో బయటకు గెంటించుకోవడం కన్నా నిజం ఒప్పుకోవడం ఉత్తమం కదా..అదే జరుగుతుంది..
దీప: నా దగ్గర ఓ ప్లాన్ ఉంది..అదే జరిగితే..డాక్టర్ బాబుకి మోనిత భార్య కాదని తెలిసిపోతుంది..
దుర్గ: కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను..ఈ దెబ్బకి కార్తీక్ బాబు చేతిలో మోనిత చెంప పగిలిపోవాలి...
వెంటనే కార్తీక్ మోనిత చెంప పగులగొడతాడు...దీపతో వచ్చిన కార్తీక్ ని చూసి..దాని చేయి పట్టుకున్నావేంటి అన్న మోనితపై ఫైర్ అవుతాడు కార్తీక్..
కార్తీక్: నువ్వు నా భార్యవా..నా గతం మరిచిపోయేలా చేసి నువ్వు నా భార్యవి అవుదాం అనుకుంటున్నావా
మోనిత: ఈ వంటలక్క మాటలు నమ్ముతున్నావా..
కార్తీక్: దీప నా భార్య..గతం మర్చిపోయిన నాకు భవిష్యత్ లేకుండా చేద్దాం అనుకుంటున్నావా...
మోనిత: నేను ఏం చేసినా నీపై ప్రేమతోనే..ఇప్పుడైనా నా ప్రేమ అర్థం కావడం లేదా..
కార్తీక్: నీది ప్రేమ కాదు పిచ్చి,పైశాచికత్వం... ఒకప్పుడో నీ పిచ్చితో వెంటపడినప్పుడే తరిమికొట్టాను..అయినా సిగ్గులేకుండా నా వెంటపడుతున్నావ్.. ప్రాణాలు పోయినా ఓ మనిషి బతికే ఉన్నాడని తెలిస్తే ఆ కుటుంబం ఎంత సంతోషిస్తుందో తెలుసా.. నాకోసం వచ్చిన నా భార్యని నానా ఇబ్బందులకు గురిచేశావ్
మోనిత: నేను ఏం చేసినా నీకోసమే..నిన్ను వదులుకోలేకే..అర్థం చేసుకో కార్తీక్..
కార్తీక్: నన్ను నమ్మించడం కోసం ఓ ఊరినే సృష్టిస్తావా.. నా భార్యపై అంతపెద్ద నిందవేస్తావా..తను ఏం అన్యాయంచేసింది.. నా భార్యని నేనే అనుమానించేలా చేశావ్..నిన్ను ఏం చేసినా పాపం లేదు...
ఇదంతా మోనిత కల....
టెన్షన్ పడుతున్న మోనిత దగ్గరకు వచ్చి కార్తీక్...ఏమైందని అడుగుతాడు.. ఏం లేదులే అని కవర్ చేస్తుంది..అబద్ధాన్ని బాగా కవర్ చేస్తున్నావ్ మోనిత అన్న కార్తీక్..ఏది నిజమో ఏది అబద్ధమో నీకన్నా బాగా ఎవ్వరూ చెప్పలేరని అనేసి వెళ్లిపోతాడు...ఈ దుర్గ ఎఫెక్ట్ బాగా పడింది..వీడిక్కడే ఉంటే కార్తీక్ నన్ను వదిలేసి వెళ్లిపోతాడు అనుకుంటుంది..
Also Read: ఇద్దరూ ఇద్దరే అసలు తగ్గడం లేదు- రిషి కోసం దేవయాని ముందు తలవంచిన మహేంద్ర
దీప-దుర్గ: అటు దీప తులసికోట దగ్గర పూజ చేస్తూ తొందర్లేనే నా భర్త నన్ను గుర్తుపడతాడనే నమ్మకం ఉందని దండం పెట్టుకుంటుంది. ఇంతలో దుర్గ..పండుగ కోసం పూలు,సామాన్లు తీసుకొస్తాడు. సీతమ్మకి ఆంజనేయుడిలా దీపమ్మకి దుర్గ అని అభయం ఇస్తాడు. నువ్వు వచ్చాకే మళ్లీ డాక్టర్ బాబు నాకు దక్కుతాడనే నమ్మకం వచ్చింది..ఇంత నమ్మకంగా ప్రయత్నిస్తున్నానంటే నువ్వుండడం వల్లే అంటుంది. ఇప్పుడే వెళ్లి మోనితకి చిన్న జర్క్ ఇచ్చి వస్తానంటాడు దుర్గ...
కార్తీక్-మోనిత: కార్తీక్ కూర్చుని ఆలోచిస్తుంటాడు..ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో అనుకుంటూ మోనిత పకోడి తీసుకుని వస్తుంది. వర్షం పడితే చాలు పకోడి కావాలని అడిగేవాడివి అంటూ ఓకట్టుకథ మొదలుపెడుతుంది. ( కార్తీక్ గతంలో హోటల్లో పనిచేసినప్పుడు సైకిల్ పై తిరిగిన సందర్భం గుర్తుచేసుకుంటాడు)..సైకిల్ పై వెళ్లడం గుర్తొస్తోంది కానీ నేను ఒక్కడినే వెళుతున్నట్టు గుర్తొస్తోంది.. నువ్వు లేవు మోనిత అంటాడు... నన్ను ముందు కూర్చోబెట్టుకుని తొక్కేవాడివి కదా..అయినా బలవంతంగా గుర్తుచేసుకోవద్దంటుంది. నువ్వు లేవు..నువ్వు అస్సలు లేవు మోనిత ...నువ్వు చెప్పేది ఏదీ సింకవడం లేదు.. నువ్వేదో చెబుతున్నావు నాకు ఇంకేదో గుర్తొస్తోంది అంటాడు.. ఇంతలో దుర్గ ఎంట్రీ ఇస్తాడు...
దుర్గా-మోనిత: దుర్గా నీకు పకోడి అంటే ఇష్టం..చేస్తాను రమ్మని చెప్పి..రావడం పది నిముషాలు లేటయ్యేసరికి సార్ కి పెట్టేస్తావా అంటాడు దుర్గ. కార్తీక్ అదంతా అబద్దం అని మోనిత ఎంతచెబుతున్నా దుర్గ మాత్రం అస్సలు తగ్గడు... కాల్ చేసి పిలిచిందని చెబుతాడు.. నేను కాల్ చేయలేదని మోనిత చెబుతున్నా కార్తీక్ మాత్రం నమ్మడు( దుర్గే మోనిత ఫోన్ తీసుకుని డయల్ చేసుకుంటాడు). సార్ కి మనగురించి తెలుసు తప్పుగా అనుకోరు అంటాడు దుర్గ...
ఎపిసోడ్ ముగిసింది..
రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
ఏంటి డాక్టర్ బాబు అప్పుడే నిద్రపోయారా అంటూ దీప తలుపు కొడుతుంది... అర్థరాత్రి కాల్ చేసి నిద్రపోయారా అని అడుగుతావేంటని మోనిత చిరాకు పడుతుంది. ఈ రోజు మీ పుట్టినరోజు పండుగ అని పూలు ఇస్తుంది దీప. మర్చిపోయావా మోనిత అని దీప అంటే..నేను మర్చిపోలేదని కవర్ చేస్తుంది...